Huawei Mate XT : వావ్.. వండర్‌ఫుల్.. మడతబెట్టే ఫోన్ అంట.. ఏకంగా మూడు మడతలు.. ఫోల్డ్ చేస్తే ఫోన్.. ఓపెన్ చేస్తే ల్యాప్‌టాప్..!
Huawei Mate XT : హువావే ప్రపంచవ్యాప్తంగా MATE XT ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్ లాంచ్ చేసింది. రెండు మడతలు ఓపెన్ చేస్తే.. 10.2-అంగుళాల భారీ డిస్‌ప్లేగా మారుతుంది. భారతీయ కొనుగోలుదారులకు ఈ మడతబెట్టే ఫోన్ అందుబాటులో ఉందా?

Huawei Mate XT
Huawei Mate XT : కొత్త ఫోన్ కొంటున్నారా? అయితే ఈ ఫోన్ వైపు ఓసారి లుక్కేయండి. అన్ని ఫోన్లలా కాదండీ.. ఈ ఫోన్ స్పెషాలిటీనే వేరబ్బా.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా మూడు మడతల్లో వస్తుంది. సాధారణంగా ఒకటి లేదా రెండు మడతల్లో ఫోన్లను చూసి ఉంటారు.
ఈ ఫోల్డబుల్ ఫోన్ మాత్రం మూడు మడతలుగా ఓపెన్ చేయొచ్చు. ఇంతకీ ఈ ట్రిపుల్ ఫోల్డ్ ఫోన్ తయారుచేసిన కంపెనీ ఏంటో తెలుసా? హువావే సంస్థ. ప్రపంచంలోనే ఫస్ట్ ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్ అంట. ఈ కొత్త ట్రిపుల్ ఫోల్డబుల్ ఫోన్ మేట్ ఎక్స్‌టీ పేరుతో ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లోకి విడుదల అయింది. వాస్తవానికి, ఈ హువావే ఫోన్ గత ఏడాదిలోనే చైనాలో విడుదల అయింది.
మడతబెడితే స్మార్ట్‌ఫోన్..
కానీ, అక్కడి మార్కెట్‌కే పరిమితమైపోయింది. ఇప్పుడు ఆ మూడు మడతల ఫోన్ డిమాండ్ పెరగడంతో అన్ని దేశాల్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో విశేషం ఏమింటంటే.. మడత పెట్టినప్పుడు ఈ ఫోన్ 6.4 అంగుళాల కవర్ స్ర్కీన్‌తో మామూలు స్మార్ట్‌ఫోన్ మాదిరిగానే కనిపిస్తుంది.
ఓపెన్ చేస్తే.. ల్యాప్‌టాప్ అంతా.. :
ఒక మడత విప్పితే స్ర్కీన్ 7.9 అంగుళాలకు మారుతుంది. మరో మడత ఓపెన్ చేస్తే.. 10.2 అంగుళాలకు విస్తరిస్తుంది. మొత్తం ఫోల్డ్ చేస్తే స్మార్ట్‌ఫోన్‌లా కనిపిస్తుంది. మూడు మడతలు ఓపెన్ చేస్తే ల్యాప్‌టాప్ అంతా స్ర్కీన్ మాదిరిగా మారిపోతుంది అనమాట.. అప్పుడు ఈ ఫోన్ పూర్తిగా ఓపెన్ చేసిన తర్వాత హ్యాండ్‌సెట్ మందం కేవలం 3.6మి.మీ మాత్రమే ఉంటుంది. భలే ఉందిగా మడతపెట్టే ఫోన్..
చైనా బయటి మార్కెట్లలో Mate XT ఫోల్డబుల్ ఫోన్ అందుబాటులో ఉంటుందని హువావే ధృవీకరించింది. ఈ ఫోన్ యూరప్‌లో EUR 3,499 (సుమారు రూ. 3,18,200), యూఏఈలో AED 12,999 (సుమారు రూ. 3,07,700) ధరకు లభ్యమవుతుంది. భారతీయ వినియోగదారులకు ఈ మడతబెట్టే ఫోన్ త్వరలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.