Devagudi : ‘దేవగుడి’ మూవీ రివ్యూ.. చాన్నాళ్లకు ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ సినిమా..
రాయలసీమలో జరిగిన ఓ రియల్ సంఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారని ప్రమోషన్స్ లో చెప్పారు మూవీ యూనిట్. (Devagudi)
Devagudi
Devagudi : అభినవ శౌర్య, నరసింహ, అనుశ్రీ, రఘు కుంచె ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన సినిమా దేవగుడి. పుష్యమి ఫిలిం మేకర్స్ బ్యానర్ పై బెల్లం సుధారెడ్డి సమర్పణలో బెల్లం రామకృష్ణా రెడ్డి దర్శక నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కింది. దేవగుడి సినిమా నేడు జనవరి 30న థియేటర్స్ లో రిలీజయింది.(Devagudi)
కథ విషయానికొస్తే..
దేవగుడిలో దేవగుడి వీరారెడ్డి (రఘు కుంచె) పెద్ద ఫ్యాక్షన్ లీడర్ కానీ ప్రజలను బాగానే చూసుకుంటాడు. వీరారెడ్డి తన డ్రైవర్ కొడుకు ధర్మ (అభినవ్ శౌర్య) తన కుమారుడితో (నరసింహ) సమానంగా ఉండడాన్ని, కలిసి తిరగాడాన్ని తట్టుకోలేడు. అంతేకాకుండా తన కూతురు శ్వేత (అనుశ్రీ) ధర్మతో ప్రేమలో ఉందనే విషయం తెలియడంతో ధర్మను ఊరు నుంచి గెంటేస్తాడు.
ఆ సంఘటన తర్వాత వీరారెడ్డి అనారోగ్యం పాలవ్వగా అతని అనుచరులు హత్యకు గురవుతారు. అదే సమయంలో శ్వేత మిస్ అవుతుంది. మరి ధర్మ ఆ సమయంలో తిరిగి వస్తాడా? శ్వేత ఏమైంది? శ్వేత – ధర్మ ఒకటయ్యారా? వీరారెడ్డి అనుచరులను చంపింది ఎవరు? వీరారెడ్డి ఏం చేశాడు.. ఇవన్నీ తెలియాలంటే తెరపై చూడాల్సిందే.
Also Read : Om Shanti Shanti Shantihi : ‘ఓం శాంతి శాంతి శాంతిః’ రివ్యూ.. మలయాళం రీమేక్ సినిమా ఎలా ఉందంటే..
సినిమా విశ్లేషణ..
గతంలో ఓ ఇరవై ఏళ్ళ క్రితం ఫ్యాక్షన్ సినిమాలు బాగా వచ్చేవి. అప్పట్లో ఆ ట్రెండ్ బాగా సక్సెస్ అయింది. ఇటీవల కాలంలో ఫ్యాక్షన్ డ్రాప్ లో వచ్చిన సినిమాలు లేవు. దీంతో దేవగుడి సినిమా ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ అని బాగానే ప్రమోట్ చేసారు. అంతే కాకుండా రాయలసీమలో జరిగిన ఓ రియల్ సంఘటన ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారని ప్రమోషన్స్ లో చెప్పారు మూవీ యూనిట్.
చిన్నప్పుడే ఫ్యాక్షన్ లీడర్ పిల్లలు, డ్రైవర్ కొడుకుతో స్నేహం చేసి పెద్దవడం, కూతురు అతన్ని ప్రేమించడం, హీరో తక్కువ కులానికి చెందిన వాడు అని ఫ్యాక్షన్ లీడర్ వద్దనడం.. ఇలాంటి కథతో గతంలో యజ్ఞంతో పాటు పలు సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా మూల కథ అదే అయినప్పటికీ కథనం, కథలో మార్పులు చేర్పులు, కొత్త క్లైమాక్స్ తో బాగానే రాసుకున్నారు.
ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చూస్తుంటే ఒకప్పటి బాలయ్య ఫ్యాక్షన్ సినిమాలు గుర్తుకు రావడం ఖాయం. అలాగే ఈ సినిమాలో కుల వ్యవస్థని, ఇంకా కొన్ని కులాలను తక్కువ చేసి చూస్తున్నారు అనే పాయింట్ ని కూడా చూపించారు. కథలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది అయితే ఊహించేయొచ్చు. క్లైమాక్స్ కొత్తగా ఊహించని విధంగా ఉంటుంది. భారీతనంతో ఒకప్పటి ఫ్యాక్షన్ సినిమాని గుర్తుచేసేలా పక్కా మాస్ కమర్షియల్ సినిమాగా దేవగుడి సినిమాని తెరకెక్కించారు. ఓటీటీ, వరల్డ్ సినిమా పుణ్యమా అని ఇప్పుడు సినిమా చాలా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో తెరకెక్కిన దేవగుడి సినిమా ఎలా మెప్పిస్తుందో చూడాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్..
హీరో అభినవ్ శౌర్య, హీరోయిన్ అనుశ్రీ, హీరోయిన్ అన్న పాత్రలో నరసింహ.. ముగ్గురు కొత్తవాళ్ళైనా బాగా నటించారు. మ్యూజిక్ డైరెక్టర్ రఘు కుంచె వీరారెడ్డి అనే ఫ్యాక్షన్ లీడర్ పాత్రలో అదరగొట్టారు. మీసాల లక్ష్మణ్, రఘుబాబు, రాకెట్ రాఘవ అక్కడక్కడా నవ్వించే ప్రయత్నం చేసారు. మిగిలిన నటీనటులు వారి పాత్రల్లో పర్వాలేదనిపించారు.
Also Read : Nari Nari Naduma Murari OTT: ఓటీటీలో నారీ నారీ నడుమ మురారి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
సాంకేతిక అంశాలు.. సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ బాగున్నాయి. పాత ఫ్యాక్షన్ కథని ఇప్పటి ట్రెండ్ కి తగ్గట్టు కొత్తగా చూపించే ప్రయత్నం చేసాడు దర్శకుడు. నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకు బాగానే ఖర్చుపెట్టినట్టు తెరపై కనిపిస్తుంది.
మొత్తంగా ‘దేవగుడి’ ప్రేమ, కులం అంశాలతో ఫ్యాక్షన్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా. ఈ సినిమాకు 2.5 రేటింగ్ ఇవ్వొచ్చు.
గమనిక : ఈ సినిమా రివ్యూ & రేటింగ్ కేవలం విశ్లేషకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే.
