గూగుల్ న్యూ రిలీజ్: ‘ఫిక్సల్’ యూజర్లకు సెక్యూరిటీ అప్‌డేట్‌

గూగుల్ ఫిక్సల్ యూజర్లకు గుడ్ న్యూస్. ఇక మీ డివైజ్ లకు సెక్యూరిటీ అప్ డేట్ వచ్చేసింది. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఫిబ్రవరి 2019 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్ డేట్ ను రిలీజ్ చేసింది.

  • Published By: sreehari ,Published On : February 5, 2019 / 09:56 AM IST
గూగుల్ న్యూ రిలీజ్: ‘ఫిక్సల్’ యూజర్లకు సెక్యూరిటీ అప్‌డేట్‌

Updated On : February 5, 2019 / 9:56 AM IST

గూగుల్ ఫిక్సల్ యూజర్లకు గుడ్ న్యూస్. ఇక మీ డివైజ్ లకు సెక్యూరిటీ అప్ డేట్ వచ్చేసింది. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఫిబ్రవరి 2019 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్ డేట్ ను రిలీజ్ చేసింది.

గూగుల్ ఫిక్సల్ ఫోన్ యూజర్లకు గుడ్ న్యూస్. ఇక మీ డివైజ్ లకు సెక్యూరిటీ అప్ డేట్ వచ్చేసింది. ప్రముఖ సెర్చ్ ఇంజిన్ దిగ్గజం గూగుల్ ఫిబ్రవరి 2019 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్ డేట్ ను రిలీజ్ చేసింది. లేటెస్ట్ ఆండ్రాయిడ్ అప్ డేట్ కు సంబంధించిన OTA, ఫ్యాక్టరీ ఇమేజ్ లు అందుబాటులోకి వచ్చేశాయి. ఫిబ్రవరి 2019 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్ డేట్ తో రెండు ప్యాచ్ లెవల్స్  (2019-02-01, 2019-02-05)ను గూగుల్ రిలీజ్ చేసింది. ఫిక్సల్ యూజర్ల కోసం ప్రత్యేకించి గూగుల్ ఈ సెక్యూరిటీ అప్ డేట్ ను తీసుకొచ్చింది. ఫిక్సల్ 3, ఫిక్సల్ 3 XL, ఫిక్సల్ 2, ఫిక్సల్ 2 XL, ఫిక్సల్, ఫిక్సల్ XL, ఫిక్సల్ C డివైజ్ ల్లో ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. 

గత ఏడాదిలో నెక్సస్ (Nexus) మోడల్స్ పై అందించే ప్యాచ్ సపోర్ట్ పై గూగుల్ డ్రాప్ అయినప్పటి నుంచి నెక్సస్ 5X, నెక్సస్ 6P డివైజ్ లకు అప్ డేట్స్ అందుబాటులో లేవు. గూగుల్ కొత్తగా రిలీజ్ చేసిన ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్ డేట్ తో ఫిక్సల్ డివైజ్ ల్లో మొత్తం హై నుంచి క్రిటికల్ రేంజ్ వరకు ఉండే మొత్తం 42 ఇష్యూల ఫిక్స్ చేయొచ్చు. గమనించాల్సి విషయం ఏమిటంటే.. ఫిక్సల్ ఎక్స్ క్లూజివ్ ఫీచర్లలో మాత్రం ఈ ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్ డేట్ యాడ్ కాదు. ఈ ప్యాచ్ ద్వారా 15 నుంచి 27 టెక్నికల్ ఇష్యూలను రిజాల్వ్ చేయొచ్చు. అందులో మీడియా లైబ్రరీ, కెర్నల్ కంపోనెంట్స్ సమస్యలను సైతం పరిష్కరించవచ్చు. 

About సెక్షన్ నుంచి Primary సెక్షన్ లోకి..
9టూ 5గూగుల్ అందించే ఫిబ్రవరి 2019 ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్ డేట్.. ఫిక్సల్ డివైజ్ ల్లో About Phone సెక్షన్ లో మూవ్ అయింది. ఇప్పుడు ఈ రెండూ డివైజ్ ప్రైమరీ సెట్టింగ్స్ మెనూలోకి మూవ్ అయ్యాయి. టిప్స్ అండ్ సపోర్ట్ ఆప్షన్ పైన కనిపిస్తాయి. గతంలో About Phone సెక్షన్ సిస్టమ్ మెనూలో ఉండేది. అందులోనే ఫిక్సల్ డివైజ్ ల సేప్టీ అండ్ వారంటీ బుక్ లెట్ సేఫ్టీ అండ్ రెగ్యులేటరీ మాన్యువల్ సెక్షన్ ఉంది. 

2019 సెక్యూరిటీ అప్ డేట్ ఇన్ స్టాల్ చేయండిలా
* గూగుల్ అందించే OTA zip ఫైల్స్ ను డౌన్ లోడ్ చేసుకోండి.
* ఫిబ్రవరి ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అప్ డేట్ ను డివైజ్ లో ఇన్ స్టాల్ చేయండి
* డౌన్ లోడ్ చేసిన అప్ డేట్ ఫైల్ అన్ లాకడ్ బూట్ లోడర్ ద్వారా ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
* ఫిక్సల్ యూజర్లు తాము వాడే డివైజ్ ల్లో సెట్టింగ్స్ లోకి వెళ్లండి.
* సిస్టమ్ ఆప్షన్ పై క్లిక్ చేయండి.
* అడ్వాన్స్ డ్ ఆప్షన్ పై క్లిక్ చేయగానే సిస్టమ్ అప్ డేట్ ఆప్షన్ కనిపిస్తుంది. అంతే.. మీ డివైజ్ లో అప్ డేట్ ఇన్ స్టాల్ అయిపోతుంది. 
* ఫిక్సల్ డివైజ్ ల్లో ఆండ్రాయిడ్ న్యూ వర్షన్ రన్ అవుతుండాలి. 
* అప్పుడే లేటెస్ట్ సెక్యూరిటీ అప్ డేట్ పొందేందుకు వీలుంది.