Aadhaar Card Transactions : ఆధార్ కార్డ్ ద్వారా బ్యాంకు అకౌంట్లలోకి డబ్బులు ఎలా పంపాలో తెలుసా? ఇదిగో సింపుల్ ప్రాసెస్..!
Aadhaar Card Transactions : బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఓటీపీ లేదా పిన్ అవసరం లేదు. మీ బ్యాంక్ అకౌంట్‌కు మీ ఆధార్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి. ఒకే ఆధార్ కార్డును మల్టీ బ్యాంకు అకౌంట్లకు లింక్ చేయవచ్చు.

Financial Transactions Through Aadhaar Card
Aadhaar Card Transactions : ఆధార్ కార్డు అనేది ప్రతి భారతీయునికి అత్యంత ముఖ్యమైన ఐడెంటిటీ ప్రూఫ్‌గా మారింది. గుర్తింపు కార్డుగా మాత్రమే కాకుండా ఆర్థిక లావాదేవీలను సులభతరం చేస్తుంది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (AePS) ద్వారా మీరు డబ్బును విత్‌డ్రా చేయడం, ఫండ్స్ డిపాజిట్ చేయడం, ఇతర అకౌంట్లకు డబ్బును బదిలీ చేయడం వంటివి చేయవచ్చు.
నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) అభివృద్ధి చేసిన ఈ వ్యవస్థ డిజిటల్ లావాదేవీలను సురక్షితంగా లక్ష్యంగా పెట్టుకుంది. ఎఇపీఎస్ యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI)పై పనిచేస్తుంది. ఆధార్ నంబర్, ఫింగర్‌ఫ్రింట్ అథెంటికేషన్ ఉపయోగించి లావాదేవీలను పూర్తి చేయొచ్చు. దీని ముఖ్య ప్రయోజనం ఏమిటంటే.. బ్యాంక్ అకౌంట్ల వివరాలు ఓటీపీ లేదా పిన్ అవసరం లేదు. మీ బ్యాంక్ అకౌంట్‌కు మీ ఆధార్ కార్డును లింక్ చేయడం తప్పనిసరి. ఒకే ఆధార్ కార్డును మల్టీ బ్యాంకు అకౌంట్లకు లింక్ చేయవచ్చు.
ఎఇపీఎస్ (AePS) అందించే సర్వీసులు :
• బ్యాలెన్స్ చెక్ : మీ అకౌంట్ బ్యాలెన్స్‌ని చెక్ చేయవచ్చు.
• క్యాష్ విత్‌డ్రా : మీ బ్యాంక్ అకౌంట్ నుంచి నేరుగా ఫండ్స్ విత్ డ్రా చేయొచ్చు
• డబ్బు జమ చేయడం : మీ బ్యాంక్ అకౌంట్లను డబ్బులను డిపాజిట్ చేయండి.
• ఆధార్ నుంచి ఆధార్ ఫండ్ ట్రాన్స్‌ఫర్ : ఆధార్ నంబర్‌లను ఉపయోగించి అకౌంట్ల మధ్య డబ్బును ట్రాన్స్‌ఫర్ చేయండి.
• పేమెంట్స్ : ఆధార్ ఆధారిత పేమెంట్ సిస్టమ్ ద్వారా లావాదేవీలు చేయొచ్చు
ఎఇపీఎస్ (AePS) ఎలా ఉపయోగించాలి? :
ఎఇపీఎస్ ఉపయోగించేందుకు.. బ్యాంకింగ్ కరస్పాండెంట్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ఆపరేటర్‌ని సందర్శించండి. ఈ కరస్పాండెంట్లు డిజిటల్ లావాదేవీలను నిర్వహిస్తుంటారు. ఈ సర్వీసును యాక్సెస్ చేసేందుకు మీ ఇంటికి సందర్శించమని కరస్పాండెంట్‌ని కూడా అభ్యర్థించవచ్చు. బ్యాంకింగ్ సేవలను సులభంగా పొందలేని గ్రామీణ లేదా మారుమూల ప్రాంతాల ప్రజలకు ఎఇపీఎస్ ప్రత్యేకించి ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ సదుపాయం కస్టమర్‌లు బ్రాంచ్‌ను సందర్శించాల్సిన అవసరం లేకుండా అవసరమైన బ్యాంకింగ్ కార్యకలాపాలను నిర్వహించడానికి అనుమతిస్తుంది. ఇంటి నుంచి బ్యాంకింగ్ సౌలభ్యాన్ని అందిస్తుంది. ఎఇపీఎస్ బ్యాంకింగ్ సేవలను సులభతరం చేయడమే కాదు.. సురక్షితమైనది కూడా. డిజిటల్ ఇండియా దిశగా అందరికీ ఈ సర్వీసు అందుబాటులో ఉంటుంది.
Read Also : iQOO 13 Leak : ఐక్యూ 13 ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందే ధర, కీలక ఫీచర్లు లీక్..!