BSNL Recharge Plan : BSNL చీపెస్ట్ ప్లాన్ అదుర్స్.. సింగిల్ రీఛార్జ్‌తో 330 రోజుల వ్యాలిడిటీ.. అన్‌లిమిటెడ్ కాలింగ్, 495GB హైస్పీడ్ డేటా..!

BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ చౌకైన ధరకే రీఛార్జ్ ప్లాన్ అందిస్తోంది. సింగిల్ రీఛార్జ్‌తో 330 రోజుల వ్యాలిడిటీని అందిస్తుంది.

BSNL Recharge Plan : BSNL చీపెస్ట్ ప్లాన్ అదుర్స్.. సింగిల్ రీఛార్జ్‌తో 330 రోజుల వ్యాలిడిటీ.. అన్‌లిమిటెడ్ కాలింగ్, 495GB హైస్పీడ్ డేటా..!

BSNL Recharge Plan

Updated On : September 29, 2025 / 3:05 PM IST

BSNL Recharge Plan : బీఎస్ఎన్ఎల్ కస్టమర్లకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్ఎన్ఎల్ 330 రోజుల లాంగ్ వ్యాలిడిటీతో తక్కువ ధరకే సరికొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ వినియోగదారులకు అన్‌లిమిటెడ్ కాలింగ్, డేటా, లిమిటెడ్ టైమ్ వరకు డిస్కౌంట్‌ను అందిస్తుంది.

ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ ఇప్పటికే (BSNL Recharge Plan) అనేక ఇతర లాంగ్ టైమ్ ప్లాన్‌లను అందిస్తుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 395 రోజుల వరకు ఉంటుంది. ఆసక్తిగల వినియోగదారులు ఈ కొత్త ఆఫర్‌తో అక్టోబర్ 15 వరకు రీఛార్జ్ చేసుకుంటే 2 శాతం తగ్గింపు పొందవచ్చు.

బీఎస్ఎన్ఎల్ 330 రోజుల ప్లాన్ వివరాలివే :
బీఎస్ఎన్ఎల్ ఎక్స్ హ్యాండిల్ ద్వారా ఈ ప్లాన్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ రీఛార్జ్ ధర రూ.1,999 ఉండగా ఏయే బెనిఫిట్స్ అందిస్తుందో ఇప్పుడు చూద్దాం..
కాలింగ్ : ఫ్రీ నేషనల్ రోమింగ్‌తో సహా భారత్ అంతటా అన్‌లిమిటెడ్ కాలింగ్.
డేటా : మొత్తం వ్యాలిడిటీ కాలానికి రోజుకు 1.5GB డేటా, మొత్తం 495GB డేటా.
SMS : రోజుకు 100 ఫ్రీ SMS మెసేజ్‌లు
అదనపు బెనిఫిట్స్ : అన్ని బీఎస్ఎన్ఎల్ ప్లాన్‌లతో BiTV యాప్‌కు బేసిక్ సబ్‌స్ర్కిప్షన్ ఫ్రీ

Read Also : Apple iPhone 17e Launch : ఆపిల్ అభిమానులకు పండగే.. కొత్త ఐఫోన్ 17e మోడల్ వచ్చేస్తోందోచ్.. భారత్‌లో లాంచ్ డేట్ ఎప్పుడంటే? ఫుల్ డిటెయిల్స్!

డిస్కౌంట్ ఎలా పొందాలి? :
బీఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్‌సైట్ లేదా సెల్ఫ్ కేర్ యాప్ ద్వారా రూ.1,999 ప్లాన్‌ రీఛార్జ్ చేసుకునే యూజర్లకు 2 శాతం తగ్గింపు లభిస్తుంది. ఈ ప్రమోషనల్ ఆఫర్ అక్టోబర్ 15 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

బీఎస్ఎన్ఎల్ 4G, 5G సర్వీసులు :
బీఎస్ఎన్ఎల్ భారత్ అంతటా 4G సర్వీసులను అధికారికంగా ప్రారంభించింది. పూర్తిగా స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో 4G నెట్‌వర్క్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. బీఎస్ఎన్ఎల్ ఏకకాలంలో 98వేల 4G టవర్లను ఏర్పాటు చేసి దేశంలోనే మొట్టమొదటి టెలికాం ప్రొవైడర్‌గా నిలిచింది.

రాబోయే రోజుల్లో సుమారు లక్ష టవర్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఇంకా, బీఎస్ఎన్ఎల్ 4G నెట్‌వర్క్ ఇప్పటికే 5G రెడీగా ఉంది. ఆసక్తిగల వినియోగదారులు త్వరలో కంపెనీ 5G సర్వీసు నుంచి ప్రయోజనం పొందేందుకు వీలు కల్పిస్తుంది. బీఎస్ఎన్ఎల్ ఈ ఏడాది చివరి నాటికి 5G సర్వీసును వాణిజ్యపరంగా ప్రారంభించాలని భావిస్తోంది.