iPhone 15 Gift Scam : ఇలా చేశారంటే.. రూ. 79వేల విలువైన కొత్త ఐఫోన్ 15 గిఫ్ట్‌గా పొందవచ్చు.. టెంప్ట్ అయ్యారంటే.. అంతే..!
iPhone 15 Gift Scam : కొత్త ఆపిల్ ఐఫోన్ (iPhone 15 Series) కొనేందుకు చూస్తున్నారా? ఇండియా పోస్టు పేరుతో కొత్త ఐఫోన్ 15 గిఫ్ట్ అంటూ స్కామర్లు వైరల్ చేస్తున్నారు.

iPhone 15 Gift Scam Warning_ Scammers Posing As India Post To Offer You New Phones
iPhone 15 Gift Scam : కొత్త ఆపిల్ ఐఫోన్ కొనుగోలు చేసేవారికి అదిరే ఆఫర్.. సరికొత్త (iPhone 15) పైసా ఖర్చు లేకుండా గిఫ్ట్‌గా పొందవచ్చు. ఈ కొత్త ఆఫర్ పొందడానికి ఇదే సరైన అవకాశం. ఇండియా పోస్టు నుంచి ఇలాంటి ఆఫర్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇందులో నిజమెంత? ఐఫోన్ 15 గిఫ్ట్ స్కామ్ సంబంధించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం. ఇండియా పోస్ట్ నుంచి (iPhone 15 Series)ని బహుమతిగా పొందవచ్చు అని లింక్ షేర్ అవుతోంది.
ఇదంతా సైబర్ నేరగాళ్ల పని అనే విషయం తెలియక చాలామంది ఐఫోన్ 15 గిఫ్ట్.. అనగానే టెంప్ట్ అవుతున్నారు. ఇది నిజమే అనుకుని ఆన్‌లైన్‌లో స్నేహితులతో ఈ లింక్‌ను షేర్ చేస్తున్నారు. ఎందుకంటే.. ట్విట్టర్ (X) ఇండియా పోస్ట్ చేసిన అధికారిక పోస్ట్ ప్రకారం.. సైబర్ నేరగాళ్లు స్కామ్ పేజీని 5 గ్రూపులుగా లేదా 20 మంది స్నేహితులతో షేర్ చేయమని అడుగుతున్నారు. తద్వారా యూజర్లను స్కామ్ చేసేందుకు ఇండియాపోస్ట్ పేరును ఉపయోగిస్తున్నారు.

iPhone 15 Gift Scam Warning
ఇదో పెద్ద స్కామ్.. క్లిక్ చేశారంటే ఖతమే :
ఇదంతా పెద్ద స్కామ్ అని.. ఇండియా పోస్ట్ ప్రకటించింది. ఈ వైరల్ అయ్యే లింక్‌తో ఇండియా పోస్టుకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. దయచేసి అందరూ జాగ్రత్తగా ఉండాలని ఇండియా పోస్ట్ ట్వీట్ చేసింది. ఏ అనధికారిక పోర్టల్ లేదా లింక్ ద్వారా ఇండియా పోస్ట్ ఎలాంటి బహుమతిని ఆఫర్ చేయడం లేదని పేర్కొంది. ఈ స్కామ్ సరిగ్గా ఏంటో స్పష్టంగా లేదు. కానీ, సోషల్ మీడియాలో అనుమానిత ఫేక్ లింక్‌లను షేర్ చేయడం ఆమోదయోగ్యం కాదు. మీరు అలాంటి క్లెయిమ్‌లను ఫార్వార్డ్‌గా షేర్ చేసి, ఇంకా పెద్ద సమస్యను సృష్టించే ముందు వాటిని ధృవీకరించాలని ఇండియా పోస్టు తెలిపింది.
ఈ స్కామ్‌లో అనుమానిత లింక్‌లను క్లిక్ చేయడం మిమ్మల్ని హానికరమైన వెబ్‌సైట్‌లకు రీడైరెక్ట్ చేసేలా చేస్తుందని కంపెనీ పేర్కొంది. వాస్తవానికి ఇదో పెద్ద స్కామ్.. (రూ. 79,900 ధర కలిగిన ఐఫోన్ 15) ఉచితంగా పొందవచ్చునని వైరల్ పోస్టు సూచిస్తోంది. ఇలాంటి పోస్టు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని లేదంటే మోసపోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తోంది.