ఇంటర్నెట్ అక్కర్లేదు : Android ఫోన్లలో SMSతో లొకేషన్ షేరింగ్

ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా? మీరు ఉన్న లొకేషన్ ఇతరులకు షేర్ చేయాలంటే కచ్చితంగా ఇంటర్నెట్ కనెక్టవిటీ ఉండాల్సిందే. మీ స్నేహితులు లేదా కుటుంబ సభ్యులకు లొకేషన్ షేర్ చేసే సమయంలో మీ ఫోన్లలో నెట్ యాక్టివేట్ లేదంటే షేర్ చేయడం కుదరదు.
సాధారణంగా లొకేషన్ షేర్ చేసేందుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. వీటిన్నింటిలో ఇంటర్నెట్ కనెక్టవిటీతో పనిచేసే యాప్స్ ఎక్కువగా అందుబాటులో ఉన్నాయి. ఫోన్లలో ఇంటర్నెట్ లేకుండా లొకేషన్ ఎలా షేర్ చేయాలో తెలుసా? ఇదిగో ఇలా చేసి చూడండి.
రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (RCS) అనే ప్రొగ్రామ్ ద్వారా లొకేషన్ షేరింగ్ చేయడం సాధ్యమే. ప్రత్యేకించి SMS ద్వారా లొకేషన్ షేరింగ్ చేసుకోవచ్చు. ఈ సర్వీసుతో లొకేషింగ్ షేరింగ్ తో పాటు ఎన్నో మల్టిమీడియా కంటెంట్ షేరింగ్ చేసేందుకు RCS సపోర్ట్ చేస్తుంది.
SMS సర్వీసు ఇంటర్నెట్ కనెక్టవిటీ లేకుండా వర్క్ అవుతుంది. అంతేకాదు.. ఆండ్రాయిడ్ యూజర్లు తమ లొకేషన్ ఇంటర్నెట్ లేకుండానే షేరింగ్ చేసేందుకు అనుమతి ఇస్తుంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో నుంచి SMS ద్వారా లొకేషన్ షేరింగ్ ఎలా చేయాలో ఓసారి చూద్దాం.
ఇదిగో ప్రాసెస్ :
* ఆండ్రాయిడ్ యూజర్లు.. గూగుల్ ప్లే స్టోర్ లోకి వెళ్లండి.
* Android Messages App డౌన్‌లోడ్ చేసుకోండి.
* App ఇన్ స్టాల్ చేసి.. అవసరమైన Permissions ఇవ్వండి.
* మీ స్మార్ట్ ఫోన్ డిఫాల్ట్ SMS యాప్ గా సెట్ చేసుకోండి.
* కుడివైపు కిందిభాగంలో Start Chat బటన్ కనిపిస్తుంది.
* ఆ బటన్ పై క్లిక్ చేయండి.
* Check my Location అని Type చేయండి.
* మీ ఫోన్ నెంబర్ మ్యానువల్ గా ఎంటర్ చేయండి.
* కాంటాక్ట్ లిస్టులో నుంచి మీ ఫోన్ నెంబర్ ఎంపిక చేసుకోండి.
* ‘+’ ఐకాన్ నుంచి Chat విండోకు Tap చేయండి.
* Scroll Down చేసి Maps ఆప్షన్ కోసం సెర్చ్ చేయండి.
* Mapsపై tap చేసి ‘Send this Location’ ఆప్షన్ ద్వారా షేర్ చేయండి.