Flipkart Utsav Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఉత్సవ్ సేల్ మొదలైందోచ్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లు..!

Flipkart Big Shopping Utsav Sale : ఫ్లిప్‌కార్ట్ ఉత్సవ్ సేల్ అక్టోబర్ 9 నుంచే అధికారిక మైక్రోసైట్‌లో ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్‌లోని బ్యానర్ సేల్ అక్టోబర్ 13 వరకు కొనసాగుతుందని వెల్లడించింది.

Flipkart Utsav Sale : ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఉత్సవ్ సేల్ మొదలైందోచ్.. ఈ స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లు, డిస్కౌంట్లు..!

Flipkart Big Shopping Utsav Sale 2024 to Start on October 9

Updated On : October 9, 2024 / 7:55 PM IST

Flipkart Big Shopping Utsav Sale : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ 2024 సేల్ ఈరోజు (అక్టోబర్ 9) నుంచే ప్రారంభం అవుతుంది. ఇప్పటికే, అధికారిక మైక్రోసైట్ సేల్ తేదీలను కూడా ధృవీకరించింది. పర్సనల్ గాడ్జెట్‌లు, హోం ఎంటర్‌టైన్‌మెంట్, ఇతర బిగ్ అప్లియన్సెస్ వంటి అనేక రకాల ప్రొడక్టులపై ఆకర్షణీయమైన తగ్గింపులతో అందుబాటులో ఉన్నాయి.

Read Also : Google Video Messages : గూగుల్ చాట్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ఇకపై యూజర్లు ఈజీగా వీడియో మెసేజ్‌లు పంపొచ్చు.. ఇదిగో సింపుల్ ప్రాసెస్..!

అంతేకాదు.. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్లు లేదా కూపన్ డిస్కౌంట్‌లు వంటి అదనపు బెనిఫిట్స్ కూడా పొందవచ్చు. కొనుగోలుదారులు తక్కువ ధరలకు ఇతర ప్రొడక్టులను సొంతం చేసుకోవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకుల కస్టమర్‌లు మరిన్ని ఆఫర్‌లను పొందవచ్చు. పలు పేమెంట్ల మెథడ్స్‌ ఆధారంగా నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లను కూడా పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ బిగ్ షాపింగ్ ఉత్సవ్ 2024 సేల్.. డీల్స్, ఆఫర్‌లు ఇవే :
షెడ్యూల్ ప్రకారం.. ఫ్లిప్‌కార్ట్ ఉత్సవ్ సేల్ అక్టోబర్ 9 నుంచే అధికారిక మైక్రోసైట్‌లో ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ మొబైల్ యాప్‌లోని బ్యానర్ సేల్ అక్టోబర్ 13 వరకు కొనసాగుతుందని వెల్లడించింది. ఈ సేల్‌లో భాగంగా, యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డు, ఆర్బీఎల్ బ్యాంక్, యెస్ బ్యాంక్ వినియోగదారులు ఇన్‌‍స్టంట్ 10 శాతం డిస్కౌంట్ పొందవచ్చు.

ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులు నిర్దిష్ట కొనుగోళ్లపై 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. కస్టమర్‌లు నో-కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లతో రూ. 1లక్ష వరకు క్రెడిట్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ పేమెంట్ ఆప్షన్ కూడా ఉంది.

ఇ-కామర్స్ సైట్ రాబోయే బిగ్ షాపింగ్ ఉత్సవ్ సేల్ సమయంలో అందించే కొన్ని డీల్‌లను టీజ్ చేసింది. శాంసంగ్, ఆపిల్, మోటోరోలా వివో వంటి మరిన్ని ప్రముఖ బ్రాండ్‌ల నుంచి స్మార్ట్‌ఫోన్‌లు సాధారణ ధరల కన్నా చాలా తక్కువ ధరలకు పొందవచ్చు. ముఖ్యంగా, ఐఫోన్ 15 , ఐఫోన్ 15ప్రో , శాంసంగ్ గెలాక్సీ ఎస్23 , శాంసంగ్ గెలాక్సీ ఎస్24 ప్లస్, గూగుల్ పిక్సెల్ 8, నథింగ్ ఫోన్ 2ఎ, మోటోరోలా జీ85 5జీ భారీ డిస్కౌంట్లతో పొందవచ్చు.

6జీబీ +128జీబీ స్టోరేజ్‌తో సీఎమ్ఎఫ్ ఫోన్ 1 తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అన్ని ఆఫర్‌లతో కలిపి ఈ ఫోన్ రూ. 12,499 ధరకు పొందవచ్చు. ఒప్పో కె12ఎక్స్ 5జీ ఫోన్ అతి తక్కువ ధర రూ. 11,844కే సొంతం చేసుకోవచ్చు. ఆసక్తిగల కొనుగోలుదారులు స్మార్ట్‌వాచ్‌లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌ల వంటి వ్యక్తిగత ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్లు, ఎయిర్ కండిషనింగ్ యూనిట్లు, మరిన్ని ప్రొడక్టులపై 80 శాతం వరకు డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : Top Smartphone Offers : కొత్త ఫోన్ కొంటున్నారా? అమెజాన్‌లో టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ మీకోసం.. డోంట్ మిస్..!