iPhone 15 Pro Max : రాబోయే ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ప్రత్యేక ఫీచర్లు ఇవే? అత్యంత ఖరీదైనదిగా ఉండొచ్చు.. లాంచ్ టైమ్ ఎప్పుడు? పూర్తి వివరాలు మీకోసం..!
iPhone 15 Pro Max : ఆపిల్ ఐఫోన్ అభిమానులకు షాకింగ్ న్యూస్.. రాబోయే ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆపిల్ ఈవెంట్‌కు ముందే ఆన్‌లైన్‌లో ఐఫోన్ 15 సిరీస్ ధర, ఫీచర్లకు సంబంధించిన చాలా వివరాలు లీక్ అయ్యాయి. అవేంటో ఓసారి లుక్కేయండి.

iPhone 15 Pro Max could launch with exclusive features, high price tag
iPhone 15 Pro Max : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ సొంత బ్రాండ్ ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ (iPhone 15 Pro Max) త్వరలో గ్లోబల్ మార్కెట్లోకి ఎంట్రీ ఇవ్వనుంది. ఆపిల్ ఈవెంట్‌లో ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లాంచ్‌కు ముందే ఫీచర్లు, ధరకు సంబంధించి వివరాలు లీకయ్యాయి. రాబోయే ఐఫోన్ ప్రో మ్యాక్స్ అధిక ధర ట్యాగ్‌తో రానుందని అనే వార్త హల్‌చల్ చేస్తోంది. ఆపిల్ నుంచి రానున్న అల్ట్రా-ప్రీమియం ఫ్లాగ్‌షిప్ ఐఫోన్ ఈసారి చాలా ఖరీదైనదని లీక్‌లు సైతం సూచిస్తున్నాయి. హైటాంగ్ ఇంటర్నేషనల్ టెక్ రీసెర్చ్ విశ్లేషకుడు జెఫ్ పు (Jeff Pu) కూడా అదే విషయాన్ని పునరుద్ఘాటించారు. రాబోయే ఆపిల్ ఈవెంట్‌కు ముందు ఐఫోన్ 15 సిరీస్, ఫీచర్ల ఉత్పత్తికి సంబంధించి చాలా ఇతర వివరాలు కూడా ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి.
ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ప్రత్యేకమైన ఫీచర్లు ఇవేనా? :
రాబోయే ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్, 15 ప్రో వేరియంట్‌లో కనిపించని ప్రత్యేకమైన ఫీచర్లను కలిగి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాక్స్ మోడల్ టెలిఫోటో కెమెరాలో పెరిస్కోప్ లెన్స్‌ను చేర్చాలని ఆపిల్ యోచిస్తోంది. వైడబుల్ ఆప్టికల్ జూమ్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. మిగిలిన ప్రత్యేక ఫీచర్‌ల గురించిన వివరాలు ప్రస్తుతం తెలియవు. అయితే, త్వరలో పెద్ద ఆపిల్ లాంచ్ ఈవెంట్ జరగనుంది. అంతకంటే ముందే ఆపిల్ మొత్తం లైనప్‌లో బ్యాటరీ సామర్థ్యాలను మెరుగుపరుస్తుందని అనేక పుకార్లు వినిపిస్తున్నాయి. ఐఫోన్ 15 సిరీస్ 3,877mAh బ్యాటరీని కలిగి ఉందని అంచనా.
iPhone 14లో ఉన్న 3,279mAh బ్యాటరీ యూనిట్‌ను అధిగమిస్తుంది. అదేవిధంగా, ఐఫోన్ 15 Plus భారీ 4,912mAh బ్యాటరీని కలిగి ఉంటుందని అంటున్నారు. ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) మోడల్ 4,325mAh సామర్థ్యంతో గణనీయమైన మెరుగుదలతో రానుంది. ఐఫోన్ 14 ప్రో మోడల్ విషయానికొస్తే.. ఐఫోన్ 15 ప్రో 3,650mAh బ్యాటరీని కలిగి ఉంటుందని నివేదిక తెలిపింది. ఐఫోన్ 14 ప్రో 3,200mAH బ్యాటరీ నుంచి అప్‌గ్రేడ్ అయింది. అదనంగా, ఐఫోన్ 15 Pro Max మోడల్ 4,852mAh బ్యాటరీని ఉపయోగించవచ్చని అంచనా.

iPhone 15 Pro Max could launch with exclusive features, high price tag
ఐఫోన్ ప్రో మోడల్‌లు సన్నగా ఉండే బెజెల్స్‌తో వస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. తద్వారా వినియోగదారులకు ఎక్కువ స్క్రీన్ స్పేస్ అందిస్తుంది. ఐఫోన్ 15 సిరీస్‌లోని అన్ని మోడల్‌లు పంచ్-హోల్ డిస్‌ప్లే డిజైన్‌తో వస్తాయి. గత కొన్నేళ్లుగా ఆండ్రాయిడ్ ఫోన్‌లలో చూస్తున్నదే ఉండొచ్చు. iPhone 15 Pro, iPhone 15 Pro Max మోడల్‌లు కంపెనీ లేటెస్ట్ Bionic A17 ప్రాసెసర్‌ను కలిగి ఉంటాయని భావిస్తున్నారు. లీక్‌లను విశ్వసిస్తే.. ఐఫోన్ 15 ప్రో మోడల్‌లు 1TB వరకు స్టోరేజీ ఆప్షన్‌తో అందుబాటులోకి వస్తాయని అంచనా. ITHome నివేదిక ప్రకారం.. నెక్స్ట్ జనరేషన్ ఐఫోన్ ప్రో వెర్షన్‌లు 256GB, 512GB, 1TB వేరియంట్‌లతో విక్రయించే అవకాశం ఉంది.
ఐఫోన్ 15ప్రో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధరలు లీక్ :
విశ్వసనీయ వాల్ స్ట్రీట్ విశ్లేషకుడు డాన్ ఇవ్స్ ఇటీవలే ఆపిల్ ఐఫోన్ 14 ప్రో మోడళ్లపై దాదాపు 200 (దాదాపు రూ. 16,490) అధిక ధరతో రావొచ్చునని పేర్కొన్నారు. ఐఫోన్ 14 ప్రో భారత మార్కెట్లో రూ. 1,29,900, అమెరికాలో 999 డాలర్లు (సుమారు రూ. 82,380)కి ప్రకటించింది. ఆపిల్ వాస్తవానికి ధరను 200 డాలర్లకు పెంచినట్లయితే.. అమెరికాలో ఐఫోన్ ధర 1,199 డాలర్లు అవుతుంది. అదే.. భారత కరెన్సీలో దాదాపు ధర రూ. 98,850 వరకు ఉంటుంది. కానీ. ఆపిల్ ఐఫోన్ 15 ప్రో మోడల్ అదే ధరతో భారత మార్కెట్లో లాంచ్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే.. కంపెనీ వర్తించే GST, కస్టమ్, ఇతర ఛార్జీలు ఉన్నాయి. ఐఫోన్ 14 ప్రో మోడల్ భారత మార్కెట్లో ధర అమెరికా మార్కెట్ కన్నా దాదాపు రూ. 47,500 ఎక్కువగా ఉంటుంది. అందుకే, ఐఫోన్ 15 ప్రో మోడల్స్ చాలా ఖరీదైనవిగా చెప్పవచ్చు.
అదేవిధంగా, ఐఫోన్ 14 ప్రో మాక్స్ 1,099కి డాలర్లకు పొందవచ్చు. అంటే.. దాదాపు ఐఫోన్ ధర రూ. 90,626 ఉంటుంది. గరిష్టంగా 200 డాలర్ల పెంపుతో, ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ ధర 1,299 డాలర్లు (దాదాపు రూ. 1,07,090) కావచ్చు. కానీ, మళ్లీ భారత్‌లో అదే ధర ఉండకపోవచ్చు. గత ఏడాదిలో ఐఫోన్ 14 ప్రో మ్యాక్స్ భారత మార్కెట్లో రూ. 1,39,900కి అందుబాటులోకి వచ్చింది. అంటే.. ఈ మార్కెట్ అమెరికా మధ్య ధరలో రూ. 32,800 వ్యత్యాసం ఉంది.
ఐఫోన్ 15 సిరీస్ : ఆగస్ట్‌లో ఉత్పత్తి.. లాంచ్ టైమ్‌లైన్ (అంచనా) :
ఆపిల్ అధికారిక లాంచ్ తేదీ ఇంకా ప్రకటించలేదు. వచ్చే సెప్టెంబర్ ప్రారంభంలో ఆపిల్ ఈవెంట్‌ను హోస్ట్ చేయాలని భావిస్తోంది. ఆపిల్ ఆగస్టులో భారీ ఉత్పత్తిని ప్రారంభిస్తుందని అంచనా. విశ్లేషకుల అంచనాల ప్రకారం.. కంపెనీ 2023 చివరి నాటికి 84 మిలియన్ యూనిట్లను తయారు చేయడానికి రెడీగా ఉంది. ఈ సంఖ్య గత ఏడాదిలో ఇదే కాలంలో ఉత్పత్తి చేసిన ఐఫోన్ 14 డివైజ్‌ల సంఖ్యతో పోలిస్తే.. 12శాతం పెరుగుదలను సూచిస్తుంది.