సైబర్ మోసాల్లో కొత్త ట్రెండ్.. వాట్సాప్ లో కొత్త స్కాం.. మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా.. నమ్మారంటే గోవిందా..

ఇలా మోసపోయినవారిలో వేలాది మంది ఉన్నట్లు సమాచారం.

సైబర్ మోసాల్లో కొత్త ట్రెండ్.. వాట్సాప్ లో కొత్త స్కాం.. మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా.. నమ్మారంటే గోవిందా..

Updated On : June 2, 2025 / 2:17 PM IST

మోసాలకు పాల్పడుతూ డబ్బులు సంపాదించడానికి కేటుగాళ్లు కొత్త కొత్త ప్రణాళికలను అమలు చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో వాట్సాప్‌ను అందరూ వాడుతున్నారు. ఇదే అదునుగా వాట్సాప్‌ ద్వారానే చీటింగ్‌ చేసి డబ్బు సంపాదించడానికి కేటుగాళ్లు ప్లాన్లు వేసుకుంటున్నారు. తాము పంపే ఫొటోలను వాట్సాప్‌లో స్టేటస్‌గా పెట్టుకోవాలని, ఇలా చేస్తే బ్యాంకు అకౌంట్లలో డబ్బులు పడతాయని నమ్మిస్తున్నారు.

స్టేటస్‌లో పెట్టిన ఫొటోలకు వచ్చే వ్యూస్, లైక్స్‌, కామెంట్‌ల ఆధారంగా ఒక్కో టాస్క్‌కి రూ.2 చొప్పున వస్తాయని చెబుతున్నారు. ఇలా డబ్బులు సంపాదించడానికి ముందుగా రూ.300 చెల్లించి పేరును నమోదు చేసుకోవాలని అంటున్నారు. ఈ డబ్బును తమ ఫోన్‌ నంబర్‌కు పంపాలని చెబుతున్నారు. అంతేగాక, మరో ఆరుగురి పేర్లను కూడా ఇలా నమోదు చేయిస్తే ఇచ్చిన రూ.300 తిరిగి ఇస్తామని అంటున్నారు.

Also Read: తక్కువ బడ్జెట్‌లో మంచి స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? అమెజాన్‌లో అద్భుతమైన ఆఫర్… సూపర్ ఫీచర్లతో స్మార్ట్‌ఫోన్…

వారి మాటలను నమ్మిన వారు రూ.300 చొప్పున చెల్లిస్తున్నారు. వారిలో ఒకరిద్దరికి మాత్రమే రూ.300ను కేటుగాళ్లు తిరిగి ఇస్తున్నారు. వారిలో నమ్మకాన్ని నింపుతున్నారు. మిగతా వారందరినీ మోసం చేస్తున్నారు.

అంతేగాక, వాట్సాప్‌ స్టేటస్‌లను పెట్టుకున్న వారికి కూడా ఒక్కో టాస్క్‌కి రూ.2 చొప్పున డబ్బు అందడం లేదు. ఇటీవల తాండూరు, వికారాబాద్‌లో చాలా మంది ఇలాగే మోసపోయారు. బయటకు చెబితే తమ పరువు పోతుందని చాలా మంది పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం లేదు. ఇలా మోసపోయినవారిలో వేలాది మంది ఉన్నట్లు సమాచారం.