Flipkart Big Year End Sale 2023 : గూగుల్ పిక్సెల్ 7ప్రోపై ఏకంగా రూ. 24వేలు తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

Flipkart Big Year End Sale : ఫ్లిప్‌కార్ట్ మొబైల్ సేల్ 2023 సందర్భంగా గూగుల్ పిక్సెల్ 7 ప్రో భారీ తగ్గింపుతో అందుబాటులో ఉంది. ఏ బ్యాంక్ లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్లు అవసరం లేదు. ఈ హ్యాండ్‌సెట్ ధర, బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు ఎలా ఉన్నాయో ఓసారి లుక్కేయండి.

Flipkart Big Year End Sale 2023 : గూగుల్ పిక్సెల్ 7ప్రోపై ఏకంగా రూ. 24వేలు తగ్గింపు.. ఈ డీల్ అసలు మిస్ చేసుకోవద్దు!

Google Pixel 7 Pro Price _ Last Chance To Grab Rs 24K Off During Flipkart Big Year End Sale

Updated On : December 16, 2023 / 9:10 PM IST

Flipkart Big Year End Sale 2023 : ఫ్లిప్‌కార్ట్ బిగ్ ఇయర్ ఎండ్ సేల్ 2023 సందర్భంగా సెర్చ్ దిగ్గజం గూగుల్ ఈ ఏడాది అక్టోబర్‌లో భారత మార్కెట్లో పిక్సెల్ 8 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ప్రకటించింది. ప్రస్తుతం ఈ ఫోన్ ధర రూ. 1 లక్ష కన్నా ఎక్కువగా ఉండగా, ఒక ఏడాది ఫ్లాగ్‌షిప్ పిక్సెల్ 7 ప్రోను భారీ తగ్గింపులతో సొంతం చేసుకోవచ్చు. అంటే.. అసలు ధరలో దాదాపు సగం ధరతో పొందవచ్చు.

Read Also : Beware Apple Users : ఆపిల్ యూజర్లు తస్మాత్ జాగ్రత్త.. మీ ఐఫోన్, మ్యాక్‌బుక్ డివైజ్‌లు డేంజర్‌లో.. వెంటనే అప్‌డేట్ చేసుకోండి!

మీరు ఏ బ్యాంక్ లేదా ఎక్స్ఛేంజ్ ఆఫర్లపై ఆధార పడాల్సిన అవసరం లేదు. బిగ్ ఇయర్ ఎండ్ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్‌లో పిక్సెల్ 7ప్రో తక్కువ ధరకు అందుబాటులో ఉంది. అయితే, ఈ సేల్ డిసెంబర్ 15తో ముగియనుంది. గత ఏడాది ఫ్లాగ్‌షిప్ ఫోన్ల పట్ల ఆసక్తి ఉంటే.. మీరు కొన్ని హ్యాండ్‌సెట్ ధర, బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్లు, స్పెసిఫికేషన్‌ల వివరాలను ఇప్పుడు తెలుసుకోవచ్చు.

క్రెడిట్ కార్డులపై రూ. 2వేల వరకు తగ్గింపు :
ఫ్లిప్‌కార్ట్ మొబైల్ ఆఫర్లు 2023 : బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్, క్యాష్‌బ్యాక్‌లతో గూగుల్ పిక్సెల్ 7 ప్రో ప్రారంభ ధర రూ. 60,999 (12జీబీ + 128జీబీ) అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మొత్తం హాజెల్, అబ్సిడియన్, స్నో అనే 3 కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఎంచుకున్న బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ లావాదేవీల ద్వారా కొనుగోలుదారులు రూ. 1,000 వరకు తగ్గింపును పొందవచ్చు. అంతేకాకుండా, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్ ఈఎంఐ లావాదేవీల ద్వారా రూ. 2వేల వరకు తగ్గింపు పొందవచ్చు.

Google Pixel 7 Pro Price _ Last Chance To Grab Rs 24K Off During Flipkart Big Year End Sale

Google Pixel 7 Pro Price

ఎంపిక చేసిన మోడల్స్‌పై రూ. 4వేలు తగ్గింపు :
కొనుగోలు సమయంలో రూ. 699కి స్పాటీఫై ప్రీమియం 12-నెలల ప్లాన్‌ను కూడా పొందవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్లలో రూ. 38,500 వరకు తగ్గింపును పొందవచ్చు. ఇందులో ఎంపిక చేసిన మోడల్‌ల బేస్ వాల్యూపై అదనంగా రూ. 4వేల తగ్గింపు ఉంటుంది. గూగుల్ పిక్సెల్ 7 ప్రో స్పెసిఫికేషన్‌లు పిక్సెల్ 7 ప్రో మోడల్ 6.7-అంగుళాల క్యూహెచ్‌డీ+ ఓఎల్ఈడీ ఎల్‌టీపీఓ 120హెచ్‌జెడ్ స్క్రీన్‌తో 1,500నిట్స్ గరిష్ట ప్రకాశంతో అందిస్తుంది. 212గ్రాముల బరువు, 8.9ఎమఎమ్ మందంగా ఉంటుంది. హుడ్ కింద ఫోన్ టెన్సర్ జీ2 ప్రాసెసర్, టైటాన్ ఎం2 సెక్యూరిటీ చిప్‌తో రన్ అవుతుంది.

పిక్సెల్ 7 ప్రో స్పెషిఫికేషన్లు, ఫీచర్లు :
ఆండ్రాయిడ్ 13తో వచ్చినప్పటికీ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 14 వెర్షన్ కూడా సపోర్టు చేస్తుంది. పిక్సెల్ 7 ప్రో ఫోన్ 23డబ్ల్యూ వైర్డు, వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 5,000ఎంఎహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఈ హ్యాండ్‌సెట్ 50ఎంపీ (ప్రాధమిక) + 12ఎంపీ (యూడబ్ల్యూ) + 48ఎంపీ (5ఎక్స్ టెలిఫోటో) బ్యాక్, 10.8ఎంపీ సెల్ఫీ షూటర్‌ను అందిస్తుంది. ఐపీ68-రేటెడ్ హ్యాండ్‌సెట్ వై-ఫై6, బ్లూటూత్ 5.2, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ 3.2 టైప్-సి పోర్ట్‌ను అందిస్తుంది. పిక్సెల్ 7 ప్రో ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ రీడర్‌ కలిగి ఉంది.

Read Also : OnePlus 12 Launch Date : భారత్‌లో వన్‌ప్లస్ 12 ఫోన్ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. దిమ్మతిరిగే ఫీచర్లు, ధర ఎంత ఉండొచ్చుంటే?