Honda Motors : 125 సీసీ “టూ వీలర్” ధరలు పెంచిన హోండా కంపెనీ.

హోండా కంపెనీ మరోసారి తమ వాహనశ్రేణిలోని పలు మోడళ్ల ధరలు పెంచింది.. హోండా 6 జీ యాక్టివాపై రూ.1,237 రూపాయలు పెంచగా యాక్టివా 125 సీసీ రేంజ్ ధర రూ.964 పెంచింది. యాక్టివా 125 డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధరను రూ.693 పెంచారు.

Honda Motors : 125 సీసీ “టూ వీలర్” ధరలు పెంచిన హోండా కంపెనీ.

Honda Motors

Updated On : July 8, 2021 / 4:32 PM IST

Honda Motors :  హోండా కంపెనీ మరోసారి తమ వాహనశ్రేణిలోని పలు మోడళ్ల ధరలు పెంచింది. హోండా 6 జీ యాక్టివాపై రూ.1,237 రూపాయలు పెంచగా యాక్టివా 125 సీసీ రేంజ్ ధర రూ.964 పెంచింది. యాక్టివా 125 డ్రమ్ బ్రేక్ వేరియంట్ ధరను రూ.693 పెంచారు. హొండాలో లభించే 125 సీసీ వెహికల్స్ అన్నింటిపై ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది కంపెనీ. వీటిలో హోండా షైన్, హోండా ఎస్పీ 125 కూడా ఉన్నాయి. మెటీరియల్స్ ధరలు పెరగడంతో వాహనాల ధరలు పెంచినట్లుగా హోండా కంపెనీ ప్రతినిధులు తెలిపారు.

కాగా హోండా షైన్ 125 సీసీ, హోండా ఎస్పీ 125 సీసీలపై రూ.1200 పెరిగింది. ఎస్పీ125, షైన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. వీటిలో ఫ్రంట్ డ్రమ్ బ్రేక్ వెర్షన్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్ వెర్షన్ ఉన్నాయి. హోండా షైన్ డ్రమ్ బైక్ వేరియంట్ ధర.71,550 నుంచి 72,787 రూపాయలకు పెరిగింది. డ్రిస్క్ బ్రేక్ వేరియంట్ ధర 76,346 నుంచి 77,582 రూపాయలకు ఎరిగింది.

ఇక యాక్టివా విషయానికి వస్తే.. యాక్టివా 6జీ ఎస్టీడీ గతంలో రూ.67,843 గా ఉంది.. ధర పెరగడంతో రూ.69,080 కి చేరింది. యాక్టివా 6జీ డీఎల్ఎక్స్ ధర గతంలో రూ.69,589 ఉండగా ప్రస్తుతం రూ.70,825 కి చేరింది. యాక్టివా 6 జీ ఎస్టీడీ ధర రూ. 69,343 రూపాయలు కాగా, ఉప్పుడు దాని ధర రూ.70,580కి చేరింది. యాక్టివా 125 డ్రమ్ బ్రేక్ ఎడిషన్ గతంలో రూ.71,674 ప్రస్తుతం రూ.72,367 కి చేరింది.