iPhone 13 Price : రక్షా బంధన్‌కు అదిరిపోయే గిఫ్ట్.. అక్కచెల్లెమ్మల కోసం ఐఫోన్ 13 అతి తక్కువ ధరకే.. ఇప్పుడే కొనివ్వండి..!

iPhone 13 Price : ప్రస్తుతం ఐఫోన్ 13 అతి తక్కువ ధరకే లభ్యమవుతోంది. రక్షా బంధన్ సందర్భంగా ఈ స్మార్ట్‌ఫోన్ భారీ తగ్గింపు ధరకే అందుబాటులో ఉంది.

iPhone 13 Price : రక్షా బంధన్‌కు అదిరిపోయే గిఫ్ట్.. అక్కచెల్లెమ్మల కోసం ఐఫోన్ 13 అతి తక్కువ ధరకే.. ఇప్పుడే కొనివ్వండి..!

iPhone 13 Price

Updated On : August 9, 2025 / 3:36 PM IST

iPhone 13 Price : రక్షా బంధన్ సందర్భంగా మీ అక్కాచెల్లమ్మలకు ఏదైనా మంచి గిఫ్ట్ ఇద్దామని అనుకుంటున్నారా? అయితే, మీకోసం అద్భుతమైన ఆఫర్.. రాఖీ పండుగ (iPhone 13 Price) కానుకగా మీ సోదరికి కొత్త ఆపిల్ ఐఫోన్ గిఫ్ట్ ఇవ్వొచ్చు. ప్రస్తుతం అమెజాన్ గ్రేట్ ఫ్రీడమ్ సేల్ సమయంలో మీరు ఐఫోన్ 13 అతి చౌకైన ధరకే కొనుగోలు చేయవచ్చు.

ఈ 5G ఐఫోన్ అసలు లాంచ్ ధరలో దాదాపు సగం ధరకు అందుబాటులో ఉంది. మరెన్నో బ్యాంక్ డిస్కౌంట్లతో అదనపు ఆఫర్లను అందిస్తోంది. ఈ సేల్ జూలై 31న ఇ-కామర్స్ వెబ్‌సైట్‌లో ప్రారంభమైంది. 2021లో లాంచ్ అయిన ఐఫోన్ 13 మోడల్ A15 బయోనిక్ చిప్, పవర్‌ఫుల్ కెమెరాను కలిగి ఉంది. ఇంతకీ, ఈ డీల్ ఎలా సొంతం చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం..

ఐఫోన్ 13 ఆఫర్లు :
ఐఫోన్ 13 మోడల్ మొత్తం 3 స్టోరేజ్ వేరియంట్ల (128GB, 256GB, 512GB)లో లభిస్తుంది. అసలు ధర రూ.79,900 నుంచి తగ్గిన ఈ ఐఫోన్ అమెజాన్‌లో రూ.43,900కి లిస్ట్ అయింది. ఫ్లిప్‌కార్ట్‌లో రూ.44,999 నుంచి ప్రారంభమవుతుంది. అమెజాన్‌లో రూ.1,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు.

అసలు ధర రూ.42,900 నుంచి రూ.37,000 ధర తగ్గింపు పొందింది. ఇంకా, అమెజాన్ సేల్ సమయంలో ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. పాత ఫోన్‌ ట్రేడింగ్ ద్వారా అదనంగా రూ.36,400 సేవ్ చేసుకోవచ్చు. మీ పాత ఫోన్‌లో కేవలం రూ.10వేలు సేవ్ చేయడం ద్వారా ఐఫోన్ 13ని రూ.32,900 కన్నా తక్కువ ధరకే పొందవచ్చు.

Read Also : Happy Rakshabandhan 2025 : రక్షా‌బంధన్ కోసం ChatGPTతో బెస్ట్ AI రాఖీ ఇమేజ్‌లు క్రియేట్ చేయాలా? ఈ సింపుల్ ప్రాంప్ట్స్ ట్రై చేయండి..!

ఐఫోన్ 13 ఫీచర్లు వివరాలివే :
ఐఫోన్ 13 ట్రేడేషనల్ నాచ్ డిజైన్‌తో 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. బ్యాక్ సైడ్ రెండు 12MP లెన్స్‌లతో డ్యూయల్-కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో వస్తుంది. ఈ ఐఫోన్ A15 బయోనిక్ చిప్ ద్వారా పవర్ పొందుతుంది. 6GB ర్యామ్, మొదట iOS 15 ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తుంది. లేటెస్ట్ iOS 18కి అప్‌గ్రేడ్ చేయవచ్చు.

ఐఫోన్ 13 స్పెషిఫికేషన్లు :
డిస్‌ప్లే : 6.1-అంగుళాల రెటినా డిస్‌ప్లే
ప్రాసెసర్ : A15 బయోనిక్
కెమెరా : 12MP + 12MP, 12MP
స్టోరేజీ : 128 GB/256GB/512GB
ఆపరేటింగ్ సిస్టమ్ : iOS15 (iOS 15) ఆపరేటింగ్ సిస్టమ్