Sundar Pichai : గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ నిద్రలేవగానే మొదట చేసే పని ఇదే.. ఆ తర్వాతే ఏదైనా.. సక్సెస్ సీక్రెట్ ఇదేనేమో..!

Google CEO Sundar Pichai : గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ సహా ఇతర టెక్ దిగ్గజాలు ఉదయం లేవగానే ఏం చేస్తారో తెలుసా? (Techmeme) అనే వెబ్‌సైట్‌తో తమ రోజును ప్రారంభిస్తారట..

Sundar Pichai : గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ నిద్రలేవగానే మొదట చేసే పని ఇదే.. ఆ తర్వాతే ఏదైనా.. సక్సెస్ సీక్రెట్ ఇదేనేమో..!

Google CEO Sundar Pichai reads this tech website first thing in the morning

Google CEO Sundar Pichai : టెక్ ప్రపంచంలో రోజురోజుకీ కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తుంటాయి. అందుకే కాబోలు టెక్ దిగ్గజ అధినేతలు ఎప్పటికప్పుడూ అప్‌‌డేట్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తుంటారు. సాధారణంగా ఎవరైనా ఉదయం నిద్రలేవగానే ఏం చేస్తారు.. న్యూస్ పేపర్ తిరగేస్తారు.. లేదా సోషల్ మీడియా చెక్ చేస్తారు. అంతకంటే ఏం చేస్తారు.. కానీ, మన టెక్ దిగ్గజాల్లో ఒకరైన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ మాత్రం మనలా కాదు.. ఉదయం నిద్రలేవగానే ముందుగా ఒక పనిచేస్తారట.. ఆ పనిచేసిన తర్వాతే ఏ పనైనా చేస్తారట.. ఒక్క గూగుల్ సీఈఓ మాత్రమే కాదు.. చాలామంది టెక్ దిగ్గజాల అధినేతలు ఇదే పనిచేస్తారట.. ఇది చేసిన తర్వాతే వారి డే మొదలవుతుంది అనమాట..

Read Also : Google Gemini Ultra : జెమినిగా మారిన గూగుల్ బార్డ్.. ఇప్పుడు అల్ట్రా కూడా.. భారత్‌‌లో ఈ ఏఐ మోడల్ ధర ఎంత? ఎలా వాడాలో తెలుసా?

ఇంతకీ ఏం చేస్తారు అనేకదా మీ డౌట్.. ఏం లేదండీ.. ఒక టెక్ వెబ్‌సైట్ ముందుగా చదువుతారట.. ఆ వెబ్‌సైట్ పేరు.. టెక్‌మీమ్ (Techmeme). సుందర్ పిచాయ్ ఉదయపు దినచర్య ఇదేనంటే మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు. నివేదిక ప్రకారం.. ఆయన వార్తాపత్రికలను చదవడం లేదా సోషల్ మీడియాను చెక్ చేయడం కన్నా ముందుగా టెక్‌మీమ్ అనే వెబ్‌సైట్‌లోని లేటెస్ట్ టెక్నాలజీ వార్తలను చూస్తారు. అక్కడి నుంచే పిచాయ్ తన డేను ప్రారంభిస్తారు.

పిచాయ్ మాత్రమే కాదు.. మరెందరో దిగ్గజాలు :
2005లో గేబ్ రివెరా స్థాపించిన టెక్‌మీమ్ వెబ్‌సైట్.. బ్లూమ్‌బెర్గ్, సీఎన్‌బీసీ, ది వెర్జ్ వంటి టాప్ టెక్ హెడ్‌లైన్స్ అందిస్తుంది. ఈ వెబ్‌సైట్లో పాప్-అప్‌లు ఉండవు. ఎలాంటి యాడ్స్ కనిపించవు. ప్రపంచవ్యాప్తగా టెక్ ప్రపంచంలో జరిగే అత్యంత ముఖ్యమైన టెక్ అప్‌డేట్స్ మాత్రమే దర్శనమిస్తాయి. అవి కూడా క్విక్ గైడ్ హెడ్‌లైన్స్ మాత్రమే..

Google CEO Sundar Pichai reads this tech website first thing in the morning

Google CEO Sundar Pichai

టెక్‌మీమ్‌పై ఆధారపడే టెక్‌ దిగ్గజాల్లో పిచాయ్ మాత్రమే కాదు. మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, మెటా సీటీఓ ఆండ్రూ బోస్‌వర్త్, ఇన్‌స్టాగ్రామ్ అధిపతి ఆడమ్ మోస్సేరి వంటి ఇతర ఉన్నత స్థాయి ఎగ్జిక్యూటివ్‌లు కూడా ఇదే టెక్ వెబ్‌సైట్ చూసేవారిలో ఉన్నారు. అదేవిధంగా మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల, మాజీ ట్విట్టర్ సీఈఓ డిక్ కాస్టోలో కూడా ఈ టెక్‌మీమ్ వెబ్‌సైట్ చూసేందుకు కొంత సమయాన్ని వెచ్చిస్తారు.

ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ఏం చేస్తారంటే? :
టెక్‌మీమ్ పరిశ్రమలోని దిగ్గజ వ్యాపారవేత్తల కోసం మాత్రమే కాదు.. బాక్స్ గ్రూపు (BoxGroup), టెక్‌స్టార్స్ (TechStars) నుంచి డేవిడ్ టిస్చ్ వంటి పెట్టుబడిదారులు కూడా ముఖ్యమైన టెక్ డెవలప్‌మెంట్‌ల గురించి తెలుసుకోవడానికి ఇదే సైట్‌ను రోజుకు చాలాసార్లు చూస్తారట.. ఇతర టెక్ దిగ్గజాలు కూడా ఉదయం లేవగానే తమ సొంత దినచర్యలను పాటిస్తుంటారు. ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా కస్టమర్ ఫీడ్‌బ్యాక్ ఇమెయిల్‌లను చదవడంతో డే మొదలువుతుంది. ఆపై వ్యాయామం చేస్తారు. అలాగే, స్పాటీఫై సీఈఓ డానియల్ ఈకే కూడా నిద్రలేవగానే ముందుగా వార్తలు, ఇతర పుస్తకాలను చదవడం ఆయనకు అలవాటు. అయితే స్నాప్‌చాట్ సీఈఓ ఇవాన్ స్పీగెల్ వాల్ స్ట్రీట్ జర్నల్, ఫైనాన్షియల్ టైమ్స్ వంటి సాంప్రదాయ అవుట్‌లెట్‌ల నుంచి వార్తలను చదవడం ఇష్టం.

టెక్‌మీమ్ వేగంగా అభివృద్ధి చెందుతున్న టెక్నికల్ ప్రపంచంపై అప్‌డేట్‌గా ఉంచేందుకు సాయపడుతుంది. అందుకే టెక్ దిగ్గజాలందరూ ఈ వెబ్‌సైట్‌పైనే ఎక్కువగా ఆధారపడుతుంటారు. తద్వారా తమ వ్యాపార వృద్ధికి అవసరమైన అవకాశాలను అందిపుచ్చుకుని విజయతీరాలకు చేరుకుంటున్నారు. రాబోయే టెక్ మార్పులకు ఎలా సిద్ధంగా ఉండాలి? ఎలాంటి సవాళ్లు రానున్నాయి? వాటిని ఎలా అధిగమించాలి? ఇలా మరెన్నో అంశాలను ముందుగానే గ్రహించి తమ నిర్ణయాలను తీసుకుంటారు.

Read Also : Google CEO Sundar Pichai : చెన్నైలో గూగుల్ సీఈఓ ఇంటిని కొనేసిన తమిళ నటుడు.. ఆస్తి అప్పగిస్తూ సుందర్ పిచాయ్ తండ్రి భావోద్వేగం..!