Flipkart Smart TV Sale : కొత్త టీవీ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్‌టీవీపై భారీ డిస్కౌంట్.. పూర్తి ఆఫర్ వివరాలివే!

Flipkart Smart TV Sale : ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 20 నుంచే ప్రారంభమైంది. సాధారణ యూజర్లకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది.

Flipkart Smart TV Sale : కొత్త టీవీ కొంటున్నారా? ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో స్మార్ట్‌టీవీపై భారీ డిస్కౌంట్.. పూర్తి ఆఫర్ వివరాలివే!

Huge discount available on Smart TVs

Updated On : October 20, 2024 / 10:56 PM IST

Flipkart Smart TV Sale : ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దీపావళి సేల్ మొదలైంది. దీపావళికి ముందే ఈ సేల్ ప్రారంభమై 12 రోజుల పాటు కొనసాగుతుంది. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్‌లకు ఈ సేల్‌కు 24 గంటల ముందుగానే యాక్సస్ చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 20 నుంచే ప్రారంభమైంది. సాధారణ యూజర్లకు ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 21 నుంచి ప్రారంభమవుతుంది. ఫ్లిప్‌కార్ట్ ఈ సేల్‌లో స్మార్ట్‌టీవీపై భారీ డిస్కౌంట్ పొందవచ్చు.

కోడాక్ క్యూఎల్ఈడీ టీవీ :
కోడాక్ నుంచి ఈ స్మార్ట్ టీవీ 32, 43, 50, 55, 65 అంగుళాలలో వస్తుంది. ఈ స్మార్ట్‌టీవీ ప్రారంభ ధర రూ. 11,499 ఉండగా, 65 అంగుళాల టీవీ ధర రూ. 89,999కు పొందవచ్చు. కోడాక్ స్మార్ట్ టీవీ మీకు డీటీఎస్ సౌండ్ క్వాలిటీ, 4కె క్యూఎల్ఈడీ డిస్‌ప్లే, డాల్బీ అటానమస్, డాల్బీ విజన్, 2జీబీ ర్యామ్, 16జీబీ ర్యామ్ అందిస్తోంది.

కోడాక్ సీఏ పీఆర్ఓ సిరీస్ :
కోడాక్ ఈ స్మార్ట్‌టీవీ సిరీస్‌లో గూగుల్ టీవీ ఇంటర్‌ఫేస్, 4కె హెచ్‌డీఆర్10 డిస్‌ప్లే, డాల్బీ డిజిటల్ ప్లస్, డీటీఎస్ ట్రూ సరౌండ్, యూఎస్‌బీ 2.0, హెచ్‌డీఎంఐ 3, బ్లూటూత్ వి.5.0 వంటి ఫీచర్లు ఉంటాయి. కోడాక్ సీఏ పీఆర్ఓ సిరీస్ ప్రారంభ ధర రూ. 26,999 నుంచి అందుబాటులో ఉంది.

కోడాక్ 9ఎక్స్‌పీఆర్ఓ సిరీస్ :
ఈ స్మార్ట్ టీవీ సిరీస్ అత్యంత ప్రీమియం. ఇందులో కోడాక్ ఆండ్రాయిడ్ 11 ఓఎస్‌ని అందించింది. ఇది కాకుండా, ఈ సిరీస్ స్మార్ట్‌టీవీ 30డబ్ల్యూ స్పీకర్లను కలిగి ఉంది. నెట్‌ఫ్లిక్స్, గూగుల్ అసిస్టెంట్, క్రోమ్‌కాస్ట్, బ్లూటూత్ 5.0, 1జీబీ ర్యామ్, 8జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. ఇది కాకుండా, ఈ కోడెక్ సిరీస్‌లో 10 వేలకు పైగా యాప్‌లు, గేమ్‌లు అందుబాటులో ఉన్నాయి.

కోడాక్ 9ఎక్స్‌పీఆర్ఓ సిరీస్‌లో మీరు ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ను యాక్సెస్ చేయవచ్చు. మీరు నెట్‌ఫ్లిక్స్, డిస్నీ హాట్‌స్టార్, ఆపిల్ టీవీ, వోట్, జీ5, సోనీ లైవ్, గూగుల్ ప్లే స్టోర్‌లను ఉపయోగించవచ్చు. కోడాక్ నుంచి ఈ స్మార్ట్ టీవీ ప్రారంభ ధర రూ.10,499 ఉంటుంది.

కోడాక్ స్మార్ట్ టీవీపై డిస్కౌంట్ :
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్‌లో కొడాక్ స్మార్ట్ టీవీలపై విభిన్న డిస్కౌంట్లను పొందవచ్చు. మీరు ఫ్లిప్‌కార్ట్‌లో ఐసీఐసీఐ, యెస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా కార్డ్‌లపై 10 శాతం స్పెషల్ డిస్కౌంట్ పొందవచ్చు. అదే విధంగా మీరు అమెజాన్‌లో ఎస్బీఐ కార్డ్‌పై డిస్కౌంట్ పొందవచ్చు.

Read Also : NEET PG 2024 Counselling : నీట్ పీజీ 2024 కౌన్సెలింగ్ షెడ్యూల్ త్వరలో విడుదల.. పూర్తి వివరాలివే!