Apple iPhone 14 Discount : ఆపిల్ ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లు.. విజయ్ సేల్స్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ ఆఫర్లు ఇవే.. ఏ డీల్ బెటర్ అంటే?
Apple iPhone 14 Discount : కొత్త ఐఫోన్ కొనేందుకు చూస్తున్నారా? విజయ్ సేల్స్, ఫ్లిప్‌కార్ట్, అమెజాన్, క్రోమ్ ప్లాట్ ఫారంల్లో ఐఫోన్ 14పై భారీ డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నాయి. మీకు నచ్చిన డీల్ ఇప్పుడే సొంతం చేసుకోండి.
Apple iPhone 14 Discount : ప్రపంచ ఐకానిక్ దిగ్గజం ఆపిల్ (Apple) త్వరలో సొంత బ్రాండ్ నుంచి ఆపిల్ ఐఫోన్ 15 (Apple iPhone 15)ను ఆవిష్కరించనుంది. అయితే, ఐఫోన్ లాంచ్‌కు ముందు లేటెస్ట్ మోడల్ ఐఫోన్ 14పై అదిరే డిస్కౌంట్లను ఆఫర్ చేస్తోంది. అధికారికంగా, ఆపిల్ iPhone 14 బేస్ 128GB స్టోరేజ్ మోడల్ ధర రూ.79,900తో ప్రారంభమవుతుంది.
మీరు ప్రస్తుతం iPhone 14ని కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తుంటే.. థర్డ్-పార్టీ ప్లాట్‌ఫారమ్‌లలో ఏదైనా ప్లాట్ఫారంలోకి వెళ్లడం మంచిది. ప్రస్తుతం.. ఫ్లిప్‌కార్ట్ (Flipkart), అమెజాన్ (Amazon) సహా వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో ఐఫోన్ 14 మోడల్‌పై భారీ తగ్గింపుతో లభిస్తుంది. మీరు iPhone 14ని ఎక్కడ నుంచి కొనుగోలు చేస్తే బెటర్ అని ఆలోచిస్తున్నారా? అయితే మీకోసం బెస్ట్ డీల్ అందించేది ఎక్కడ అనేది ఇప్పుడు చూద్దాం..
విజయ్ సేల్స్‌లో iPhone 14పై తగ్గింపు :
ఐఫోన్ 14 విజయ్ సేల్స్‌పై భారీ తగ్గింపుతో అందిస్తుంది. ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ. 70999 వద్ద విక్రయిస్తోంది. అదనపు తగ్గింపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. HDFC బ్యాంక్ కస్టమర్లు రూ. 4000 ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. దీని ధర రూ. 66999కి తగ్గుతుంది. అదనంగా, ఇతర బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
అమెజాన్‌లో iPhone 14పై డిస్కౌంట్ :
అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లో ఐఫోన్ 14పై తగ్గింపుతో అందిస్తోంది. ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ. 71999 వద్ద విక్రయిస్తోంది. అదనపు తగ్గింపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. HDFC బ్యాంక్ కస్టమర్లు రూ. 4000 ఫ్లాట్ డిస్కౌంట్ పొందవచ్చు. దీని ధర రూ. 67999కి తగ్గుతుంది. అదనంగా, ఇతర బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే, HDFC ఆఫర్ అన్నింటిలో బెస్ట్ ఆఫర్ అని చెప్పవచ్చు.
Flipkartలో iPhone 14పై భారీ తగ్గింపు :
ఐఫోన్ 14 ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అందిస్తుంది. ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ. 69999 (రెడ్ కలర్ మాత్రమే) అందిస్తుంది. అదనపు తగ్గింపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. HDFC బ్యాంక్ కస్టమర్లు రూ. 4000 ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. దీని ధర రూ. 65999కి తగ్గుతుంది. అదనంగా, ఇతర బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. HDFC ఆఫర్ అన్నింటిలో బెస్ట్ అని చెప్పవచ్చు.
క్రోమాలో iPhone 14పై తగ్గింపు :
క్రోమాలో ఐఫోన్ 14పై భారీ తగ్గింపుతో లభిస్తుంది. ఐఫోన్ 14 ప్రారంభ ధర రూ. 71999 వద్ద విక్రయిస్తోంది. అదనపు తగ్గింపు ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. HDFC బ్యాంక్ కస్టమర్లు రూ. 4000 ఫ్లాట్ తగ్గింపును పొందవచ్చు. దీని ధర రూ.67999కి తగ్గుతుంది. అన్ని ఆఫర్లను పరిశీలిస్తే.. (Flipkart)లో ఆపిల్ iPhone 14లో బెస్ట్ ఆఫర్‌ను అందిస్తోంది. అంతేకాకుండా, మీరు మీ పాత ఫోన్‌ని ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా iPhone 14ని చాలా తక్కువ ధరకు పొందవచ్చు.
Read Also : WhatsApp Voice Transcript : వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్ ఫీచర్ వచ్చేసింది.. ఆ యూజర్లకు మాత్రమేనట..!