Gold Rates: తులం రూ.లక్ష దాటనున్న బంగారం ధర.. పసిడి కొంటున్నారా? విశ్లేషకులు చెప్పేది ముందుగా తెలుసుకోండి..

ప్రస్తుత గ్లోబల్ ట్రెండ్‌ను బట్టి ఇది సాధ్యమే.

Gold Rates: తులం రూ.లక్ష దాటనున్న బంగారం ధర.. పసిడి కొంటున్నారా? విశ్లేషకులు చెప్పేది ముందుగా తెలుసుకోండి..

GOLD price

Updated On : March 2, 2025 / 4:32 PM IST

గత పదేళ్లలో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి. ద్రవ్యోల్బణం, భౌగోళిక అస్థిరతలు, కేంద్ర బ్యాంకుల విధానాలు, పెట్టుబడిదారుల్లో అభిప్రాయ మార్పులు వంటి అంశాలు ఈ పెరుగుదలకి కారణమయ్యాయి. 2011లో రూ.25,000గా ఉన్న పసిడి ధర ఇప్పుడు దాదాపు రూ.84,000కి చేరింది. బంగారం ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేస్తుందని పెట్టుబడిదారులు భావిస్తారు.

– బంగారం ధర 10 గ్రాములకు రూ.25,000 నుంచి రూ.50,000కి చేరేందుకు 9 సంవత్సరాలు పట్టింది
-రూ.50,000 నుంచి రూ.75,000కి పెరగడానికి కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే పట్టింది
– ఇప్పుడు, బంగారం రూ.84,300 (10 గ్రాములకు) దాటి వేగంగా పెరుగుతోంది. దీన్నిబట్టి ధరలు పెరుగుతున్న తీరును అర్థం చేసుకోవచ్చు

బంగారం ధరలు పెరగడానికి ప్రధాన కారణాలు

  • ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గుదల – ద్రవ్యోల్బణం పెరిగితే, రూపాయి బలహీనపడినప్పుడు, బంగారం ధర పెరుగుతుంది
  • భూభౌగోళిక అస్థిరత – ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న రాజకీయ, ఆర్థిక అస్థిరతలు పెట్టుబడిదారులను బంగారం వంటి వాటివైపుగా ఆకర్షిస్తున్నాయి
  • కేంద్ర బ్యాంకుల బంగారం నిల్వలు పెరగడం – భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సహా అనేక దేశాల కేంద్ర బ్యాంకులు బంగారం నిల్వలను పెంచుకుంటున్నాయి
  • స్టాక్ మార్కెట్ అస్థిరత – ఈక్విటీ మార్కెట్‌లో అనిశ్చితి ఎక్కువగా ఉంటే, పెట్టుబడిదారులు బంగారంపై ఎక్కువ దృష్టి పెడతారు

2025లో బంగారం ధర రూ.లక్షకు చేరుతుందా?

ప్రస్తుతం బంగారం ధర రూ.84,300గా ఉంది. రూ.1,00,000 చేరాలంటే 13.5% పెరుగుదల అవసరం. ప్రస్తుత గ్లోబల్ ట్రెండ్‌ను బట్టి ఇది సాధ్యమే.

బంగారం ధరను మరింత పెంచే అంశాలు

  • ట్రంప్‌ ప్రభుత్వం వాణిజ్య విధానాలు – అమెరికాలో విధించే టారిఫ్‌లు ద్రవ్యోల్బణాన్ని పెంచుతాయని, ఇది బంగారం ధరను మరింత పెంచుతుందని అంచనా
  • భూభౌగోళిక అస్థిరత – యుద్ధాలు, ఆర్థిక సంక్షోభాలు బంగారం డిమాండ్‌ను పెంచుతాయి
  • అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ నిర్ణయాలు – వడ్డీ రేట్లు తగ్గితే, బంగారం ధర మరింత పెరుగుతుంది
  • అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర – ప్రస్తుతం ఔన్సుకు $2,858 వద్ద ఉన్న బంగారం, $3,000 దాటితే, భారత బంగారం ధర కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది

నిపుణుల అభిప్రాయాలు

కోలిన్ షా (Kama Jewelry) – ఆర్థిక అనిశ్చితి వల్ల బంగారం ధర ఎన్నడూలేనంత పెరుగుతుందని అన్నారు
డా. రేణిషా (Augmont) – భూభౌగోళిక పరిణామాలు బాగోలేకపోతే బంగారం ధర రూ.1,00,000 చేరుతుందని అన్నారు
జమాల్ మెక్లై (Mecklai Financial) – బంగారం ధర ఔన్సుకు $3,000 వద్ద కొంత కాలం ఆగవచ్చని, కానీ ఇంకా పెరుగుదల సాధ్యమేనని అన్నారు
అపూర్వ శేఠ్ (Samco Securities) – అత్యంత ప్రతికూల పరిస్థితుల్లో బంగారం రూ.1,48,071 చేరగలదని అంచనా వేశారు