iPhone 16e: గుడ్‌న్యూస్‌.. ఆపిల్ ఐఫోన్ 16ఈపై రూ.21 వేల డిస్కౌంట్‌.. మీరు ఎక్కడ కొనుక్కోవచ్చంటే? 

ఈ వివరాల ద్వారా డిస్కౌంట్‌ ఎలా వస్తుందో తెలుసుకోవచ్చు.

iPhone 16e: గుడ్‌న్యూస్‌.. ఆపిల్ ఐఫోన్ 16ఈపై రూ.21 వేల డిస్కౌంట్‌.. మీరు ఎక్కడ కొనుక్కోవచ్చంటే? 

Updated On : March 2, 2025 / 4:11 PM IST

ఆపిల్ తన ఐఫోన్ 16ఈను గత నెల 21న అధికారికంగా విడుదల చేసింది. భారత్‌లో ఇది ఇప్పుడు అందుబాటులో ఉంది. ధర కాస్త తక్కువగా ఉంటే కొనాలని అనుకుంటున్నారా? కొన్ని రకాల ఆఫర్లను వాడుకుంటే మీరు ఐఫోన్ 16ఈను రూ.21,000 తగ్గింపు ధరతో కొనక్కోవచ్చు.

ఐఫోన్ 16ఈ మూడు స్టోరేజ్‌ వేరియంట్లలో వచ్చింది. 128జీబీ, 256జీబీ, 512జీబీలో అందుబాటులో ఉంది. బేస్ మోడల్ ధర రూ.59,900. మిగతా రెండు ఫోన్ల ధరలు రూ.69,900, రూ.89,900గా ఉన్నాయి. డిస్కౌంట్ కావాలని అనుకుంటే ఇండియాస్టోర్స్‌లో కొనండి. ఐసీఐసీఐ, కోటక్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డులతో బిల్‌ చెల్లిస్తే ప్రస్తుతం రూ.4,000 డిస్కౌంట్ అందిస్తున్నారు.

Also Read: తులానికి రూ.లక్ష దాటనున్న బంగారం ధర.. పసిడి కొంటున్నారా? విశ్లేషకులు చెప్పేది ముందుగా తెలుసుకోండి..

అదనంగా, మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు రూ.13,000 ఎక్స్‌చేంజ్‌ వాల్యూ పొందవచ్చు. అంతేకాదు ఆఫర్‌లో రూ.4,000 ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఉంది. దీంతో మీరు మీ పాత ఫోన్‌ నుంచి రూ.13,000 ఎక్స్‌చేంజ్‌ వాల్యూ పొందితే ఐఫోన్ 16ఈను కేవలం రూ.38,900కే సొంతం చేసుకోవచ్చు. మీరు వాయిదాల పద్ధతిలో చెల్లించాలనుకుంటే నెలకు రూ .2,496 నుంచి ఈఎంఐ ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు.

ఐఫోన్ 16ఈ 6.1-అంగుళాల సూపర్ రెటీనా ఎక్స్‌డీఆర్ ఒలేడ్ డిస్ప్లేతో వచ్చింది. ఇందులో ఫేస్ ఐడీ కూడా ఉంది. హోమ్ బటన్ లేకుండా అన్‌లాక్ చేయొచ్చు. ఈ కొత్త మోడల్ ఐఓఎస్‌ 18తో నడుస్తుంది. ఇది కట్టింగ్-ఎడ్జ్ 3 ఎన్ఎమ్ ఏ 18 బయోనిక్ చిప్ ద్వారా పనిచేస్తుంది.

ఫొటోగ్రఫీ కోసం 48ఎంపీ మెయిన్ కెమెరా వెనుక భాగంలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ తో ఈ ఫోన్ వచ్చింది. 12ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా సెల్ఫీలు, వీడియో కాల్‌లకు అనుగుణంగా ఉంది. బ్యాటరీ లైఫ్ 26 గంటల వరకు వీడియో ప్లేబ్యాక్‌తో ఉంటుంది.

గ్లాస్ ఫ్రంట్, మ్యాట్ బ్యాక్‌తో అల్యూమినియం ఫ్రేమ్ తో నలుపు, తెలుపు రంగులలో వచ్చింది. 128జీబీ, 256జీబీ, 512 జీబీ స్టోరేజీల్లో లభ్యమవుతోంది. 5జీ సపోర్ట్, బ్లూటూత్ 5.3, యూఎస్‌బీ సీ పోర్ట్ ఉంటుంది.