Multiple SIM Cards : ఫోన్ నెంబర్లపై ఇక ఛార్జీలు చెల్లించాల్సిందేనా? అంతా అవాస్తవం.. ట్రాయ్ క్లారిటీ ఇచ్చిందిగా..!

Multiple SIM Cards : ఫోన్, ల్యాండ్ లైన్ నెంబర్లకూ ఛార్జీలు చెల్లించాల్సిందిగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( TRAI ) యోచిస్తున్నట్టుగా పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన ట్రాయ్ ఆ వార్తలను ఖండించింది.

Multiple SIM Cards : ఫోన్ నెంబర్లపై ఇక ఛార్జీలు చెల్లించాల్సిందేనా? అంతా అవాస్తవం.. ట్రాయ్ క్లారిటీ ఇచ్చిందిగా..!

Customers will Not be charged Multiple SIM Cards ( Image Source : Google )

Multiple SIM Cards : ప్రస్తుత రోజుల్లో ప్రతి స్మార్ట్‌ఫోన్ యూజర్లలో డ్యూయల్ సిమ్ కార్డుల వాడకం కామన్ అయిపోయింది. అయితే, ఒకరికి గరిష్టంగా ఎన్ని ఫోన్ నెంబర్లు ఉండొచ్చు? ఒకవేళ ఒకటి కన్నా ఎక్కువగా సిమ్ ( ఫోన్ నెంబర్లు) కార్డులను వినియోగిస్తే ఏమౌతుంది? ఇప్పుడు ఇదే ప్రశ్న వినియోగదారుల్లో వ్యక్తమవుతోంది.

ఎందుకంటే.. గత కొద్దిరోజులుగా మల్టీఫుల్ సిమ్ కార్డులను వినియోగించేవారిపై ఛార్జీలు తప్పవు అంటూ ఒక వార్త హల్‌చల్ చేస్తోంది. ఇప్పటికే వాడుతున్న సిమ్ కార్డులతో పాటు కొత్తగా తీసుకుబోయే ఫోన్, ల్యాండ్ లైన్ నెంబర్లకూ ఛార్జీలు చెల్లించాల్సిందిగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ( TRAI ) యోచిస్తున్నట్టుగా పుకార్లు వినిపిస్తున్నాయి. దీనిపై స్పందించిన ట్రాయ్ ఆ వార్తలను కొట్టిపారేసింది.

Read Also : Vivo X Fold 3 Pro : వివో ఎక్స్ ఫోల్డ్ ప్రో సేల్ మొదలైందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ఈ మడతబెట్టే ఫోన్ ధర ఎంతో తెలుసా?

అందులో ఎలాంటి వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చింది. మల్టీ సిమ్‌లను కలిగిఉన్నందుకు లేదా నంబరింగ్ రీసోర్స్ కలిగి ఉన్నందుకు వినియోగదారులపై ఛార్జీలు విధించాలని భావిస్తున్నట్లు ఊహాగానాలకు ట్రాయ్ ముగింపు పలికింది. ఆ నివేదికలు నిరాధారమైనవని, వినియోగదారులను తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ట్రాయ్ స్పష్టం చేసింది. ఈ మేరకు శుక్రవారం ట్రాయ్ ఒక ప్రకటనలో ఇలా పేర్కొంది..

“మొబైల్, ల్యాండ్‌లైన్ నంబర్‌లకు ఫీజులను ప్రవేశపెట్టాలని ట్రాయ్ ప్రతిపాదించినట్లు కొన్ని మీడియా సంస్థలు (ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా) నివేదించినట్లు మా దృష్టికి వచ్చింది. మల్టీ సిమ్‌లు/నంబరింగ్ ప్లాన్ కలిగి ఉన్నందుకు వినియోగదారులపై ఛార్జీలు విధించనుంది అనేది పూర్తిగా అవాస్తవం. ప్రజలను తప్పుదోవా పట్టించేలా ఉంది. వీటిని ఎవరూ నమ్మొద్దు’’ అని సూచించింది.

టెలికాం రెగ్యులేటర్ మొబైల్, ల్యాండ్‌లైన్ నంబర్‌లకు రుసుములను ప్రవేశపెట్టాలని ప్రతిపాదించినట్లు మల్టీ మీడియా నివేదికలు పేర్కొన్న ఒక రోజు తర్వాత ట్రాయ్ నుంచి స్పష్టత వచ్చింది. జూన్ 6, 2024 నుంచి వచ్చిన కన్సల్టేషన్ పేపర్‌ను ఉటంకిస్తూ.. మొబైల్ ఆపరేటర్లు ఈ నంబర్‌లకు ఛార్జీలను ఎదుర్కోవచ్చని, ఈ ఛార్జీలను వినియోగదారులకు బదిలీ చేయవచ్చని సూచించింది.

వాస్తవానికి టెలికం శాఖ ట్రాయ్‌ని సంప్రదించి నేషనల్ నంబరింగ్ ప్లాన్‌పై ప్రతిపాదనలను కోరిన సంగతి తెలిసిందే. ఈ నంబరింగ్ వినియోగంపై అవసరమైన సూచనలను ఇవ్వాలని కూడా టెలికం శాఖ అడిగింది. ఈ క్రమంలోనే దానికి సంబంధించి కొన్ని సవరణలను మాత్రమే ప్రతిపాదించినట్టు ట్రాయ్ స్పష్టత ఇచ్చింది.

Read Also : Jio Data Booster Plans : మీ రోజువారీ ఇంటర్నెట్ డేటా లిమిట్ దాటిందా? జియో మొబైల్ డేటా బూస్టర్ ప్లాన్లు ఇదిగో.. ఫుల్ లిస్ట్ మీకోసం..!