CMF Phone 2 Pro : ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్ ఆఫర్లు అదుర్స్.. CMF ఫోన్ 2 ప్రో భారీగా తగ్గిందోచ్.. ఇంత తక్కువ ధరకు మళ్లీ దొరకదు..!

CMF Phone 2 Pro : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ సమయంలో సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో ధర భారీ తగ్గింపుతో లభిస్తోంది. ఈ ఆఫర్ ఎలా పొందాలంటే?

CMF Phone 2 Pro : ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్ ఆఫర్లు అదుర్స్.. CMF ఫోన్ 2 ప్రో భారీగా తగ్గిందోచ్.. ఇంత తక్కువ ధరకు మళ్లీ దొరకదు..!

CMF Phone 2 Pro

Updated On : September 25, 2025 / 7:56 PM IST

CMF Phone 2 Pro : పండగ సీజన్ సందడి మొదలైంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌ సందర్భంగా ఫ్యాషన్, ఎలక్ట్రానిక్స్ నుంచి హోం అప్లియన్సెస్ వరకు వైడ్ రేంజ్ ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లను అందిస్తోంది. ఎప్పటిలాగే, ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి.

పలు పాపులర్ మోడళ్లపై భారీ ధర తగ్గింపులు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాదిలో అత్యంత ఆకర్షణీయమైన డీల్స్‌లో ఇదొకటి. ఈ సేల్ సమయంలో CMF ఫోన్ 2 ప్రోని రూ. 15వేల లోపు ధరకే సొంతం చేసుకోవచ్చు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. అవేంటో ఓసారి పరిశీలిద్దాం..

సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో ఫ్లిప్‌కార్ట్ డీల్ :
భారత మార్కెట్లో CMF ఫోన్ 2 ప్రో రూ.18,999 ప్రారంభ ధరకు లాంచ్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో ప్రస్తుతం ఈ ఫోన్ రూ.15,999కి లిస్ట్ అయింది. ఈ-కామర్స్ దిగ్గజం బిగ్ బిలియన్ డేస్ సేల్ సందర్భంగా సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రోపై రూ.3వేలు ఫ్లాట్ డిస్కౌంట్‌ను అందిస్తోంది.

Read Also : Paytm Gold Coins : పండగ చేస్కోండి.. పేటీఎంలో కొత్త ఫీచర్.. ఇక ప్రతి పేమెంట్‌పై గోల్డ్ కాయిన్స్ పొందొచ్చు.. ఇదేలా పనిచేస్తుందంటే?

అంతేకాదు.. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఎస్బీఐ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా కోటక్ బ్యాంక్ క్రెడిట్/డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తేఅదనంగా రూ.1,000 తగ్గింపు పొందవచ్చు. ఇంకా ఎక్కువ సేవింగ్ కోసం మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను కూడా ట్రేడ్ చేయవచ్చు.

సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రో మోడల్ 6.77-అంగుళాల FHD+ అమోల్డ్ డిస్‌ప్లేతో వస్తుంది. 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 3000 నిట్‌ల గరిష్ట ప్రకాశం, 1.07 బిలియన్ కలర్లను అందిస్తుంది. ఈ సీఎంఎఫ్ హ్యాండ్‌సెట్ మీడియాటెక్ డైమన్షిటీ 7300 ప్రో 5జీ చిప్‌సెట్‌తో వస్తుంది.

ఇంకా, ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. ఆప్టిక్స్ పరంగా, సీఎంఎఫ్ ఫోన్ 2 ప్రోలో 50MP ప్రైమరీ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రావైడ్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం, ఫోన్ ఫ్రంట్ సైడ్ 16MP కెమెరాను కలిగి ఉంది.