Huawei Watch GT 5 Pro : కొత్త స్మార్ట్‌వాచ్ కొంటున్నారా? లాంగ్ బ్యాటరీ లైఫ్‌తో హువావే వాచ్ జీటీ 5 ప్రో.. హెల్త్ ట్రాకింగ్ ఫీచర్లు, ధర ఎంతంటే?
Huawei Watch GT 5 Pro : హువావే వాచ్ జీటీ 5 ప్రో ధర ఈయూఆర్ 330 (దాదాపు రూ. 34వేలు) నుంచి ప్రారంభమవుతుంది. 46ఎమ్ఎమ్ వెర్షన్ బ్లాక్, టైటానియం ఎండ్‌లో వస్తుంది.

Huawei Watch GT 5 Pro With Long Battery Life Launched
Huawei Watch GT 5 Pro : కొత్త స్మార్ట్ వాచ్ కొంటున్నారా? ప్రముఖ టెక్ దిగ్గజం హువావే నుంచి సరికొత్త హువావే వాచ్ జీటీ 5ప్రో వచ్చేసింది. బార్సిలోనాలో జరిగిన కంపెనీ మేట్‌ప్యాడ్ సిరీస్ టాబ్లెట్ లాంచ్ ఈవెంట్‌లో హువావే వాచ్ జీటీ 5 ప్రోని ఆవిష్కరించారు.
ఈ వేరబుల్ డివైజ్ వరుసగా టైటానియం, సిరామిక్ బాడీతో 46ఎమ్ఎమ్, 42ఎమ్ఎమ్ సైజు ఆప్షన్లలో వస్తుంది. హువావే వాచ్ జీటీ 5 ప్రో ఐపీ69కె సర్టిఫికేషన్, అమోల్డ్ స్క్రీన్‌ను కలిగి ఉంది. 100 కన్నా ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది. హువావే వాచ్ జీటీ 5 ప్రో సాధారణ ఉపయోగంలో గరిష్టంగా 14 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది.
హువావే వాచ్ జీటీ 5 ప్రో ధర :
హువావే వాచ్ జీటీ 5 ప్రో ధర ఈయూఆర్ 330 (దాదాపు రూ. 34వేలు) నుంచి ప్రారంభమవుతుంది. 46ఎమ్ఎమ్ వెర్షన్ బ్లాక్, టైటానియం ఎండ్‌లో వస్తుంది. అయితే, 42ఎమ్ఎమ్ వేరియంట్ సిరామిక్ వైట్, వైట్ షేడ్స్‌లో అందిస్తుంది.
హువావే వాచ్ జీటీ 5 ప్రో స్పెసిఫికేషన్‌లు :
హువావే వాచ్ జీటీ 5ప్రో 466×466 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో అమోల్డ్ డిస్‌ప్లేతో 42ఎమ్ఎమ్, 46ఎమ్ఎమ్ సైజులలో అందుబాటులో ఉంది. చిన్న వెర్షన్‌లో సిరామిక్ బాడీ ఉండగా, పెద్ద వేరియంట్‌లో టైటానియం అల్లాయ్ బాడీ ఉంది. డిస్‌ప్లేకు సప్పైర్ గ్లాస్ కోటింగ్ కూడా ఉంది. వేరబుల్ 5 ఏటీఎం-రేటెడ్ వాటర్ రెసిస్టెన్స్, అధిక ఉష్ణోగ్రతలు, ఒత్తిడిని తట్టుకునేలా ఐపీ69కె ధృవీకరణను కలిగి ఉంది.
హువావే వాచ్ జీటీ 5 ప్రోలో అందుబాటులో ఉన్న హెల్త్, ఫిట్‌నెస్ ట్రాకింగ్‌లో హృదయ స్పందన రేటు, స్లీప్ ట్రాకింగ్, ఈసీజీ యానాలసిస్ ఆప్షన్లు ఉన్నాయి. ఆన్‌బోర్డ్ సెన్సార్‌లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, బేరోమీటర్, డెప్త్ సెన్సార్, ఈసీజీ సెన్సార్, గైరోస్కోప్, మాగ్నెటోమీటర్, ఆప్టికల్ హార్ట్ రేట్ సెన్సార్, టెంపరేచర్ సెన్సార్ ఉన్నాయి. 100 కన్నా ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లను అందిస్తుంది. గోల్ఫ్ కోర్సుల మ్యాప్‌ను కూడా కలిగి ఉంది.
హువావే వాచ్ జీటీ 5ప్రో వివిధ కార్యకలాపాల సమయంలో మెరుగైన ట్రాకింగ్ కోసం కొత్త సన్‌ఫ్లవర్ పొజిషనింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. స్మార్ట్‌వాచ్ సాధారణ ఉపయోగంలో గరిష్టంగా 14 రోజుల బ్యాటరీ లైఫ్, ఎల్లప్పుడూ ఆన్ డిస్‌ప్లే ఎనేబుల్‌తో 5 రోజుల బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. హువావే హెల్త్ యాప్‌తో పెయిరింగ్ చేయవచ్చు. 46ఎమ్ఎమ్ వేరియంట్ బరువు 53 గ్రాములు కాగా, 42ఎమ్ఎమ్ వెర్షన్ 44 గ్రాముల వద్ద తేలికగా ఉంటుంది.