10 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జింగ్… సూపర్ కదూ… టాప్ 5 ఫాస్ట్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్లు ఇవే…
బ్యాటరీ బ్యాకప్ కూడా అదుర్స్..

పోటీ ప్రపంచంలో ప్రతి పనిని వేగంగా, సమర్థంగా చేయాల్సి ఉంటుంది. చివరకు స్మార్ట్‌ఫోన్ కూడా త్వరగా ఛార్జ్ కావాలని అందరూ భావిస్తారు. 240w ఫాస్ట్ ఛార్జింగ్ వేగంతో కొన్ని స్మార్ట్‌ఫోన్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి ప్రత్యేకతలను చూద్దాం…
Realme GT3
Realme GT3 స్మార్ట్‌ఫోన్ అత్యంత వేగంగా ఛార్జ్ అవుతుంది. పూర్తిగా ఛార్జ్ చేయడానికి 9 నిమిషాల 30 సెకన్లు మాత్రమే పడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని బలమైన ప్రాసెసర్, అద్భుతమైన స్క్రీన్ కారణంగా ఇది గేమింగ్, వీడియోలను చూడటానికి ఇది బాగా ఉపయోగపడుతుంది. దీని 4600mAh బ్యాటరీ, 240w ఫాస్ట్ ఛార్జింగ్ వేగం, బ్యాటరీ బ్యాకప్ నాణ్యతతో యూజర్లను ఆకర్షిస్తోంది. ఇది స్నాప్‌డ్రాగన్ 8+ జనరేషన్-1, 16GB RAM, 6.74-అంగుళాల AMOLED స్క్రీన్‌తో అందుబాటులో ఉంది.
Also Read: 7,000mAh బ్యాటరీతో వచ్చిన ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ ఆఫర్.. వదులుకోవద్దు..
Realme GT5
Realme GT5 స్మార్ట్‌ఫోన్ 5,240mAh బ్యాటరీ సామర్థ్యం, 240w ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యంతో వచ్చింది. ఫాస్ట్-ఛార్జింగ్ వల్ల యూజర్లకు బాగా నచ్చుతోంది. ఒక్కసారి ఛార్జింగ్ నింపుకుంటే రోజంతా బ్యాకప్ ఉంటుంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ప్రాసెసర్, 16GB RAM, 6.74-అంగుళాల OLED స్క్రీన్ ఉన్నాయి.
iQOO 11 Pro
iQOO 11 Pro స్మార్ట్‌ఫోన్ 4,700mAh బ్యాటరీ, 240w ఫాస్ట్ ఛార్జింగ్‌తో వచ్చింది. బ్యూటిఫుల్ స్క్రీన్, వేగవంతమైన పనితీరు దీని ప్రత్యేకతలు. 10 నిమిషాల్లో ఛార్జింగ్ నిండుతుతంది. ఈ స్మార్ట్‌ఫోన్ 144 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED స్క్రీన్, 16GB RAM, స్నాప్‌డ్రాగన్ 8 Gen 2తో వచ్చింది.
ASUS ROG ఫోన్ 7
ASUS ROG ఫోన్ 7 స్మార్ట్‌ఫోన్ 6,000 mAh బ్యాటరీ, 240w ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్‌తో వచ్చింది. బ్యాటరీ బ్యాకప్ బాగుండడంతో పాటు పూర్తిగా ఛార్జ్ చేయడానికి కేవలం 15 నిమిషాలు మాత్రమే పడుతుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 165 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల AMOLED స్క్రీన్‌తో వచ్చింది. గేమింగ్ కోసం స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్ 2 ఇందులో ఉంది.
OnePlus 12
OnePlus 12 స్మార్ట్‌ఫోన్ 240-వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్, 5000 mAh బ్యాటరీ బ్యాకప్‌తో ఈ స్మార్ట్‌ఫోన్ వచ్చింది. ఇది 6.7-అంగుళాల ఫ్లూయిడ్ AMOLED స్క్రీన్, స్నాప్‌డ్రాగన్ 8 జనరేషన్-2 ప్రాసెసర్ ఉంది. ఇది దాదాపు 12 నిమిషాల్లో పూర్తిగా ఛార్జ్ అవుతుంది.