iPad A13 Bionic Chipset : A13 బయోనిక్ చిప్‌సెట్‌తో ఆపిల్ ఐప్యాడ్ వచ్చేసింది.. క్రోమాలో డీల్ ఎంతంటే?
iPad A13 Bionic Chipset : మీరు టాబ్లెట్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఆండ్రాయిడ్ మీ ఫస్ట్ ఆప్షన్ కాదనకుంటే.. మీ బడ్జెట్ Apple iPad రూ. 30వేల కన్నా ఎక్కువ లేదంటే.. మీరు ఐప్యాడ్‌ని అసలు ధర రూ. 27వేల కన్నా తక్కువకు పొందవచ్చు.

iPad with A13 Bionic chipset now available for Rs 25,990 on Croma, here is how the deal works
iPad A13 Bionic Chipset : మీరు టాబ్లెట్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? ఆండ్రాయిడ్ మీ ఫస్ట్ ఆప్షన్ కాదనకుంటే.. మీ బడ్జెట్ Apple iPad రూ. 30వేల కన్నా ఎక్కువ లేదంటే.. మీరు ఐప్యాడ్‌ని అసలు ధర రూ. 27వేల కన్నా తక్కువకు పొందవచ్చు. ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ రిటైల్ ప్లాట్‌ఫారమ్ క్రోమా (Croma) ఐప్యాడ్ 9వ జనరేషన్ రూ.25,990కి విక్రయిస్తోంది. ప్రస్తుతం.. క్రోమా ఐప్యాడ్‌పై ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ కంటే మెరుగైన అద్భుతమైన ఆఫర్ అందిస్తోంది. ఈ-కామర్స్ దిగ్గజాలు సెప్టెంబర్ 23న ఫెస్టివల్ సేల్ నిర్వహించనున్నాయి. ఐఫోన్ 13, ఐఫోన్ 12, ఐఫోన్ 11తో సహా పాత ఐఫోన్‌లపై ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్లను అందజేస్తుందని భావిస్తున్నారు.

iPad with A13 Bionic chipset now available for Rs 25,990 on Croma
ఐప్యాడ్ ఎయిర్‌లో డీల్ ఎలా ఉందంటే? :
ఐప్యాడ్ ఎయిర్ 9వ జనరేషన్ క్రోమాలో రూ. 27,990కి లిస్టు అయింది. మీరు HDFC కార్డ్ ఉంటే.. ఐప్యాడ్ 9వ జనరేషన్‌పై రూ. 2వేల ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. ధర రూ. 25,990కి తగ్గింది. ఆఫర్ ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ స్టోర్‌లలో పేమెంట్ అవుతుంది. ఐప్యాడ్‌లో ఇదే అత్యుత్తమ డీల్ ఇది. అమెజాన్‌లో డివైజ్ రూ. 27,890 వద్ద లిస్టు అయింది. ఐప్యాడ్ ఎయిర్ ధరపై క్లారిటీ లేదు.
ఆపిల్ ఫార్ అవుట్ ఈవెంట్ సందర్భంగా.. ఎంట్రీ-లెవల్ ఐప్యాడ్ 10వ జనరేషన్ లాంచ్ చేయనుంది. కానీ, ఐఫోన్ 14 సిరీస్, ఆపిల్ వాచ్ 8 సిరీస్ మాత్రమే అధికారికంగా వెల్లడించింది. కుపెర్టినో-దిగ్గజం గతంలో 2021లో ఐప్యాడ్‌ని రిలీజ్ చేసింది. Apple కీనోట్‌లో అత్యధికంగా అమ్ముడవుతున్న Chromebook కన్నా 3x వేగవంతమైనదని, అమ్ముడవుతున్న Android టాబ్లెట్ కన్నా అత్యధికంగా 6x వరకు స్పీడ్ అందిస్తుందని పేర్కొంది.

iPad with A13 Bionic chipset now available for Rs 25,990 on Croma
ఐప్యాడ్ ఎయిర్ 10.20 అంగుళాల డిస్‌ప్లేను కలిగి ఉంది. A13 బయోనిక్ చిప్‌తో వస్తోంది. మునుపటి జనరేషన్ కంటే 20 శాతం పర్ఫార్మెన్స్ పెంచనుంది. ఐప్యాడ్ సెంటర్ స్టేజ్‌తో 12-MP అల్ట్రా వైడ్ కెమెరాను కలిగి ఉంది. 8MP వెనుక కెమెరా ఉంది. ఇంటి నుంచి పని చేస్తున్నప్పుడు లేదా ఇంటి నుంచి క్లాసులను హాజరవుతున్నప్పుడు 12-MP కెమెరాతో పనిచేస్తుంది. ఐప్యాడ్ స్మార్ట్ కీబోర్డ్‌తో పాటు ఆపిల్ పెన్సిల్ ఫస్ట్ జనరేషన్ అనుకూలంగా ఉంటుంది. ఈ డివైజ్ స్పేస్ గ్రే, సిల్వర్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.