Instagram Feature : ఇన్‌స్టాలో కొత్త ఫీచర్.. స్టోరీస్‌లో టెక్స్ట్ ఆటో ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు!
ఫేస్ బుక్ సొంత ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్ వస్తోంది. ఇన్‌స్టా స్టోరీస్‌లో ఈ కొత్త ఆప్షన్ యూజర్ల కోసం అందిస్తోంది. స్టోరీస్‌లో టెక్స్ట్ ఆటోమాటిక్‌గా ట్రాన్స్ లేట్ అయిపోతుంది.

Instagram, Translate Text In Stories, Translate Text In Story Posts,
Instagram translate text in stories : ఫేస్ బుక్ సొంత ఫోటో షేరింగ్ యాప్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త ఫీచర్ వస్తోంది. ఇన్‌స్టా స్టోరీస్‌లో ఈ కొత్త ఆప్షన్ యూజర్ల కోసం అందిస్తోంది. స్టోరీస్‌లో టెక్స్ట్ ఆటోమాటిక్‌గా ట్రాన్స్ లేట్ అయిపోతుంది. మీ పోస్టు ఏదైనా ఫారెన్ లాంగ్వేజీలో ఉంటే.. టాప్ లెఫ్ట్ కార్నర్ స్ర్కీన్ లో మీకు See Translation అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ బటన్ పై క్లిక్ చేస్తే చాలు.. మీకు నచ్చిన భాషలోకి ట్రాన్స్ లేట్ చేసుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ ప్రపంచవ్యాప్తంగా ఇన్ స్టా యూజర్లకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ 90 లాంగ్వేజీల్లో సపోర్ట్ చేస్తుంది.
అంతర్జాతీయంగా ఇన్ స్టా యూజర్లను ఆకట్టుకునేందుకు ఫేస్ బుక్ ఈ కొత్త ఫీచర్ తీసుకొస్తోంది. 2016లో ఇన్ స్టాగ్రామ్ లో ఆటోమాటిక్ ట్రాన్స్ లేషన్స్ కామెంట్లు, క్యాప్షన్ల కోసం తీసుకొచ్చింది. కానీ, స్టోరీస్ లాంచ్ చేసిన తర్వాత ఈ ఫీచర్ అందులో యాడ్ చేయడంలో ఫెయిల్ అయింది. అయినప్పటికీ ఈ కొత్త ఫీచర్ ద్వారా టెక్స్ట్ ట్రాన్స్ లేట్ చేసుకోవచ్చు.
ప్రస్తుతం ఆడియో ట్రాన్స్ లేషన్ మాత్రం అందుబాటులో లేదు. భారత ఇన్ స్టా యూజర్ల కోసం Fedd Posts, Reels ట్యాబ్ లో Collab పేరుతో ఫీచర్ టెస్టింగ్ చేస్తున్నట్టు కంపెనీ ఇటీవలే ప్రకటించింది. ఈ Collab ద్వారా Feed Postలోకి ఫాలోవర్లను ఇన్వైట్ చేసుకోవచ్చు. మీ కంటెంట్ ను వారికి షేర్ కూడా చేయొచ్చు.