CMF ఫోన్ 2 ప్రో అమ్మకాలు షురూ.. తక్కువ ధరకు హై ఎండ్ ఫీచర్లు.. ఆఫర్ కొన్ని రోజులే..
ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, లైట్ గ్రీన్, ఆరెంజ్, వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంది.

CMF Phone 2 Pro
CMF ఫోన్ 2 ప్రో ఏప్రిల్ 28న లాంచ్ అయిన విషయం తెలిసిందే. సోమవారం నుంచి దీని సేల్స్ ప్రారంభమయ్యాయి. ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో CMF ఫోన్ 2 ప్రోకు మంచి డిమాండ్ వస్తున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌పై లాంచ్ ఆఫర్ అందుబాటులో ఉంది. తక్కువ ధరకే హై ఎండ్ ఫీచర్లు ఉండే స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటున్న వారు CMF ఫోన్ 2 ప్రోను కొనొచ్చు.
CMF ఫోన్ 2 ప్రో డిస్ప్లే, డిజైన్
ఈ స్మార్ట్‌ఫోన్ పూర్తి HD+ డిస్ప్లేతో, 6.77 అంగుళాల AMOLED స్క్రీన్‌తో వచ్చింది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో లాంచ్ అయింది. లాగ్-ఫ్రీ, సిల్కీ స్మూత్ గేమింగ్ స్క్రోలింగ్ ఉంటుంది. స్క్రీన్ HDR10+ సపోర్ట్ కూడా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై సినిమాలు చూడటానికి, గేమ్‌లు ఆడటానికి అనువుగా ఉంటుంది.
డిజైన్ విషయానికి వస్తే.. CMF ఫోన్ 2 ప్రో కేవలం 7.8mm తిక్‌నెస్ (మందం)తో 185g బరువుతో వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్ బ్లాక్, లైట్ గ్రీన్, ఆరెంజ్, వైట్ కలర్స్‌లో అందుబాటులో ఉంది. IP54 రేటింగ్‌తో డస్ట్, వాటర్ రెసిస్టెన్సీతో వచ్చింది.
Also Read: వన్‌ప్లస్ 12పై భారీ డిస్కౌంట్.. ఈ ఛాన్స్ మిస్ చేసుకోవద్దు..
పర్ఫార్మన్స్, బ్యాటరీ, కెమెరా
CMF ఫోన్ 2 ప్రో మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రోతో రన్ అవుతుంది. 8GB RAMతో వచ్చింది. బ్యాటరీ విషయానికి వస్తే CMF ఫోన్ 2 ప్రో 5000mAh సామర్థ్యంతో అందుబాటులో ఉంది. కేబుల్ ద్వారా 33W ఛార్జింగ్, 5W రివర్స్ ఛార్జింగ్ చేసుకోవచ్చు.
ఫొటోగ్రఫీకి ఈ స్మార్ట్‌ఫోన్ అనుకూలంగా ఉంటుంది. CMF ఫోన్ 2 ప్రో ట్రిపుల్-కెమెరా సిస్టమ్‌తో వచ్చింది. 50MP మెయిన్ కెమెరా, 2x ఆప్టికల్ జూమ్‌తో కూడిన 50MP టెలిఫొటో లెన్స్ ఇందులో ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 16MP ఫ్రంట్ కెమెరా ఉంది.
CMF ఫోన్ 2 ప్రో 128GB, 256GB స్టోరేజ్‌తో వచ్చింది. మైక్రో SD కార్డ్ ద్వారా అదనంగా 2TB స్టోరేజ్‌ను పెంచుకోవచ్చు. ఫ్లిప్‌కార్ట్, ఫ్లిప్‌కార్ట్ మినిట్స్, విజయ్ సేల్స్, క్రోమా, ఇతర రిటైల్ షాపుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది.
CMF ఫోన్ 2 ప్రో ధరలు
8GB RAM + 128GB: రూ.18,999
8GB RAM + 256GB: రూ.20,999
స్పెషల్ లాంచ్ ఆఫర్‌లో..
8GB RAM + 128GB: రూ.16,999
8GB RAM + 256GB: రూ.18,999