Tesla Bot : టెస్లా నుంచి హ్యూమనాయిడ్ రోబో!
టెస్లా నుంచి హ్యూమనాయిడ్ రోబో రాబోతోంది. వచ్చే ఏడాదిలో టెస్లా బాట్ పేరుతో హ్యూమనాయిడ్ రోబోను రూపొందించనున్నట్టు సీఈఓ ఎలోన్ మస్క్ ప్రకటించారు.

Elon Musk Says Tesla Will Build A Humanoid Robot Prototype By Next Year
humanoid robot prototype : ప్రముఖ ఎలక్ట్రిక్ కారు మేకర్ టెస్లా నుంచి హ్యూమనాయిడ్ రోబో రాబోతోంది. వచ్చే ఏడాదిలో టెస్లా బాట్ (Tesla Bot) పేరుతో హ్యూమనాయిడ్ రోబోను రూపొందించనున్నట్టు కంపెనీ సీఈఓ ఎలోన్ మస్క్ ప్రకటించారు. ఇప్పటికే సెన్సార్లు, బ్యాటరీల తయారీలో ముందంజలో ఉన్నామని, వచ్చే ఏడాదిలో ఒక ప్రొటోటైప్ హ్యూమనాయిడ్ రోబోను రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఒక నమూనాను మస్క్ రివీల్ చేశారు. ఒక రోబో బాడీ షూటులో వ్యక్తితో ప్రదర్శన చేశారు. ఇది నిజమైన రోబో కాదని.. అసలైన టెస్లా బాట్ త్వరలో రానుందని మస్క్ తెలిపారు. మెషిన్ లెర్నింగ్ కోసం కాలిఫోర్నియాలో టెస్లా నిర్వహించిన AI Dayలో ఈ ప్రకటన చేశారు. రాబోయే ఈ టెస్లా బాట్ ప్రాజెక్టులో భాగంగా ఉద్యోగులు, కస్టమర్లతో పాటు పెట్టుబడిదారులను టెస్లా ఫ్యూచర్ ఉత్పత్తులపై పని చేయనున్నట్టు ప్రకటించారు.
2019 ఏప్రిల్‌లో ‘Autonomy Day’ కార్యక్రమంలో భాగంగా టెస్లా కంపెనీ 2020లో రోడ్లపై 1 మిలియన్ ఆటోనమస్ రోబోటాక్సిస్ కలిగి ఉంటుందని చెప్పారు. ఆ రోబోటాక్సిస్ ఎక్కడా కనిపించదన్నారు. అక్టోబర్ 2016లో సోలార్ రూఫ్ అనే ప్రొడక్టును లాస్ ఏంజిల్స్‌లోని యూనివర్సల్ స్టూడియోస్ బ్యాక్ లాట్‌లో ప్రదర్శించారు. ఇప్పుడు ఒక మానవరూప రోబోట్ తయారుచేస్తున్నట్టు మస్క్ ప్రకటించారు. ఈ హ్యూమనాయిడ్ రోబో మానవులు మాత్రమే చేయగల పనులు చేస్తుందని, ఉద్యోగ నియామక వ్యయాలను కూడా తగ్గిస్తుందని అన్నారు. దాంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను మరింత మెరుగుపర్చేందుకు దోహదపడుతుందని మస్క్ ఆకాంక్షించారు. ఈ రోబో మొదట పనిచేయదని మస్క్ తెలిపారు. మనతో స్నేహపూర్వకంగా ఉండేలా నావిగేట్ చేయాల్సి ఉందని అన్నారు.
టెస్లా కార్లు సెల్ఫ్ డ్రైవింగ్ ఫీచర్లలో ఉపయోగించే చిప్స్ సెన్సార్ల ఆధారంగా ‘Optimus’ అనే కోడ్ పేరుతో రోబో రూపొందించినట్టు మస్క్ చెప్పారు. ఐదు అడుగుల ఎనిమిది అంగుళాల పొడవు ఉంటుంది. తల స్థానంలో స్ర్కీన్ ఉంటుందని మస్క్ చెప్పారు. రోబో తలలో ఆటోపైలట్ కెమెరాలు ఇన్‌స్టాల్ చేసింది టెస్లా. 45 పౌండ్లు బరువులు మోయగలదు. 150 పౌండ్లు ఎత్తుగలదు. 125 పౌండ్ల బరువు కలిగి ఉంటుంది. ఇది గంటకు 5 మైళ్లు పరుగెత్తగలదని మస్క్ చెప్పారు. టెస్లా రోబోటిక్స్ కోసం అవసరమైన చాలా కంప్యూటర్లను అభివృద్ధి చేస్తోందని అందుకే రోబోను తయారు చేస్తున్నట్టు చెప్పారు.