Apple iPhones Steal : కస్టమర్ల ఐఫోన్లను కొట్టేసిన డెలివరీ ఏజెంట్.. ఆ 10 ఐఫోన్లను ఎలా మార్చాడో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Apple iPhones Steal : దొంగలకే ఘరానా దొంగలా ఉన్నాడు.. డెలివరీ ఏజెంట్‌గా కస్టమర్లకు డెలివరీ చేయాల్సిన ఐఫోన్లను ఎలా తెలివిగా కొట్టేశాడో తెలిస్తే షాకవ్వాల్సిందే..

Delivery man in Gurugram steals 10 iPhones, replaces them with fake phones before delivery
Apple iPhones Steal : ఇతడో డెలివరీ ఏజెంట్.. ఆన్లైన్లో ఆర్డర్ చేసినది కస్టమర్లకు నేరుగా డెలివరీ చేస్తుంటాడు. కానీ, ఐఫోన్లను చూడగానే అతడిలో దొంగ బయటకు వచ్చాడు. ఐఫోన్లను చూసి టెంప్ట్ అయ్యాడు.. ఏకంగా పది ఐఫోన్లను కొట్టేశాడు. 10 ఐఫోన్లతో పాటు ఎయిర్ పోడ్స్ (Airpod)ని దొంగిలించిన ఘటన గురుగ్రామ్‌లో జరిగింది. ఈ-కామర్స్ కంపెనీకి చెందిన డెలివరీ ఏజెంట్ 10 ఐఫోన్లను దొంగిలించాడు. ఐఫోన్లు లేదా ఇతర ఆపిల్ గాడ్జెట్లను బ్లాక్ మార్కెట్లో అమ్మడం ద్వారా డబ్బులు సంపాదించాలని భావించాడు.
అందుకే, డెలివరీ చేయాల్సిన 10 ఐఫోన్లను డెలివరీ చేయడానికి ముందే కాజేశాడు. రియల్ ఐఫోన్ల స్థానంలో ఫేక్ ఐఫోన్లను పెట్టి కస్టమర్లకు డెలివరీ చేశాడు. నివేదిక ప్రకారం.. గురుగ్రామ్‌లోని ఇ-కామర్స్ సంస్థ డెలివరీ ఎగ్జిక్యూటివ్ 10 ఐఫోన్లను దొంగిలించాడంటూ పోలీసులకు ఫిర్యాదు అందింది. అమెజాన్ పార్సెల్‌లను డెలివరీ చేసే మ్యాట్రిక్స్ ఫైనాన్స్ సొల్యూషన్ స్టేషన్ ఇన్చార్జ్ రవి డెలివరీ ఏజెంట్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మార్చి 27న లలిత్ అనే డెలివరీ ఎగ్జిక్యూటివ్.. కస్టమర్‌కు డెలివరీ చేసేందుకు 10 ఐఫోన్లు, ఎయిర్‌పాడ్‌లతో పార్శిల్ ఇచ్చినట్టు రవి తన ఫిర్యాదులో తెలిపారు. లలిత్ పార్శిల్‌ను డెలివరీ చేయకుండా ఐఫోన్ల స్థానంలో ఫేక్ ఐఫోన్లను ఉంచాడు. ఆ తర్వాత కస్టమర్లు అందుబాటులో లేరని చెప్పి కంపెనీకి తిరిగి ఇచ్చాడు.
Read Also : Apple Days Sale : ఏప్రిల్ 29 నుంచి ఆపిల్ డేస్ సేల్.. ఐఫోన్ 13పై భారీ డీల్స్.. మరెన్నో ఆఫర్లు..!
అయితే, పార్శిల్ తిరిగి వచ్చిన తర్వాత డెలివరీ కంపెనీ ప్యాకేజింగ్‌లో ఏదో తేడా జరిగినట్టు అనుమానించింది. వెంటనే ఆ ప్యాకేజీని తెరవగా.. లోపల ఫేక్ ఫోన్లు ఉన్నట్టు గుర్తించారు. ఆ తరువాత, బిలాస్పూర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా.. పలు సెక్షన్ల లలిత్‌పై కేసు నమోదైంది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

Delivery man in Gurugram steals 10 iPhones, replaces them with fake phones before delivery
అమెరికాలోని సియాటిల్‌లో కొంతమంది దొంగలు రూ. 4.10 కోట్ల ($500,000) విలువైన 436 ఐఫోన్లను దొంగిలించారు. ఫోన్లు స్టోర్ చేసిన బ్యాక్రూమలోకి వెళ్లేందుకు బాత్రూమ్ గోడ గుండా ఆపిల్ స్టోర్‌లోకి సొరంగం తవ్వారు. స్థానిక వార్తల ప్రకారం.. దొంగలు సీటెల్ కాఫీ గేర్‌లోకి చొరబడ్డారు.
ఆ పక్కనే ఉన్న ఆపిల్ స్టోర్ బ్యాక్‌రూమ్‌లో వెళ్లేందుకు బాత్రూమ్ గోడకు రంధ్రం చేశారు. ఆపిల్ స్టోర్ సెక్యూరిటీ సిస్టమ్‌ను దాటి ఐఫోన్లను దొంగిలించారు. సీటెల్ కాఫీ గేర్ తాళాలను మార్చేందుకు దాదాపు 900 డాలర్లు ఖర్చు చేయాల్సి వచ్చింది. బాత్రూమ్ మరమ్మతులకు 600 డాలర్ల నుంచి 800 డాలర్ల మధ్య ఖర్చు చేయాలని భావించారు.
ఫేక్ ఐఫోన్ల దొంగతనాలు సర్వసాధారణమే.. ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. దొంగలు సాధారణంగా డబ్బు లేదా విలువైన వస్తువుల కోసం బ్యాంకులు, ఆభరణాల దుకాణాలను లక్ష్యంగా చేసుకుంటారు. అయినప్పటికీ, ఆపిల్ ప్రొడక్టులపై కూడా మార్కెట్లో భారీ డిమాండ్ ఉంటుంది. ఈ గాడ్జెట్లకు బ్లాక్ మార్కెట్లో అధిక డిమాండ్ ఉంటుంది. అందుకే ఆపిల్ ఐఫోన్లను దొంగలించి బ్లాక్ మార్కెట్లో అమ్మి సొమ్ము చేసుకోవాలని చూస్తున్నారు.