India 6G Technology : 5G కన్నా ముందే 6G వచ్చేస్తోంది.. ఇండియాకు ఎప్పుడో తెలిసిందోచ్!
6G టెక్నాలజీ వచ్చేస్తోంది. మీరు విన్నది నిజమే.. ఇండియాకు 6G రాబోతోంది. అది ఎప్పుడో కేంద్రమంత్రి చెప్పేశారు.. ఇంకా ఇండియాకు 5G టెక్నాలజీనే రాలేదు. ముందే 6G టెక్నాలజీ వస్తోంది.

India Will Deploy 6g Technology By 2024, Says Communication Minister Ashwini Vaishnaw
India 6G technology : 6G టెక్నాలజీ వచ్చేస్తోంది. మీరు విన్నది నిజమే.. ఇండియాకు 6G రాబోతోంది. అది ఎప్పుడో కేంద్రమంత్రి చెప్పేశారు.. ఇంకా ఇండియాకు 5G టెక్నాలజీనే రాలేదు. దానికంటే ముందే 6G టెక్నాలజీ వస్తోందట.. దీనిపై చర్చలు జరుగుతున్నాయట.. వెబ్‌నార్ కు హాజరైన కేంద్ర సమాచార సాంకేతిక శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ 6G రాబోతందంటూ వ్యాఖ్యానించారు. త్వరలోనే ఇండియాకు 6G వస్తోందన్నారు. అది కూడా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన 6G టెక్నాలజీ అందుబాటులోకి రానున్నట్టు వెల్లడించారు.
ఇప్పటికే 6G టెక్నాలజీకి సంబంధించి డెవలప్ మెంట్స్ మొదలయ్యాయట.. ఇండియాలో లభించే డివైజ్ లతోనే ఈ టెక్నాలజీ రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు ఆయన చెప్పుకొచ్చారు. అంతేకాదు.. అంతర్జాతీయ ప్రమాణాలకు ఏమాత్రం తీసిపోనంతగా డెవలప్ చేస్తున్నామని మంత్రి అశ్వినీ పేర్కొన్నారు. 2023 చివరిలో లేదా 2024 ఏడాది ప్రారంభంలో స్వదేశీ 6G సిస్టమ్ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉందన్నారు. వచ్చే ఏడాదిలోనే 5G టెక్నాలజీ కూడా లాంచ్ చేయనున్నారట.
వచ్చే ఏడాది రెండో త్రైమాసికంలో.. మార్చి తర్వాత 5G టెక్నాలజీ వచ్చే అవకాశం ఉందన్నారు. 5G స్పెక్ట్రమ్ వేలం గురించి కూడా అశ్వినీ వైష్ణవ్ ప్రస్తావించారు. ఇప్పటికే ట్రాయ్ (TRAI) పలు కంపెనీలతో సంప్రదింపులు జరిపినట్టు ఆయన తెలిపారు. ఈ చర్చలు వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి నాటికి ముగిసే అవకాశం ఉందని తెలిపారు. 2022 రెండో త్రైమాసికంలోనే ఈ ప్రక్రియ ప్రారంభం కానున్నట్టు వెల్లడించారు.