iPhone 14 Pro Max : ఐఫోన్ 14 ప్రో మాక్స్ బ్యాటరీ పేలుడు.. మహిళకు తీవ్ర గాయాలు.. ఆపిల్ ఏమన్నదంటే?
iPhone 14 Pro Max : ఐఫోన్ 14 ప్రో మాక్స్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు పేలిందని, ఆ సమయంలోనే ఫోన్ మంటలు చెలరేగి తీవ్ర గాయాలు అయ్యాయని నివేదిక పేర్కొంది.

iPhone 14 Pro Max Battery Explosion Leaves Woma
iPhone 14 Pro Max : అత్యంత ఖరీదైన ఆపిల్ ఐఫోన్ పేలిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ ఛార్జింగ్ పెట్టిన సమయంలో పేలిపోవడంతో బాధితురాలు తీవ్రంగా గాయపడ్డారు. చైనాలోని షాంగ్సీకి చెందిన మహిళ ఐఫోన్ పేలుడు జరిగిందని చైనాలోని నివేదికలు పేర్కొన్నాయి. ఆమె చేతులు, బ్యాక్ సైడ్ కూడా తీవ్రమైన గాయాలు అయ్యాయని తెలిపాయి.
ఈ సంఘటన ఉదయం 6:30 గంటలకు జరిగిందని టీవీ ఛానెల్ హుయ్ బ్యాంగ్ బ్యాంగ్ నివేదికలో పేర్కొంది. ఐఫోన్ పేలుడు తాకిడికి ఆమె బెడ్ పక్కన ఉన్న వస్తువులు కాలిపోవడంతో ఒక్కసారిగా నిద్ర లేచింది. పేలుడు ధాటికి గది గోడ కూడా దెబ్బతిందని నివేదిక తెలిపింది. గాయపడిన బాధిత మహిళ ఆస్పత్రికి చేరి చికిత్స తీసుకుంటోంది.
పేలిన ఐఫోన్ 14 ప్రో మాక్స్.. కారణమేమిటి? :
ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు స్మార్ట్‌ఫోన్‌లను ఉపయోగించడంపై తరచూ యూజర్లను హెచ్చరిస్తూ ఉంటాం. ముఖ్యంగా రాత్రిపూట చాలా జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. ఈ బాధిత మహిళ అదే కారణాల వల్ల ప్రభావితమైనట్లు కనిపిస్తోంది. బాధితురాలు ఐఫోన్ 14 ప్రో మాక్స్ ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు నిద్రలో పేలిందని, ఆ సమయంలోనే ఫోన్ మంటలు చెలరేగి తీవ్ర గాయాలు అయ్యాయని నివేదిక పేర్కొంది. పేలుడుకు గల కారణాన్ని తెలుసుకోవడానికి ఆపిల్ బృందం ఈ సంఘటనపై తదుపరి దర్యాప్తును ప్రారంభించింది. బాధితురాలు కంపెనీ తనకు జరిగిన నష్టాన్ని పరిష్కరిస్తుంది. తమ ప్రొడక్టు వల్ల కలిగే నష్టాన్ని చెల్లిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది.
బ్యాటరీ పేలుడుపై ఆపిల్ రియాక్షన్ :
ఐఫోన్ డివైజ్ బ్యాటరీ వారంటీ ముగిసినప్పటికీ, ఇలాంటి సంఘటనలు పూర్తిగా పరిష్కరించనున్నట్టు ఆపిల్ యూజర్లకు హామీ ఇచ్చింది. పేలుడు వల్ల ప్రభావితమైన ఐఫోన్ 14ప్రో మ్యాక్స్మోడల్ 2022 మోడల్.. బాధితురాలు ఈ డివైజ్ చెక్ చేయవలసి ఉంటుంది. తద్వారా ఆమె ముందుగానే ఇబ్బందులను నివారించవచ్చు. ఏదైనా ఇతర ఐఫోన్ యూజర్లు ఈ సమస్యలను ఎదుర్కొంటే.. సర్వీస్ సెంటర్‌కు వెళ్లి వెంటనే పరిశీలించాలని కంపెనీ సూచించింది.
సురక్షితమైన ఐఫోన్ ఛార్జింగ్ టిప్స్ :
ఐఫోన్లను సరైన పద్ధతిలో ఛార్జింగ్ చేయాలి. అది యూజర్లకు ఏకైక మార్గం. అత్యవసరమైతే తప్ప ఛార్జింగ్‌లో ఉన్నప్పుడు ఫోన్‌ని ఎప్పుడూ ఉపయోగించవద్దు. బ్యాటరీ మరింత వేడెక్కకుండా ఉండేందుకు ఫోన్‌ను రోజుకు ఒకసారి ఛార్జ్ చేసుకోవాలి. పవర్ అవుట్‌పుట్ అనుమతించే పరిమితులను మించకుండా ఉండేలా ఎల్లప్పుడూ ఒరిజినల్ ఛార్జర్‌లను ఉపయోగించండి.