FTTH vs DTH : ఎంటర్‌టైన్‌మెంట్‌లో ‘ఫైబర్’ రారాజు.. డీటీహెచ్ బేజారు!

FTTH vs DTH : ఎంటర్‌టైన్‌మెంట్‌లో ‘పైబర్’ రారాజుగా దూసుకుపోతోంది. లక్షలాది మంది కస్టమర్లు డీటీహెచ్ సర్వీసులకు స్వస్తిపలికి ఫైబర్ సర్వీసులవైపు మొగ్గు చూపుతున్నారు. ప్రధానంగా ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటెంట్‌కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారట..

FTTH vs DTH : ఎంటర్‌టైన్‌మెంట్‌లో ‘ఫైబర్’ రారాజు.. డీటీహెచ్ బేజారు!

DTH Vs FTTH Broadband _ A Game-Changer in the Entertainment Industry

FTTH vs DTH : ప్రస్తుత రోజుల్లో ఎంటర్‌టైన్‌మెంట్‌ అనేది చాలా కీలకంగా మారింది. వినియోగదారులు ఎక్కువగా ఈ తరహా కంటెంట్‌కు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారు. మొన్నటివరకూ సంప్రదాయ డైరెక్ట్-టు-హోమ్ (DTH) సర్వీసులపై ఆధారపడిన లక్షలాది మంది భారతీయులు ఫైబర్ బ్రాడ్ బ్యాండ్ సర్వీసుల వైపు మొగ్గుచూపుతున్నారు. డీటీహెచ్ వద్దు.. ఫైబర్ సర్వీసులే ముద్దు అన్నట్టుగా మారిపోతున్నారు. అందులో ప్రధానంగా ఫైబర్ కనెక్షన్లను వినోదం కోసమే ఎక్కువగా ఎంపిక చేసుకుంటున్నారు. దాంతో వినోద రంగంలో ఫైబర్ టు హోం బ్రాడ్ బ్యాండ్ సర్వీసు గేమ్ ఛేంజర్‌గా మారింది.

Read Also : Ola Electric Prices Cut : ఓలా స్కూటర్ కొంటున్నారా? భారీగా తగ్గిన ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల ధరలు.. ఏ మోడల్ ధర ఎంతంటే?

3 నెలల్లో 13.20 లక్షల మంది :
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) డేటా ప్రకారం.. డీటీహెచ్ సబ్‌స్క్రిప్షన్లు భారీగా తగ్గాయని వెల్లడించింది. గత 3 నెలల వ్యవధిలో 13.20 లక్షల మంది వినియోగదారులు డీటీహెచ్ ప్రొవైడర్ల సర్వీసులను వదులుకున్నారు. ఎందుకంటే.. దీనికి కారణాలు లేకపోలేదు. వాతావరణ ప్రతికూల పరిస్థితులు కావొచ్చు.. టెక్నికల్ ఇష్యూల కారణంగా డీటీహెచ్ సేవలకు అంతరాయం ఏర్పడటం వంటివి చెప్పుకోవచ్చు.

ఫైబర్, డీటీహెచ్‌కు మధ్య తేడా ఏంటి? :
అంతేకాదు.. ఫైబర్ సర్వీసులు కేవలం ఇంటర్నెట్ మాత్రమే కాదు.. వై-ఫై సర్వీసులు, ఓటీటీ వంటి ఎంటర్‌టైన్మెంట్ కంటెంట్ అందించడంలో ఎప్పుడు ముందుంటాయి. ఈ ఫైబర్ కనెక్షన్లకు ఎలాంటి సాధారణంగా అంతరాయం కలగదు. అందుకే ఫైబర్ సర్వీసులపైనే వినియోగదారులు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. లక్షలాది మంది వినియోగదారులు డీటీహెచ్ సర్వీసులకు స్వస్తి చెప్పి ఫైబర్ కనెక్షన్లు తీసుకునేందుకు ఇష్టపడుతున్నారు. అందులోనూ ఓవర్-ది-టాప్ (OTT) యాప్‌లు, జియోసినిమా, జియోటీవీ వంటి ప్లాట్‌ఫామ్‌లు కూడా ఫైబర్ సర్వీసుల్లో అందుబాటులో ఉండటంతో మరింత ఆకర్షణీయంగా మారింది.

ఫైబర్ కనెక్షన్లకు మారిన 2.23 కోట్ల మంది :
ఏదైనా ఫైబర్ కనెక్షన్ తీసుకుంటే చాలు.. అందులోనే అన్ని రకాల కంటెంట్ అందిస్తున్నాయి. లైవ్ స్పోర్ట్స్, లేటెస్ట్ మూవీలు, వెబ్ సిరీస్‌లు, పాపులర్ టీవీ షోలు ఇలా మరెన్నో ఎంటర్‌టైన్‌మెంట్‌ కంటెంట్ యాక్సస్ చేసుకోవచ్చు. ఇప్పటివరకూ 2.23 కోట్ల మంది కస్టమర్లు ఫైబర్ కనెక్షన్లకు మారారని గణాంకాలు చెబుతున్నాయి. సంప్రదాయ డీటీహెచ్ సర్వీసుల కన్నా ఇంటర్నెట్ ఆధారిత ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌లకు ఎక్కువగా కస్టమర్లు ప్రాధాన్యత ఇస్తున్నారు. దేశంలో వినోద రంగంలో ఈ విప్లవాత్మక మార్పుతోనే డీటీహెచ్ సర్వీసుల క్షీణతకు దారితీసిందని చెప్పవచ్చు.

Read Also : Paytm FASTag FAQs : పేటీఎం ఫాస్ట్‌ట్యాగ్ యూజర్లకు అలర్ట్.. మార్చి 15 లోపు ఈ బ్యాంకులకు మారిపోండి.. లేదంటే అంతే సంగతులు!