HONOR 600S 5G : వాటర్, డస్ట్‌కు నో టెన్షన్.. 8100mAh బ్యాటరీతో కొత్త హానర్ 5G ఆగయా.. ఛార్జర్ మర్చిపోవచ్చు!
HONOR 600S 5G : కొత్త హానర్ ఫోన్ లాంచ్ అయింది. 50MP కెమెరా, 8100mAh బ్యాటరీ, IP69K రేటింగ్‌తో అద్భుతంగా ఉంది. ఈ హానర్ 600S 5G ఫోన్ సేల్ ఎప్పుడు? ఎలా పొందాలో ఇప్పుడు వివరంగా చూద్దాం..
HONOR 600S 5G
- ఈ ఫోన్లో 6.87 అంగుళాల టీఎఫ్టీ ఎల్సీడీ డిస్ప్లే
- స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్సెట్తో రన్ అవుతుంది
- ఆండ్రాయిడ్ 10 మ్యాజిక్ఓఎస్ 16తో వస్తుంది
HONOR 600S 5G : కొత్త హానర్ ఫోన్ అదుర్స్.. హానర్ 600S 5జీ వచ్చేసింది. ఈ ఫోన్లో 120Hz రిఫ్రెష్ రేట్, 1020 నిట్స్ వరకు టాప్ బ్రైట్నెస్, 6.87-అంగుళాల టీఎఫ్టీ ఎల్ సీడీ డిస్ప్లే ఉంది. అలాగే, స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్సెట్తో రన్ అవుతుంది.
8GB ర్యామ్, 128GB స్టోరేజ్ కూడా అందిస్తుంది. ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ఓఎస్ 10పై రన్ అవుతుంది. ఇందులో భారీ 8100mAh బ్యాటరీ ఉంది. ధర, ఇతర ముఖ్య ఫీచర్లపై ఓసారి పరిశీలిద్దాం..
హానర్ 600S 5జీ ధర ఎంతంటే? :
హానర్ 600S 5జీ ఫోన్ హాంగ్ కాంగ్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ 6GB+128GB వేరియంట్ ధర HK1,999 డాలర్లు (సుమారుగా రూ. 15,600). ఈ ఫోన్ డెసర్ట్ గోల్డ్, మిస్టీ పర్పుల్, వెల్వెట్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు ఇతర రిటైల్ స్టోర్లలో కూడా లభిస్తోంది.
హానర్ 600S 5జీ స్పెసిఫికేషన్లు :
ఈ హానర్ 5జీలో 1592×720 పిక్సెల్స్ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్, 1020 నిట్స్ వరకు టాప్ బ్రైట్‌నెస్‌తో 6.87-అంగుళాల టీఎఫ్టీ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. ఈ డిస్ప్లే డీసీ, డైనమిక్ డిమ్మింగ్‌తో పాటు లో బ్లూ లైట్, డార్క్ మోడ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 4 చిప్సెట్తో రన్ అవుతుంది. 8GB ర్యామ్, 128GB స్టోరేజ్ అందిస్తుంది. ఈ ఫోన్లో కంపెనీ ర్యామ్ టర్బో టెక్నాలజీ ఉంది. 16GB వరకు వర్చువల్ మెమరీకి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆధారిత మ్యాజిక్ఓఎస్ 10తో వస్తుంది.
కెమెరాల విషయానికొస్తే.. :
ఈ ఫోన్లో f/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ రియర్ కెమెరా ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీలు, వీడియో కాలింగ్ కోసం 5MP కెమెరా ఉంది. ఈ ఫోన్ 1080p వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
హానర్ 600S 5జీలో 8,100mAh బ్యాటరీ ఉంది. 45W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 5 ఏళ్ల తర్వాత కూడా ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యంలో 80శాతం కన్నా ఎక్కువ టైమ్ ఛార్జింగ్ ఉంటుందని హానర్ పేర్కొంది.
ఈ ఫోన్లో ఏఐ మెమరీ, సర్కిల్ టు సెర్చ్, ఏఐ ఇమేజ్ రిమూవల్, ఏఐ సమ్మరీ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఏఐ ఆధారిత వీడియో-ఫ్రమ్-ఇమేజ్ ఫీచర్ కూడా ఉంది. సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. NFCకి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ కొలతలు 168.3×78.54×8.30mm ఉండగా, బరువు 216.5 గ్రాములు ఉంటుంది. డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ కోసం IP68, IP69, IP69K రేటింగ్ అందిస్తుంది.
