Happy Navratri 2025 : హ్యాపీ నవరాత్రి 2025 వాట్సాప్ స్టేటస్ వీడియో.. ఇలా డౌన్‌లోడ్ చేసి మీ ప్రియమైన వారికి షేర్ చేయండి..!

Happy Navratri 2025 : 2025 నవరాత్రి పండుగ సందడి మొదలైంది. పండగ శుభాకాంక్షల కోసం వాట్సాప్ స్టేటస్ వీడియో ఇలా డౌన్‌లోడ్ చేసి షేర్ చేయండి.

Happy Navratri 2025 : హ్యాపీ నవరాత్రి 2025 వాట్సాప్ స్టేటస్ వీడియో.. ఇలా డౌన్‌లోడ్ చేసి మీ ప్రియమైన వారికి షేర్ చేయండి..!

Happy Navratri 2025

Updated On : September 22, 2025 / 1:54 PM IST

Happy Navratri 2025 : వాట్సాప్ యూజర్లకు గుడ్ న్యూస్. 2025 పండగ సీజన్ వచ్చేసింది. 9 రోజుల నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. దుర్గామాతను ఈ 9 రోజులు తొమ్మిది రూపాల్లో భక్తులు పూజిస్తారు. దేశమంతటా ఉపవాసాలు పాటించడం, ఇళ్లను అలంకరించడం, దేవాలయాలను సందర్శించడం, దాండియా ఆడటం ద్వారా ఈ పవిత్ర పండుగను జరుపుకుంటారు.

నేటి డిజిటల్ యుగంలో పండుగ (Happy Navratri 2025) శుభాకాంక్షలు కూడా వర్చువల్‌గా మారాయి. వాట్సాప్ స్టేటస్‌లతో స్నేహితుల, బంధువులకు హ్యాపీ నవరాత్రి 2025 విషెస్ పంపుతుంటారు. మీరు కూడా వాట్సాప్ ద్వారా హ్యాపీ నవరాత్రి 2025 శుభాకాంక్షలను షేర్ చేయాలని అనుకుంటున్నారా? అది ఎలా చేయాలో ఇప్పుడు పూర్తి వివరంగా తెలుసుకుందాం.. ఫుల్ గైడ్ ఓసారి లుక్కేయండి..

Read Also : Best Flagship Smartphone Deals : అమెజాన్ ఫెస్టివల్ సేల్ ఆఫర్లు.. ఈ శాంసంగ్, వివో, వన్‌ప్లస్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లపై బెస్ట్ డీల్స్.. ఏ ఫోన్ కొంటారో కొనేసుకోండి!

యూట్యూబ్ నుంచి డౌన్‌లోడ్ చేయడం ఎలా? :

  • ఫెస్టివల్ వీడియో క్లిప్‌ల కోసం యూట్యూబ్ అద్భుతమైన ప్లాట్‌ఫామ్‌లలో ఒకటి. ఈ కింది విధంగా ట్రై చేయండి.
  • యూట్యూబ్‌కి వెళ్లి సెర్చ్ బార్‌లో “Happy Navratri 2025 WhatsApp Status Video”ని టైప్ చేయండి.
  • సెర్చ్ రిజల్ట్స్‌లో మీకు నచ్చిన వీడియోను ఎంచుకోండి.
  • వీడియో లింక్‌ కాపీ చేసి యూట్యూబ్ డౌన్‌లోడ్‌లో ఎంటర్ చేయండి (వెబ్‌సైట్‌లు, యాప్‌లు) ఏదైనా ఒకటి ఎంచుకోవచ్చు.
  • MP4 ఫార్మాట్ ఎంచుకుని వీడియో క్లిప్‌ను డౌన్‌లోడ్ చేయండి.
  • ఫ్రెండ్స్, ఫ్యామిలీ సభ్యులతో షేర్ చేసేందుకు మీ ఫోన్‌లో సేవ్ చేయండి.
  • మీ వాట్సాప్ స్టేటస్‌లో అప్‌లోడ్ చేయండి.

ఇతర ప్లాట్‌ఫామ్‌ల నుంచి డౌన్‌లోడ్ ఎలా? :
యూట్యూబ్ మాత్రమే కాకుండా అనేక వెబ్‌సైట్‌లు ఫెస్టివల్ క్లిప్‌లను అందిస్తున్నాయి. “హ్యాపీ నవరాత్రి 2025 వాట్సాప్ స్టేటస్ వీడియో డౌన్‌లోడ్” కోసం గూగుల్ సెర్చ్ ద్వారా అనేక ఆప్షన్లను పొందవచ్చు. Pexels, Pixabay, Pinterest, Unsplash వంటి ప్లాట్‌ఫారమ్‌లు మీకు కావాల్సిన విధంగా MP4 ఫార్మాట్‌లో డౌన్‌లోడ్ చేసే హై క్వాలిటీ ఫెస్టివల్ విజువల్స్‌ కలిగి ఉన్నాయి.

ఈ వీడియోలు వాట్సాప్‌లో మాత్రమే అందుబాటులో ఉండవు. మీరు ఈ ఫొటోలు, వీడియోలను నేరుగా మీ ప్రియమైనవారికి పంపవచ్చు. ఫేస్‌బుక్ స్టోరీస్ లేదా ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌లో పోస్ట్ చేయవచ్చు. పర్సనల్ టచ్ కోసం చాట్‌జీపీటీ, జెమిని లేదా గ్రోక్ వంటి ప్రోగ్రామ్‌లతో ఉచితంగా ఏఐ జనరేటెడ్ నవరాత్రి శుభాకాంక్షల వీడియోలు లేదా ఫొటోలను కూడా తయారు చేయవచ్చు.