Elon Musk Grok AI Chatbot : చాట్‌జీపీటీ, బార్డ్ ఏఐకి పోటీగా ‘గ్రోక్’ ఏఐ చాట్‌బాట్.. ఇప్పుడు భారత్‌లో కూడా యాక్సస్ చేయొచ్చు!

Elon Musk Grok AI Chatbot : ఓపెన్ ఏఐ చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్‌ ఏఐకి పోటీగా ఎలన్ మస్క్ సొంత ఏఐ చాట్‌బాట్ ’గ్రోక్‘ భారతీయ యూజర్లకు అందుబాటులోకి వచ్చేసింది. ట్విట్టర్ (X) బ్లూ సబ్‌స్క్రైబర్‌ల కోసం ప్రత్యేకంగా ఇండియాలో ప్రారంభమైంది.

Elon Musk Grok AI Chatbot : చాట్‌జీపీటీ, బార్డ్ ఏఐకి పోటీగా ‘గ్రోక్’ ఏఐ చాట్‌బాట్.. ఇప్పుడు భారత్‌లో కూడా యాక్సస్ చేయొచ్చు!

Elon Musk's Grok AI is now available for users in India

Elon Musk Grok AI Chatbot : ప్రపంచ బిలియనీర్, టెస్లా అధినేత ఎలన్ మస్క్ నేతృత్వంలోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ కంపెనీ ఎక్స్ఏఐ (xAI) ఏఐ కొత్త చాట్‌బాట్‌ ‘గ్రోక్’ (Grok)ను ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తోంది. ఇప్పటికే అమెరికా సహా పలు దేశాలకు విస్తరించిన గ్రోక్ ఏఐ చాట్‌బాట్.. భారతీయ యూజర్ల కోసం కూడా అందుబాటులోకి వచ్చింది. ఏఐ రేసులో టాప్ ప్లేసులో దూసుకుపోతున్న ఓపెన్ఏఐ చాట్‌జీపీటీ, గూగుల్ బార్డ్ ఏఐకి పోటీగా మస్క్ ఈ కొత్త గ్రోక్ ఏఐ చాట్‌బాట్ రూపొందించారు. మిగతా ఏఐ చాట్ బాట్‌ల కన్నా గ్రోక్ అద్భుతంగా పనిచేస్తుందని ఎక్స్ఏఐ కంపెనీ ఒక ప్రకటనలో పేర్కొంది. వాస్తవానికి మస్క్ నేతృత్వంలోని ఎక్స్ఏఐ కంపెనీ ప్రారంభమైన 8 నెలల్లోనే ఈ కొత్త ఏఐ చాట్‌బాట్ రూపొందించింది.

ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు ‘గ్రోక్’ చాట్‌బాట్
ఎలాన్ మస్క్’ గ్రోక్ ఏఐ చాట్‌బాట్ ఇప్పుడు భారత్‌లోని (X) ప్రీమియం ప్లస్ వినియోగదారులకు అందుబాటులో ఉంది. చాట్‌బాట్ గత వారమే అమెరికాలోని వినియోగదారులకు అందుబాటులోకి వచ్చిన తర్వాత భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఏఐ సంబంధిత రీసెర్చ్ వంటి ఇతర అంశాల కోసం ఏఐ టూల్స్ అందించాలనే లక్ష్యంతోనే గ్రోక్ చాట్‌బాట్ రూపొందించినట్టు ఎక్స్ఏఐ వెల్లడించింది. గత వారమే ఎక్స్ తమ ఏఐ చాట్‌బాట్ గ్రోక్ యాక్సెస్‌ను బీటాలో ఆంగ్ల భాషా యూజర్లందరికి దాదాపు ఒక వారంలోగా అందజేస్తుందని మస్క్ పేర్కొన్నారు. అయితే, ఎక్స్ ప్రీమియం ప్లస్ వినియోగదారులు వెబ్, ఐఓఎస్, ఆండ్రాయిడ్‌లోని సైడ్ మెనూలో గ్రోక్ చాట్‌‌బాట్ యాక్సస్ చేసుకోవచ్చు.

Read Also : ChatGPT Voice Feature : చాట్‌జీపీటీలో కొత్త వాయిస్ ఫీచర్.. ఇదేంటి? ఎలా ఉపయోగించాలంటే?

భారత్ సహా 46 దేశాల్లోకి విస్తరణ :
కృత్రిమ మేధస్సు ఏఐ స్టార్టప్ చాట్‌బాట్ గ్రోక్‌ను భారత్ సహా ఆస్ట్రేలియా, కెనడా, మలేషియా, న్యూజిలాండ్, పాకిస్తాన్, శ్రీలంక, సింగపూర్‌తో సహా 46 ఇతర దేశాలకు విస్తరించింది. చాట్‌బాట్ ప్రస్తుతం ఎక్స్ అగ్ర సబ్‌స్క్రిప్షన్ టైర్ అయిన ఎక్స్ ప్రీమియం+ సబ్‌స్క్రైబర్‌లకు అందుబాటులో ఉంది. మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ అమెరికాలో ప్రీమియం ప్లస్ సబ్‌స్క్రైబర్‌లకు గ్రోక్ ఏఐ బీటా యాక్సెస్‌ను ఇప్పటికే అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతం గ్రోక్ ఏఐ చాట్‌‌బాట్ మరిన్ని దేశాలలో అందుబాటులోకి వచ్చిందని, ఏఐ విజ్ఞానాన్ని సుదూర ప్రాంతాలకు వ్యాపింపజేస్తూ.. భవిష్యత్తు ఇప్పటికే ప్రకాశవంతంగా కనిపిస్తోందని ఎక్స్ సీఈఓ లిండా యాకరినా ఒక పోస్ట్‌లో తెలిపారు.

Elon Musk's Grok AI is now available for users in India

Elon Musk Grok AI

నెలకు సబ్‌స్ర్కిప్షన్ ఎంతంటే? :
ఎక్స్ యూజర్లు ఈ కింది దేశాల్లో ఇప్పుడు గ్రోక్ ఏఐ చాట్‌బాట్ యాక్సస్ చేయగలరు. అందుబాటులో ఉన్న దేశాల జాబితాను కంపెనీ షేర్ చేసింది. ఇందులో ఎక్స్ ప్రీమియం ప్లస్ ప్లాన్‌ని కలిగి యూజర్లు ఏఐ గ్రోక్ చాట్‌బాట్ యాక్సెస్ చేయవచ్చు. ఎక్స్ ప్రీమియం ప్లస్ సబ్‌స్ర్కిప్షన్ సంవత్సరానికి రూ. 13,600, నెలకు రూ. 1,300 చెల్లించాల్సి ఉంటుంది.

అక్టోబర్ 2023లో ఎక్స్ ప్రీమియం ప్లస్ టైర్‌ను ప్రవేశపెట్టింది. ఇది నెలకు సబ్‌స్ర్కిప్షన్ కింద 16 డాలర్లు వసూలు చేస్తుంది. వినియోగదారులు ప్లస్ అల్గారిథమిక్ ‘For You’ ఫీడ్‌తో పాటు కాలక్రమానుసారం ‘Following’ ఫీడ్‌లో యాడ్ ఫ్రీ కంటెంట్ యాక్సెస్ చేసేందుకు అనుమతిస్తుంది. ట్వీట్లను సవరించడం, లాంగ్ టెక్స్ట్ లేదా వీడియోలను పోస్ట్ చేయడం, యాడ్ రెవిన్యూ షేరింగ్ వంటి అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఎక్స్ఏఐ 1 బిలియన్ డాలర్ల వరకు ఈక్విటీ పెట్టుబడులను సేకరించాలని కోరుతోంది.

అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ (SEC)తో దాఖలు చేసిన ప్రకారం.. మస్క్ ఎక్స్ఏఐ కోసం ఇప్పటివరకు 134.7 మిలియన్ డాలర్లను సేకరించారు. అందులో 135 మిలియన్ డాలర్లు నలుగురు పేరులేని పెట్టుబడిదారుల నుంచి వచ్చింది. దీని మొదటి సేల్ నవంబర్ 29న జరిగింది. ఎస్ఈసీ ఫైలింగ్ ఎక్స్ఏఐ బయటి పెట్టుబడిదారుల నుంచి కనీసం 2 మిలియన్ డాలర్లను మాత్రమే అంగీకరిస్తుందని పేర్కొంది.

Read Also : Amazon Q ChatGPT : ఏఐ చాట్‌జీపీటీకి పోటీగా అమెజాన్‌ బిజినెస్ ‘క్యూ’ చాట్‌బాట్ వచ్చేసింది..!