Flipkart Laptop Sale Offers : ఫ్లిప్‌కార్ట్‌ సేల్.. సరసమైన ధరకే కొత్త ల్యాప్‌‌టాప్‌లు.. మరెన్నో డిస్కౌంట్లు.. ఏ బ్రాండ్ మోడల్ ధర ఎంతంటే?

Flipkart Big Billion Days Sale : కొత్త ల్యాప్‌టాప్ కొనేందుకు చూస్తుంటే ఇదే సరైన అవకాశం. ఫ్లిప్‌కార్ట్ కొన్ని ఆకర్షణీయమైన డీల్స్ మీకోసం అందిస్తుంది. ఇందులో మీకు నచ్చిన ల్యాప్‌టాప్ ఎంచుకుని కొనేసుకోవచ్చు. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.

Flipkart Laptop Sale Offers : ఫ్లిప్‌కార్ట్‌ సేల్.. సరసమైన ధరకే కొత్త ల్యాప్‌‌టాప్‌లు.. మరెన్నో డిస్కౌంట్లు.. ఏ బ్రాండ్ మోడల్ ధర ఎంతంటే?

Flipkart Big Billion Days sale is live_ HP, Asus, Acer laptops as low as Rs 10k

Updated On : September 27, 2024 / 4:17 PM IST

Flipkart Big Billion Days sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ మొదలైంది. ఈ సేల్ అక్టోబర్ 6 వరకు కొనసాగుతుంది. ఈ ఫ్లిప్‌‌కార్ట్ సేల్ సమయంలో అనేక స్మార్ట్‌ఫోన్‌లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లపై అద్భుతమైన డీల్స్ అందిస్తుంది. మీరు ఏదైనా ల్యాప్‌టాప్‌ను రూ. 10వేల కన్నా తక్కువ ధరకే పొందవచ్చు. అదే బ్యాంక్ ఆఫర్‌లతో అంతకంటే తక్కువ ధరకే పొందవచ్చు.

ఉదాహరణకు, హెచ్‌పీ క్రోమ్‌‌బుక్ మీడియాటెక్ ఎంటీ8183 రూ. 9,990కి అందుబాటులో ఉంది. మీరు కూడా కొత్త ల్యాప్‌టాప్ కొనేందుకు చూస్తుంటే ఇదే సరైన అవకాశం. ఫ్లిప్‌కార్ట్ కొన్ని ఆకర్షణీయమైన డీల్స్ మీకోసం అందిస్తుంది. ఇందులో మీకు నచ్చిన ల్యాప్‌టాప్ ఎంచుకుని కొనేసుకోవచ్చు. పూర్తివివరాలు ఇలా ఉన్నాయి.

హెచ్‌పీ క్రోమ్‌బుక్ మీడియాటెక్ ఎంటీ8183 :
ఫ్లిప్‌కార్ట్‌లో హెచ్‌పీ క్రోమ్‌బుక్ మీడియాటెక్ ఎంటీ8183 ధర రూ. 9,990కి అందుబాటులో ఉంది. ఈ ల్యాప్‌టాప్ 11.6-అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేను కలిగి ఉంది. 8 కోర్లతో మీడియాటెక్ఎంటీ8183 ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్, 32జీబీ ఇఎమ్ఎమ్‌సీ స్టోరేజీతో వస్తుంది. దీనిని మైక్రో ఎస్‌డీ కార్డ్ ఉపయోగించి స్టోరేజీని పెంచుకోవచ్చు. ఈ ల్యాప్‌‌టాప్ క్రోమ్ ఓఎస్‌లో రన్ అవుతుంది. స్పీడ్ బూటింగ్ టైమ్, ఇంటర్నల్ గూగుల్ అసిస్టెంట్, ఆటోమేటిక్ అప్‌డేట్‌లను అందిస్తోంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే.. వై-ఫై 5, బ్లూటూత్ 4.2కి సపోర్టు ఇస్తుంది. రెండు యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌లను కలిగి ఉంటుంది. 16 గంటల బ్యాటరీ లైఫ్ కలిగి ఉంటుంది. విద్యార్థులకు, సాధారణ వినియోగదారులకు సౌకర్యవంతంగా ఉంటుంది. అదనంగా, ఫ్లిప్‌కార్ట్ హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్‌లపై రూ. 999, హెచ్‌డీఎఫ్‌సీ డెబిట్ కార్డ్‌లపై రూ. 750, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 500 విలువైన బ్యాంక్ డిస్కౌంట్లను అందిస్తోంది. 2020లో రూ. 21,999తో లాంచ్ అయిన ఈ ల్యాప్‌టాప్ డీల్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

హెచ్‌పీ టచ్ క్రోమ్‌బుక్ మీడియాటెక్ ఎంటీ8183 :
ఈ సేల్ సమయంలో హెచ్‌పీ ల్యాప్‌టాప్ రూ. 10,990కి విక్రయిస్తోంది. మెరుగైన ఇంటరాక్టివిటీతో మల్టీఫేస్ 11.6-అంగుళాల హెచ్‌డీ టచ్‌స్క్రీన్ డిస్‌ప్లేను అందిస్తుంది. మీడియాటెక్ ఎంటీ8183 ఆక్టా-కోర్ ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్, 32జీబీ ఇఎమ్ఎమ్‌సీ స్టోరేజ్‌తో వస్తుంది. మైక్రో ఎస్‌డీ ద్వారా విస్తరించవచ్చు. క్రోమ్ ఓఎస్‌లో రన్ అవుతుంది. గూగుల్ యాప్‌లతో స్పీడ్ బూట్ టైమ్, ఆటోమేటిక్ అప్‌డేట్‌లను అందిస్తుంది.

ల్యాప్‌టాప్‌లో వై-ఫై 5, బ్లూటూత్ 4.2, ఆధునిక కనెక్టివిటీ ఆప్షన్ల కోసం రెండు యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌లు కూడా ఉన్నాయి. గరిష్టంగా 16 గంటల బ్యాటరీ లైఫ్‌తో విద్యార్థులకు తేలికపాటి మల్టీ టాస్కింగ్‌కు ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ధరపై రూ. 1,099 విలువైన బ్యాంక్ డిస్కౌంట్లను కూడా పొందవచ్చు.

హెచ్‌పీ టచ్ క్రోమ్‌బుక్ మీడియాటెక్ ఎంటీ8183 నాన్-టచ్ వేరియంట్ మాదిరిగానే సెప్టెంబర్ 2020లో లాంచ్ అయింది. భారత మార్కెట్లో ఈ మోడల్ లాంచ్ ధర సుమారుగా రూ.24,999 ఉండగా, కాలక్రమేణా ల్యాప్‌టాప్ ధర తగ్గుతూ వస్తుంది. ఈ సేల్ సమయంలో మరింత సరసమైన ధరకే అందుబాటులో ఉంది.

అల్టిమస్ ప్రో ఇంటెల్ సెలెరాన్ డ్యూయల్ కోర్ :
ఫ్లిప్‌కార్ట్‌లో అల్టిమస్ ప్రో ఇంటెల్ సెలెరాన్ డ్యూయల్ కోర్ ధర రూ. 11,990కి లభిస్తుంది. 14.1-అంగుళాల ఫుల్ హెచ్‌డీ డిస్‌ప్లే, క్లియర్ విజువల్స్‌ను అందిస్తుంది. ఇంటెల్ సెలెరాన్ డ్యూయల్ కోర్ ప్రాసెసర్ ద్వారా ఆధారితంగా పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్, 128జీబీ ఎస్‌ఎస్‌డీ స్టోరేజీతో వస్తుంది. మల్టీ టాస్కింగ్ వేగవంతమైన బూట్ టైమ్‌లను అందిస్తుంది. విండోస్ 10లో రన్ అవుతోంది. అవసరమైన అప్లికేషన్లు, జనరేటివ్ టూల్స్‌కు సపోర్టు ఇస్తుంది.

కనెక్టివిటీ విషయానికి వస్తే.. వై-ఫై, బ్లూటూత్, యూఎస్‌బీ పోర్ట్‌లు, హెచ్‌డీఎమ్ఐ పోర్ట్‌లను కలిగి ఉంటుంది. స్లిమ్, తేలికపాటి డిజైన్‌తో గరిష్టంగా 6 గంటల బ్యాటరీ లైఫ్ కూడా అందిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ బ్యాంక్ ఆఫర్‌లను కూడా అందిస్తోంది. ఈ ల్యాప్‌టాప్ ధరను మరింత తగ్గించవచ్చు. అల్టిమస్ ప్రో ఇంటెల్ సెలెరాన్ డ్యూయల్ కోర్ అక్టోబర్ 2021లో భారత మార్కెట్లో ప్రారంభ ధర రూ.19,999తో లాంచ్ అయింది. ఆ తర్వాత ఈ ల్యాప్‌టాప్ ధర గణనీయంగా తగ్గింది.

ఏసర్ క్రోమ్‌బుక్ ఇంటెల్ సెలెరాన్ డ్యూయల్ కోర్ ఎన్4500 :
ఏసర్ క్రోమ్‌బుక్ ఇంటెల్ సెలెరాన్ డ్యూయల్ కోర్ ఎన్4500 ధర రూ. 13,990 వద్ద లభిస్తుంది. 14-అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లేను అందిస్తుంది. బ్రౌజింగ్, స్ట్రీమింగ్ వంటి టాస్కులను అద్భుతంగా పనిచేస్తుంది. ఇంటెల్ సెలిరాన్ డ్యూయల్ కోర్ ఎన్4500 ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. 4జీబీ ర్యామ్, 128జీబీ ఇఎమ్ఎమ్‌సీ స్టోరేజ్‌ను కలిగి ఉంది. మైక్రో ఎస్‌డీ ద్వారా విస్తరించే స్టోరేజీతో క్రోమ్ ఓఎస్‌లో రన్ అవుతోంది.

గూగుల్ అసిస్టెంట్, ఆటోమేటిక్ అప్‌డేట్‌లను అందిస్తుంది. క్రోమ్‌బుక్ వేగవంతమైన కనెక్టివిటీ, బ్లూటూత్ 5.0లో వై-ఫై 6కి సపోర్టు ఇస్తుంది. మల్టీ యూఎస్‌బీ టైప్-సి పోర్ట్‌లను కలిగి ఉంటుంది. తేలికైన డిజైన్ గరిష్టంగా 10 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. విద్యార్థులకు లేదా తేలికపాటి వినియోగదారులకు ఇది సరైనది. జూన్ 2021లో సుమారు రూ. 24,999 ధరతో లాంచ్ అయింది.

అసూస్ వివోబుక్ E12 ఇంటెల్ సెలెరాన్ డ్యూయల్ కోర్ ఎన్4000 :
అసూస్ వివోబుక్ E12 ఇంటెల్ సెలెరాన్ డ్యూయల్ కోర్ ఎన్4000 ధర రూ. 15,990 వద్ద లభిస్తుంది. 11.6-అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, కాంపాక్ట్ పోర్టబిలిటీ, స్పష్టమైన విజువల్స్‌ను అందిస్తోంది. ఇంటెల్ సెలిరాన్ డ్యూయల్ కోర్ ఎన్4000 ప్రాసెసర్‌తో ఆధారితంగా పనిచేస్తుంది. 2జీబీ ర్యామ్, 32జీబీ ఇఎమ్ఎమ్‌సీ స్టోరేజ్‌తో వస్తుంది. అదనపు స్టోరేజీ కోసం మైక్రో ఎస్‌డీ ద్వారా విస్తరించవచ్చు. విండోస్ 10లో రన్ అవుతున్న ఈ ల్యాప్‌టాప్ వెబ్ బ్రౌజింగ్, డాక్యుమెంట్ ఎడిటింగ్, మీడియా వినియోగం వంటి రోజువారీ పనులకు సపోర్టు ఇస్తుంది.

వై-ఫై, బ్లూటూత్ 4.1, కనెక్టివిటీకి యూఎస్‌బీ 3.1, హెచ్‌డీఎంఐ వంటి ముఖ్యమైన పోర్ట్‌లను కలిగి ఉంటుంది. గరిష్టంగా 10 గంటల బ్యాటరీ లైఫ్, తేలికపాటి డిజైన్‌తో వస్తుంది. ట్రావెల్ చేసే విద్యార్థులకు కూడా బాగుంటుంది. వినియోగదారులకు చెప్పవచ్చు. వాస్తవానికి ఫిబ్రవరి 2018లో సుమారు రూ. 21,990 ధరతో ఈ ల్యాప్‌టాప్ లాంచ్ అయింది. ఈ సరసమైన ల్యాప్‌టాప్‌ను కోరుకునే వారికి ఇది బెస్ట్ డీల్‌ అని చెప్పవచ్చు.