iPhone SE 5G : రూ.28,900లకే iPhone SE 5G ఫోన్.. కండీషన్స్ అప్లయ్..!
iPhone SE 5G smartphone : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ కొత్త మోడల్ iPhone SE 5G స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపు అందిస్తోంది.

Iphone Se 5g
iPhone SE 5G smartphone : ప్రపంచ ఐటీ దిగ్గజం ఆపిల్ బ్రాండ్ ఐఫోన్ కొత్త మోడల్ iPhone SE 5G స్మార్ట్ ఫోన్‌పై భారీ తగ్గింపు అందిస్తోంది. భారత iStoreలో ఈ కొత్త డివైజ్ ధర రూ.30వేల కన్నా తక్కువ ధరకే అందుబాటులో ఉంది. ఈ ఐఫోన్ సొంతం చేసుకోవాలంటే కండీషన్స్ అప్లయ్ అంటోంది ఆపిల్. కొత్త iPhone SE ఇటీవల రూ. 43,900లకు లాంచ్ అయింది. అయితే కస్టమర్లు ఆఫర్ల కింద రూ. 15,000 తగ్గింపుతో పొందవచ్చు. India iStoreలో iPhone SE 5G (2022) అందుబాటులో ఉండగా.. రూ.2వేల వరకు క్యాష్ బ్యాక్ అందిస్తోంది.
ICICI, Kotak SBI బ్యాంక్ కార్డ్‌లపై కూడా ఇన్ స్టంట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ క్యాష్ బ్యాంకు అమౌంట్ ఫోన్ కొనుగోలు చేసిన నెల చివరి తేదీ నుంచి 120 వర్కింగ్ డేస్‌లో మీ కార్డులో క్రెడిట్ అవుతుంది. అంతేకాదు.. ఈ క్యాష్‌బ్యాక్ ఆఫర్ EMI, non-EMI లావాదేవీలపై కూడా అందుబాటులో ఉంది. అలాగే, రూ. 10,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా పొందవచ్చు. రూ. 3,000 అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా అందిస్తోంది. మొత్తం ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద రూ. 13,000 వరకు భారీ తగ్గింపు అందిస్తోంది.

iPhone SE 5G smartphone
ఈ కొత్త iPhone SE 5G 2022 ఫోన్ (64GB స్టోరేజ్) వేరియంట్ ధర రూ. 28,900కి కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో రూ. 2,000 వరకు క్యాష్‌బ్యాక్ ఆఫర్ కూడా ఉంది. ఐఫోన్ 8 ( iPhone 8) ఉన్నవారికి రెగ్యులర్ ఎక్సేంజ్ పొందవచ్చు. మీ వద్ద ఈ ఐఫోన్ ఉంటే.. మీరు కొత్త ఐఫోన్ SE 5Gని ధర రూ. 28,900లకు కొనుగోలు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఇండియా iStore వెబ్ సైట్ విజిట్ చేయొచ్చు.
Read Also : Iphone 12: ఐఫోన్ 12 అద్భుతమైన డీల్ రూ.24వేల900కే..