మీ ఫోన్‌లో మల్టీపుల్ Instagram అకౌంట్లు Remove చేయండిలా!

  • Published By: sreehari ,Published On : December 27, 2019 / 07:33 AM IST
మీ ఫోన్‌లో మల్టీపుల్ Instagram అకౌంట్లు Remove చేయండిలా!

Updated On : December 27, 2019 / 7:33 AM IST

మీకు ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఉందా? ఒకే మొబైల్లో మల్టీపుల్ అకౌంట్లు వాడుతున్నారా? కొంతమంది ఒక అకౌంట్ లాగౌట్ అయినా మరో అకౌంట్ యాక్టివ్ గానే ఉంటుంది. కొన్నిసార్లు.. మల్టీపుల్ అకౌంట్లతో యూజర్లు కాస్త ఇబ్బందిగా ఫీలవుతుంటారు. డివైజ్ లో ఓసారి లాగిన్ అయ్యాక ఆయా అకౌంట్లను డివైజ్ నుంచి ఎలా డిలీట్ చేయాలో తెలియక సతమతం అవుతుంటారు.

డోంట్ వర్రీ.. అన్ని Instagram అకౌంట్లను ఒకేసారి డివైజ్ నుంచి రిమూవ్ చేసుకోవచ్చు. లేదంటే.. ఏ అకౌంట్ రిమూవ్ చేయాలన్నా ఆ ఒక్కటే చేసుకోవచ్చు. ఐఫోన్ లేదా ఆండ్రాయిడ్ ఫోన్లలో Instagram అకౌంట్ రిమూవ్ చేసుకోవాలంటే ఈ కింది 6 సింపుల్ స్టెప్స్ ఫాలో అయిపోండి..

ప్రాసెస్ ఇదిగో :
* iPhone లేదా Android డివైజ్‌‌లో Instagram యాప్ ఓపెన్ చేయండి.
* మీ Instagram అకౌంట్లో (Username & Password)తో Login అవ్వండి.
* స్ర్కీన్ కుడివైపు కార్నర్ కింది భాగంలో ప్రొఫైల్ ఫొటోపై Tap చేయండి. 
* Top Screenలో ఇన్ స్టాగ్రామ్ Usernameపై Tap చేయండి.
* మీకు ఇక్కడ మల్టీపుల్ అకౌంట్ల Drop-down list కనిపిస్తుంది.
* మీరు ఏ అకౌంట్ Remove చేయాలనుకుంటున్నారో Select చేయండి.
* Multiple అకౌంట్లు ఒకేసారి Remove చేయాలంటే.. అన్ని సెలెక్ట్ చేయండి.
* మీరు సెలెక్ట్ చేసిన ప్రతి అకౌంట్‌పై Blue Tick mark కనిపిస్తుంది.
* Top-Right కార్నర్‌లో 3 Lines కనిపిస్తాయి.. అక్కడ Tap చేయండి.
* Settings (గేర్ ఐకాన్) బటన్‌పై క్లిక్ చేయండి.
* Log Out (అకౌంట్ యూజర్ నేమ్)తో Pop-Up మెసేజ్ వస్తుంది.
* Log Out పై Click చేయండి.. మీ అకౌంట్లన్నీ Remove అవుతాయి.