Fake WhatsApp Message : మీ వాట్సాప్‌కు ఇలా మెసేజ్ వచ్చిందా? అది ఫేక్ మెసేజ్.. తస్మాత్ జాగ్రత్త.. అదో పెద్ద స్కామ్..!
Fake WhatsApp Message : భారతీయ వాట్సాప్ యూజర్లకు అలర్ట్.. మీ వాట్సాప్ (Whatsapp)కు ఇలా మెసేజ్ వచ్చిందా? అయితే తస్మాత్ జాగ్రత్త.. వాట్సాప్‌లో ఈ కొత్త ఫేక్ మెసేజ్ వైరల్ అవుతోంది. క్లిక్ చేస్తే ఖతమే..

Fake WhatsApp Message claims government is offering free phone recharge to users, do not fall for it
Fake WhatsApp Message : అంతా డిజిటల్ మయం.. ప్రతిఒక్కరూ ఆన్‌లైన్ పేమెంట్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. డిజిటల్ బ్యాంకింగ్ (Digital Banking) వినియోగం కూడా పెరిగింది. ఇదే స్కామర్లకు వరంగా మారింది. అమాయక ప్రజలను లక్ష్యంగా చేసుకుని వారి డబ్బును దొంగిలించేందుకు ప్రయత్నిస్తున్నారు. సైబర్ మోసగాళ్లు (Cyber Criminals) వినియోగదారులను మోసగించేందుకు అనేక మార్గాల్లో ప్రయత్నిస్తుంటారు. ఎలాంటి మోసపూరిత మెసేజ్‌లు వచ్చినా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల HDFC, SBI వంటి ప్రధాన బ్యాంకుల అకౌంట్‌దారులకు కూడా ఇలాంటి మెసేజ్‌లు వచ్చాయి.
ఇలాంటి మోసాలు గత రెండు నెలలుగా జరుగుతున్నాయి. గత కొన్ని వారాలుగా ఆన్‌లైన్ మోసాలు ఎక్కువయ్యాయి. స్కామర్‌లు తమ అకౌంట్ వివరాలను లేదా పాన్ కార్డ్ డేటా (Pan Card Data)ను అప్‌డేట్ చేయమని కోరుతూ బ్యాంకుల నుంచి మోసపూరిత మెసేజ్‌లను పంపుతారు. ఇప్పుడు, భారతీయ యూజర్ల కోసం భారత ప్రభుత్వం ఉచిత మొబైల్ రీఛార్జ్‌ను ఇస్తోందంటూ ఓ కొత్త స్కామ్‌కు తెరలేపారు. ప్రస్తుతం వాట్సాప్‌లో ఈ కొత్త మోసపూరిత మెసేజ్ వైరల్ అవుతోంది.
వాట్సాప్‌లో తప్పుడు సందేశాలు :
నివేదికల ప్రకారం.. భారతీయ యూజర్లందరికి కేంద్ర ప్రభుత్వం రూ. 239 విలువైన ఫోన్ రీఛార్జ్‌ను ఉచితంగా ఇస్తోందని వాట్సాప్ మెసేజ్ వైరల్ అవుతోంది. ఇందులో రీఛార్జ్ చేయడం ద్వారా 28 రోజులు వ్యాలిడిటీ పొందవచ్చునని, ఆయా లింక్‌పై క్లిక్ చేయమని యూజర్లను ప్రేరేపిస్తుంది. దీనిపై ఫాక్ట్ చెక్ బృందం పరిశీలించగా.. ఈ మెసేజ్ పూర్తిగా ఫేక్ అని తేలింది. అసలు కేంద్ర ప్రభుత్వం అలాంటి స్కీమ్ ఎక్కడా కూడా ప్రకటించలేదని పథకాన్ని ప్రకటించలేదని తెలిపింది.

Fake WhatsApp Message claims government is offering free phone recharge to users
ఫేక్ వాట్సాప్ మెసేజ్ ప్రకారం.. ‘ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉచిత మొబైల్ రీఛార్జ్ స్కీమ్ కింద భారతీయ యూజర్లందరికి 28 రోజుల పాటు రూ. 239 ఉచితంగా రీఛార్జ్ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు ఈ లింక్ క్లిక్ చేయడం ద్వారా మీ నంబర్‌ను రీఛార్జ్ చేయండి. మీరు ఈ కింది లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా 28 రోజుల ఉచిత రీఛార్జ్‌ని కూడా పొందవచ్చు’ అని ఉంది.
ఫేక్ మెసేజ్‌ల నుంచి ఎలా సేఫ్‌గా ఉండాలంటే? :
వాట్సాప్ (WhatsApp) ద్వారా సర్క్యులేట్ అయ్యే స్కామ్‌ల నుంచి తప్పించుకోవడం చాలా సులభమే. ముఖ్యంగా సన్నిహిత కుటుంబ సభ్యుడు లేదా స్నేహితుడి నుంచి వచ్చినప్పుడు ఫేక్ మెసేజ్ గుర్తించవచ్చు. అందులో కొన్ని సంకేతాలు ఉన్నాయి. ముందుగా మెసేజ్ భాష ఎలాంటి చెక్ చేయండి. అలాంటి మెసేజ్ భాష సాధారణంగా పరిపూర్ణంగా ఉండదు. చాలావరకూ అక్షర దోషాలు ఎక్కువగా ఉంటాయి. అధికారిక మెసేజ్‌లు భాష, వ్యాక్యాలు చూడగానే వాస్తవంగా ఉంటాయి.
ఫేక్ మెసేజ్ గుర్తు తెలియని సోర్స్ నుంచి వచ్చినట్టు గుర్తించడానికి ఇదే బెస్ట్ ఆప్షన్. ఈ లింక్‌పై క్లిక్ చేయమని అడిగే ఏదైనా మెసేజ్ పట్ల చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. ఆ లింకు నేరుగా నాన్-అఫీషియల్ సోర్స్ నుంచి వచ్చినట్లు కనిపిస్తే.. దానిపై క్లిక్ చేయరాదు. ఇతరులను కూడా క్లిక్ చేయొద్దని చెప్పండి. సర్క్యులేట్ అవుతున్న మెసేజ్ ఫేక్ కాదా అవునా అని తెలుసుకోవడానికి కొన్ని సమయాల్లో గూగుల్ (Google) సెర్చ్ ద్వారా కూడా సులభంగా తెలుసుకోవచ్చు.