మీ ఫోన్లో Whatsapp కాంటాక్ట్ డిలీట్ చేయండిలా?

స్మార్ట్ ఫోన్ వాడే ప్రతిఒక్కరికి వాట్సాప్ తప్పనిసరిగా మారింది. చాలామంది అవసరం ఉన్నా లేకున్నా చాలామంది కాంటాక్టులను తమ ఫోన్లలో సేవ్ చేస్తుంటారు. దీంతో కాంటాక్ట్ మెమెరీ అంతా నిండిపోతుంది. అదే కాంటాక్ట్ కు వాట్సాప్ అకౌంట్ ఉండొచ్చు.. వాట్సాప్ ఓపెన్ చేసిన ప్రతిసారి ఆయా కాంటాక్టుల్లో అవసరం లేనివి కనిపిస్తుంటాయి.
ఇలాంటి కాంటాక్టులను ఒక్కొక్కటిగా ఏరి పారేయచ్చు.. మీ ఫోన్లో కూడా ఏదైనా కాంటాక్ట్ వాడటం లేదా? ఎలాంటి మెసేజ్ పంపడం లేదా? అలాంటి అవసరంలేని కాంటాక్టులను డిలీట్ చేయాలని అనుకుంటున్నారా? మీరు మీరు ఫోన్ కాంటాక్టులోని ఏదైనా కాంటాక్ట్ డిలీట్ చేస్తే.. ఆటోమాటిక్ గా వాట్సాప్ కాంటాక్టులోని అనవసరమైన కాంటాక్టు కూడా డిలీట్ అయిపోతుంది. అయితే ఈ కింది విధంగా ఫాలో అవ్వండి.
* మీ ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ డివైజ్ లో Whatsapp ఓపెన్ చేయండి.
* వాట్సాప్ Chats పై Tap చేయండి.
* టాప్ రైట్ కార్నర్ లో ఉన్న పెన్సిల్ ఐకాన్ పై Click చేయండి.
* లేదంటే.. డిలీట్ చేయాలనుకునే Contact Name సెర్చ్ చేసి దానిపై Tap చేయండి.
* వాట్సాప్ స్ర్కీన్ పై టాప్ రైట్ కార్నర్ లో Edit బటన్ పై Tap చేయండి.
* View in adress book లోకి వెళ్లండి..
* స్ర్కీన్ కిందిభాగంలో Menu బటన్ పై క్లిక్ చేయండి.
* ఇక్కడ మీకు Delete అనే బటన్ కనిపిస్తుంది.
* Contact డిలీట్ చేయాలా? Pop Up మెసేజ్ వస్తుంది.
* Delete Contact పై క్లిక్ చేస్తే వెంటనే డిలీట్ అయిపోతుంది.
* ఫోన్ కాంటాక్టులో డిలీట్ చేస్తే.. Whatsapp నుంచి కూడా డిలీట్ అవుతుంది.