Realme C100i Launch : రూ.15 వేల లోపే రియల్‌మి కొత్త ఫోన్.. 6,500mAh బ్యాటరీతో అదిరే ప్యాకేజీ!
Realme C100i Launch : భారత మార్కెట్లో రియల్‌మి C100i రూ.14,999కు లాంచ్ అయింది. 6,500mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లే, యూనిసోక్ చిప్సెట్తో ఈ ఫోన్ పూర్తి ఫీచర్లు ఎలా ఉన్నాయంటే?
Realme C100i Launch
- 120Hz డిస్ప్లే.. భారీ బ్యాటరీ..
- రియల్‌మి నుంచి కొత్త బడ్జెట్ ఫోన్
- రియల్‌మి C100i ఫస్ట్ సేల్ ఎప్పుడంటే?
Realme C100i Launch : మీ బడ్జెట్లో మంచి ఫోన్ కోసం చూస్తున్నారా? రియల్‌మి నుంచి ఖతర్నాక్ ఫోన్ వచ్చేసింది. రియల్‌మి C100i భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్ ధరను రూ.14,999గా కంపెనీ నిర్ణయించింది. భారీ బ్యాటరీ, 120Hz డిస్ ప్లే, కొత్త జనరేషన్ సాఫ్ట్‌వేర్‌తో ఆకట్టుకునేలా ఉంది.
ధర పరంగా చూస్తే :
రియల్‌మి C100i సింగిల్ వేరియంట్ మాత్రమే లభిస్తుంది. 4GB ర్యామ్ + 64GB స్టోరేజీ ఈ మోడల్ ధర రూ.14,999కు లభిస్తోంది. అర్హత ఉన్న విద్యార్థులకు రూ.250 కూపన్ డిస్కౌంట్ కూడా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్, రియల్‌మి భారతీయ ఆన్లైన్ స్టోర్ ద్వారా కొనేసుకోవచ్చు. మిడ్నైట్ బ్లాక్, స్కైలైన్ సిల్వర్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.
భారీ డిస్ప్లే 120Hz స్పీడ్ :
ఈ ఫోన్లో 6.75 అంగుళాల HD+ ఎల్సీడీ డిస్ప్లే ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్, 900 నిట్స్ వంటి ఫీచర్లు స్పెషల్ అని చెప్పొచ్చు. వీడియోలు చూడటం, సోషల్ మీడియా వాడటం వంటివి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.
బ్యాటరీనే హైలైట్ :
ఈ ఫోన్లో 6,500mAh భారీ బ్యాటరీ అందించారు. 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్టు కూడా ఉంది. రోజంతా ఫోన్‌ను ఎక్కువగా వాడేవారికి బ్యాటరీ స్పెషల్ అట్రాక్షన్..
Read Also : Vivo Y31t vs Realme 16x 5G : ఒకే ధర.. రెండు 5G ఫోన్లు.. రూ.25,999 బడ్జెట్లో ఏది కొనాలి? ఫుల్ డిటెయిల్స్
కెమెరాలు ఎలాగంటే? :
బ్యాక్ సైడ్ 8MP మెయిన్ కెమెరా, ఫ్రంట్ సైడ్ 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. బ్యాక్ కెమెరాతో 1080p వరకు వీడియో రికార్డింగ్ చేయొచ్చు.
ఫీచర్లు ఇంకా ఏంటి? :
యూనిసోక్ T7250 చిప్సెట్, 4GB LPDDR4x ర్యామ్, 64GB UFS 2.2 స్టోరేజీతో ఈ ఫోన్ వస్తుంది. మైక్రోఎస్డీ కార్డుతో స్టోరేజీ పెంచుకోవచ్చు. ఆండ్రాయిడ్ 16 ఆధారిత రియల్‌మి యూఐతో రన్ అవుతుంది.
డస్ట్, వాటర్ నుంచి ప్రొటెక్షన్ కోసం IP64 రేటింగ్, రైట్ సైడ్ ఫింగర్ ఫ్రింట్, 4జీ, వై-ఫై 5, బ్లూటూత్ 5.2, టైప్-C పోర్ట్, 3.5mm ఆడియో జాక్ వంటివి ఉన్నాయి. మొత్తం మీద, భారీ బ్యాటరీకి ప్రాధాన్యం ఇచ్చే బడ్జెట్ కస్టమర్లకు రియల్‌మి C100i అద్భుతంగా ఉంటుంది.
