Flipkart Big Diwali Sale 2023 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్.. ఆపిల్ ఐఫోన్ 14పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. కొంటే.. ఇప్పుడే కొనేసుకోండి!

Flipkart Big Diwali Sale 2023 : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఈ పండుగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ ఐఫోన్ 14 ధరను 17 శాతం తగ్గించింది. కేవలం రూ. 57,999కు సొంతం చేసుకోవచ్చు.

Flipkart Big Diwali Sale 2023 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్.. ఆపిల్ ఐఫోన్ 14పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. కొంటే.. ఇప్పుడే కొనేసుకోండి!

Flipkart Big Diwali Sale 2023 _ Massive Discount on iPhone 14, here's how the deal

Flipkart Big Diwali Sale 2023 : దీపావళి పండుగ సీజన్ వచ్చేసింది.. ఐఫోన్ కొనేందుకు ఇదే సరైన సమయం. ఈ పండుగ సీజన్‌లో ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ సందర్భంగా ఆపిల్ ఐఫోన్ 14పై భారీ తగ్గింపును అందిస్తోంది. బ్యాంకుల నుంచి అదనపు డీల్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి. దీని వలన మీకు ఐఫోన్ 14 ధర రూ. 40వేల కన్నా తక్కువగా ఉంటుంది. అత్యంత ముఖ్యమైన ప్రయోజనం ఏమిటంటే.. మీరు పూర్తి రిటైల్ ధరను కవర్ చేయాల్సిన పని లేదు. ఇంతకీ, ఈ ఐఫోన్ 14 డీల్ ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.

ఐఫోన్ 14 ధర ఎంత తగ్గిందంటే? :

ఈ పండుగ సీజన్‌లో ఫ్లిప్‌కార్ట్ ఆపిల్ ఐఫోన్ 14 ధరను భారీగా తగ్గించింది. అసలు లిస్టింగ్ ధర రూ. 69,900 ఉండగా.. ఇప్పుడు ఈ హై-ఎండ్ స్మార్ట్‌ఫోన్‌ను కేవలం రూ. 57,999కు సొంతం చేసుకోవచ్చు. అంటే.. 17 శాతం అద్భుతమైన తగ్గింపును పొందవచ్చు. ఆపిల్ యూజర్ కమ్యూనిటీలో భాగం కావాలనుకుంటే.. ఈ అద్భుతమైన అవకాశాన్ని కోల్పోకండి.

Read Also : Flipkart Sale Offers : ఫ్లిప్‌కార్ట్ పండుగ సీజన్ సేల్.. రూ.20వేల లోపు ధరలో ఈ స్మార్ట్‌ఫోన్లపై అదిరే డీల్స్..!

ఇంకా, ఈ ఆఫర్ అదనపు ఎక్స్ఛేంజ్, బ్యాంక్ ప్రమోషన్లతో అందుబాటులో ఉంటుంది. బ్యాంక్ కార్డ్‌ల బెనిఫిట్స్ కోసం SBI క్రెడిట్ కార్డ్‌ని కలిగి ఉంటే.. మీరే అదృష్టవంతులు. ఫ్లిప్‌కార్ట్ SBI క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై 10 శాతం తగ్గింపును అందిస్తోంది. గరిష్ట తగ్గింపు రూ. 1,000, ఆర్డర్‌లపై మొత్తం రూ. 5వేలు అంతకన్నా ఎక్కువగా అందిస్తోంది.

Flipkart Big Diwali Sale 2023 _ Massive Discount on iPhone 14, here's how the deal

Flipkart Big Diwali Sale 2023

మీ పాత్ ఫోన్‌తో అదిరే డీల్ :

అదనంగా, పాత స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉంటే.. మీరు ట్రేడ్ చేయొచ్చు. గరిష్టంగా రూ. 42వేలు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ పొందవచ్చు. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఐఫోన్ 14 ధరను గణనీయంగా తగ్గిస్తుంది. దాంతో రూ. 40వేల కన్నా తక్కువ ధరకే కొనుగోలు చేయొచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పరిగణనలోకి తీసుకునే ముందు.. మీ ప్రాంతంలో ఐఫోన్ 14 అందుబాటులో ఉందో లేదో చెక్ చేసుకోవడం చాలా అవసరం.

మీ ప్రాంతం పిన్ కోడ్‌ను ఎంటర్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. మీరు ట్రేడ్ చేయాలనుకుంటున్న పాత స్మార్ట్‌ఫోన్ కండిషన్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఉపయోగించే అసెస్‌మెంట్ ప్రమాణాలపై ఎక్స్ఛేంజ్ ఆఫర్ అర్హత ఆధారపడి ఉంటుంది. ఈ ఆఫర్‌లను ఉపయోగించుకునే ముందు అన్ని వివరాలను క్షుణ్ణంగా రివ్యూ చేసుకున్న తర్వాతే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

Read Also : Flipkart Big Diwali Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై భారీ తగ్గింపు.. మీకు నచ్చిన ఫోన్ కొనేసుకోండి!