Flipkart Year End Sale : ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్.. ఐఫోన్ 13పై అదిరే డిస్కౌంట్.. ఇదే సరైన సమయం.. డోంట్ మిస్..!
Flipkart Year End Sale : మీరు కొత్త ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నారా? ఆపిల్ iPhone 13ని ఇప్పుడే కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే.. సరసమైన ధరకే టాప్-ఎండ్ ఫీచర్లతో అందుబాటులో ఉంది.

iPhone 13 available for around Rs 40,000 on Flipkart Year End sale. Conditions apply
Flipkart Year End Sale : మీరు కొత్త ఐఫోన్‌కు అప్‌గ్రేడ్ చేయాలనుకుంటున్నారా? ఆపిల్ iPhone 13ని ఇప్పుడే కొనుగోలు చేయొచ్చు. ఎందుకంటే.. సరసమైన ధరకే టాప్-ఎండ్ ఫీచర్లతో అందుబాటులో ఉంది. మీరు ఐఫోన్ 13ని కొనుగోలు చేయాలని చాలా కాలంగా ప్లాన్ చేస్తుంటే.. ఇదే సరైన సమయం. ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ ఇయర్ ఎండ్ సేల్ (Flipkart Year End Sale) ద్వారా ఈ ఐఫోన్ 13 కొనుగోలు చేయవచ్చు. మీరు iPhone 13 ఫోన్ 128GB మోడల్‌ను దాదాపు రూ. 40వేలకి పొందవచ్చు. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13ని రూ.61,999కి విక్రయిస్తోంది.
ఐఫోన్ మోడల్ అధికారిక ధర కన్నా దాదాపు రూ. 8వేలకు తగ్గింది. భారత మార్కెట్లో iPhone 13 (128GB స్టోరేజ్) మోడల్ ధర అధికారికంగా రూ.69,900 నుంచి ప్రారంభమవుతుంది. మరో రెండు ఇతర మోడల్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి. 256GB మోడల్ రూ. 79,900 అయితే, 512GB స్టోరేజ్ మోడల్ రూ. 99,900గా ఉండనుంది. ఈ రెండు మోడల్‌లు కూడా ఫ్లిప్‌కార్ట్ సేల్ సమయంలో తక్కువ ధరలో అందుబాటులో ఉన్నాయి. మీరు ఐఫోన్ 13ని సుమారు రూ. 40వేలకి ఎలా పొందవచ్చు ఈ డీల్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ చేస్తున్న ఎక్స్ఛేంజ్ ఆఫర్‌తో సహా అందుబాటులో ఉంది.
మీరు ప్రస్తుతం పాత iPhone మోడల్‌లను ఉపయోగిస్తుంటే.. iPhone 11 లేదా iPhone XR కొనుగోలు చేయొచ్చు. ఫ్లిప్‌కార్ట్ (Flipkart) రూ. 21,900 వరకు ఆఫర్ చేస్తుంది. కానీ, మార్పిడి విలువ పాత ఫోన్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుందని గమనించాలి. మీ ఫోన్ స్క్రీన్‌లో పగుళ్లు ఉన్నట్లయితే ఎక్స్ఛేంజ్ వాల్యూ తగ్గిపోతుందని గమనించాలి.

iPhone 13 available for around Rs 40,000 on Flipkart Year End sale
ఎక్స్ఛేంజ్ ఆఫర్ ఎలా పని చేస్తుందంటే? :
మీరు కార్ట్‌కు iPhone 13ని యాడ్ చేయాలి. ఆపై ఎక్స్‌ఛేంజ్ ఆప్షన్ కోసం చెక్ చేయాలి. ఆపై మీరు మోడల్ పేరును యాడ్ చేయాలి. ఉదాహరణకు, మీరు iPhone 11ని పొందేందుకు ఎక్స్ఛేంజ్ చేయాలనుకుంటున్న మోడల్‌గా యాడ్ చేస్తే.. పేరు, IMEI నంబర్, కొన్ని ఇతర వివరాలను యాడ్ చేయండి. చివరికి, ఎక్స్ఛేంజ్ వాల్యూ పొందవచ్చు. iPhone 11 కోసం Flipkart Exchange వాల్యూ రూ. 15వేలుగా చూపిస్తుంది. మీరు మొత్తం రూ. 15,000 మొత్తాన్ని పొందలేరని గుర్తుంచుకోవాలి.
ఎందుకంటే.. ఏదైనా డ్యామేజ్ జరిగిందో చెక్ చేసిన తర్వాత మాత్రమే వాల్యూ తెలుస్తుంది. ఫోన్ డ్యామేజ్ ఉంటే ఎక్స్ఛేంజ్ వాల్యూ తగ్గుతుంది. మీ పాత iPhone మోడల్ నుంచి అప్‌గ్రేడ్ చేయాలనుకుంటే iPhone 13ని పొందడం పూర్తిగా అర్థవంతంగా ఉంటుంది. దీనికి కారణం iPhone 13, iPhone 14 మధ్య చాలా తేడా లేదని గమనించాలి. రెండు ఫోన్‌లు ఒకే చిప్‌సెట్‌తో వస్తాయి. ఒకే సెట్ కెమెరాలను అందిస్తాయి. డిజైన్, డిస్ప్లేతో పాటు బ్యాటరీ పర్ఫార్మెన్స్ పొందవచ్చు. ఐఫోన్ 14 ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.79,900 ధరతో అందుబాటులో ఉంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..