iQOO Neo 10 Pro Plus : భారీ బ్యాటరీతో కొత్త ఐక్యూ ఫోన్ భలే ఉందిగా.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?

iQOO Neo 10 Pro Plus : ఐక్యూ నియో 10 ప్రో ప్లస్ వచ్చేసింది. 6.82-అంగుళాల 2K 8T LTPO అమోల్డ్ డిస్‌ప్లేతో మరింత ఆకట్టుకునేలా ఉంది.

iQOO Neo 10 Pro Plus : భారీ బ్యాటరీతో కొత్త ఐక్యూ ఫోన్ భలే ఉందిగా.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంతంటే?

iQOO Neo 10 Pro Plus

Updated On : May 21, 2025 / 1:57 PM IST

iQOO Neo 10 Pro Plus : కొత్త ఐక్యూ ఫోన్ కోసం చూస్తున్నారా? అద్భుతమైన ఫీచర్లతో ఐక్యూ నియో 10 ప్రో ప్లస్ లాంచ్ అయింది. వివో సబ్-బ్రాండ్ కొత్త నియో సిరీస్ ఫోన్ మొత్తం 3 కలర్ ఆప్షన్లలో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌పై రన్ అవుతుంది.

Read Also : Vivo S30 Series : మతిపోగొట్టే ఫీచర్లతో కొత్త వివో ఫోన్ వచ్చేస్తోందోచ్.. ఈ నెల 29నే లాంచ్.. వివో ప్యాడ్ కూడా..!

2K రిజల్యూషన్, 144Hz వరకు రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. 6.82-అంగుళాల అమోల్డ్ డిస్‌ప్లే కలిగి ఉంది. IP65 డస్ట్ స్ప్లాష్-రెసిస్టెంట్ బిల్డ్‌ అందిస్తుంది.

ఐక్యూ నియో 10 ప్రో స్లస్ 50MP డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,800mAh బ్యాటరీని అందిస్తుంది.

ఐక్యూ నియో 10 ప్రో ప్లస్ ధర :
ఐక్యూ నియో 10 ప్రో ప్లస్ ధర 12GB ర్యామ్ + 256GB స్టోరేజ్ వేరియంట్ CNY 2,999 (సుమారు రూ. 35,500) నుంచి ప్రారంభమవుతుంది.

12GB+512GB, 16GB+256GB, 16GB+512GB, 16GB+1TB ర్యామ్ స్టోరేజ్ మోడళ్ల ధర వరుసగా CNY 3,499 (సుమారు రూ. 41,500), CNY 3,299 (సుమారు రూ. 39వేలు), CNY 3,699 (సుమారు రూ. 43వేలు ), CNY 4,199 (సుమారు రూ. 50వేలు)గా ఉంది. ప్రస్తుతం చైనా బ్లాక్ షాడో, చి గువాంగ్ వైట్, సూపర్ పిక్సెల్ కలర్ ఆప్షన్లలో ఐక్యూ నియో 10 ప్రో ప్లస్ కొనుగోలు చేయొచ్చు.

ఐక్యూ నియో 10 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు :
ఐక్యూ నియో 10 ప్రో ప్లస్ డ్యూయల్ సిమ్ (నానో) ఆండ్రాయిడ్ 15-ఆధారిత OriginOS 15పై రన్ అవుతుంది. 144Hz వరకు రిఫ్రెష్ రేట్, 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌తో 6.82-అంగుళాల 2K (1,440×3,168 పిక్సెల్స్) 8T LTPO అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంది. ఐక్యూ నియో 10 ప్రో ప్లస్ ఆక్టా-కోర్ 3nm స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ చిప్‌సెట్‌ను కలిగి ఉంది.

అడ్రినో 830 GPUతో వస్తుంది. 16GB వరకు LPDDR5X ర్యామ్ గరిష్టంగా 1TB UFS4.1 స్టోరేజీ కలిగి ఉంది. AnTuTu బెంచ్‌మార్క్ టెస్టింగ్‌లో ఈ ఫోన్ 3,311,557 పాయింట్లను స్కోర్ చేసింది. గేమింగ్ ఐక్యూ సెల్ఫ్ డెవలప్ Q2 చిప్‌ను కూడా కలిగి ఉంది.

ఆప్టిక్స్ విషయానికొస్తే.. ఐక్యూ నియో 10 ప్రో ప్లస్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఇందులో f/1.88 ఎపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా, f/2.2 సెన్సార్‌తో 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో చాట్‌ f/2.45 ఎపర్చర్‌తో వస్తుంది. ఫ్రంట్ సైడ్ 16MP CMOS సెన్సార్‌ను కలిగి ఉంది.

థర్మల్ మేనేజ్‌మెంట్ కోసం కొత్త 7K ఐస్ డోమ్ VC లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌ను కలిగి ఉంది. ఐక్యూ నియో 10 ప్రో ప్లస్ కనెక్టివిటీ ఆప్షన్లలో 5G, Wi-Fi 7, బ్లూటూత్ 5.4, GPS, GLONASS, GALILEO, BeiDou, NFC, GNSS, QZSS, USB టైప్-C పోర్ట్ ఉన్నాయి.

బోర్డులోని సెన్సార్లలో యాక్సిలరోమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, ఇ-కంపాస్, గైరోస్కోప్, ఇన్‌ఫ్రారెడ్ రిమోట్ కంట్రోల్, ఫ్లికర్ సెన్సార్ ఎక్స్-యాక్సిస్ లీనియర్ మోటార్ ఉన్నాయి. ఈ ఐక్యూ నియో అథెంటికేషన్ కోసం ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను కలిగి ఉంది. IP65 రేటెడ్ బిల్డ్‌ కలిగి ఉంది.

Read Also : PM Kisan : బిగ్ అప్‌డేట్.. పీఎం కిసాన్ రూ. 2వేలు పడేది ఎప్పుడంటే? లబ్ధిదారుడి స్టేటస్ ఎలా చెక్ చేయాలి? స్టెప్ బై స్టెప్..!

ఐక్యూ నియో 10 ప్రో ప్లస్‌లో 120W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,800mAh బ్యాటరీ ఉంది. ఈ ఛార్జింగ్ టెక్నాలజీ 25 నిమిషాల్లో బ్యాటరీని 0 నుంచి 70 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఈ ఐక్యూ ఫోన్ 100W PPS, USB-PD ఛార్జింగ్ ప్రోటోకాల్‌ సపోర్ట్ చేస్తుంది. ఐక్యూ ఫోన్ బరువు 217 గ్రాములు ఉంటుంది.