iQoo Neo 7 5G Discount : ఐక్యూ నియో 7 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. కొత్త ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు.. డోంట్ మిస్..!

iQoo Neo 7 5G Discount : కొత్త ఫోన్ కొనేందుకు చూస్తున్నారా? ఐక్యూ నియో 7 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. తగ్గింపు తర్వాత ఐక్యూ ఫోన్ ధర ఎంత ఉందంటే?

iQoo Neo 7 5G Discount : ఐక్యూ నియో 7 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. కొత్త ధర ఎంతో తెలిస్తే ఇప్పుడే కొనేస్తారు.. డోంట్ మిస్..!

iQoo Neo 7 5G Price in India Discounted by Rs. 2,000

Updated On : September 7, 2023 / 8:32 PM IST

iQoo Neo 7 5G Discount : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ మేకర్ ఐక్యూ (iQoo) సరికొత్త ఐక్యూ నియో 7 5G ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. భారత మార్కెట్లో ఈ ఏడాది ఫిబ్రవరిలో మీడియాటెక్ డైమెన్సిటీ 8200 SoC, 120W వైర్డ్ ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీతో లాంచ్ అయింది. ఈ హ్యాండ్‌సెట్ 64MP ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది.

Qualcomm Snapdragon 870 SoC, 4,700mAh బ్యాటరీతో 2022లో లాంచ్ అయిన iQoo Neo 6 ఫోన్ అప్‌గ్రేడ్ వెర్షన్‌గా నియో 7 రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో వస్తుంది. ఇప్పుడు ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌ (Amazon)లోని అధికారిక వెబ్‌సైట్‌లో తగ్గిన ధరలతో అందుబాటులో ఉంది.

Read Also : TVS Apache RTR 310 Launch : కొత్త బైక్ కొంటున్నారా? టీవీఎస్ అపాచీ RTR 310 బైక్.. దిమ్మతిరిగే ఫీచర్లు.. బుకింగ్స్ ఓపెన్.. ధర ఎంతంటే?

iQoo Neo 7 5G ధర ఎంతంటే? :
ఐక్యూ నియో 7 5G ఫోన్ 8GB + 128GB, 12GB + 256GB వేరియంట్ల ధర భారత మార్కెట్లో వరుసగా రూ. 29,999, రూ.33,999లకు అందుబాటులో ఉన్నాయి. ఐక్యూ నియో 7 5G ధర రూ. 2వేలు తగ్గినట్లు కంపెనీ ధృవీకరించింది. ప్రస్తుతం 8GB + 128GB స్టోరేజీ ధర రూ. 27,999, 12GB + 256GB ఆప్షన్లకు వరుసగా రూ. 31,999కు పొందవచ్చు. iQoo Neo 7 5G అధికారిక వెబ్‌సైట్‌లో కొత్త ధరలతో ఫ్రాస్ట్ బ్లూ, ఇంటర్‌స్టెల్లార్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లలో పొందవచ్చు. అమెజాన్‌లో కూడా కొత్త ధరలతో ఐక్యూ నియో 7 5G ఫోన్ సొంతం చేసుకోవచ్చు.

iQoo Neo 7 5G Price in India Discounted by Rs. 2,000

iQoo Neo 7 5G Discount : Price in India Discounted by Rs. 2,000

ఐక్యూ నియో 7 5G స్పెసిఫికేషన్లు, ఫీచర్లు :
6.78-అంగుళాల ఫుల్-HD+ (2400 x 1080 పిక్సెల్‌లు) AMOLED డిస్‌ప్లేతో, ఐక్యూ నియో 7 5G రిఫ్రెష్ రేట్ 120Hz, టచ్ శాంప్లింగ్ రేట్ 300Hz, గరిష్ట ప్రకాశం స్థాయి 1300 నిట్‌లను అందిస్తుంది. ఈ ఫోన్ 4nm ఆక్టా-కోర్ MediaTek డైమెన్సిటీ 8200 SoC ద్వారా ARM Mali G610 GPUతో వస్తుంది. 12GB వరకు LPDDR5 RAM, 256GB వరకు UFS3.1 ఇంటర్నల్ స్టోరేజీతో అందిస్తుంది.

Android 13-ఆధారిత Funtouch OS 13తో రన్ అవుతుంది. డ్యూయల్ నానో SIM-సపోర్ట్ ఉన్న ఐక్యూ నియో 7 5G ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో కూడిన 64MP ప్రధాన కెమెరా, మాక్రో లెన్స్‌తో కూడిన 2MP సెన్సార్, వెనుకవైపు 2MP డెప్త్ సెన్సార్ కలిగి ఉంది. ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16MP సెన్సార్‌ను పొందుతుంది.

ఐక్యూ నియో 7 5G ఫోన్ 120W వైర్డు ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందిస్తుంది. 10 నిమిషాల్లో ఫోన్‌ని సున్నా నుంచి 50 శాతం వరకు ఛార్జ్ చేస్తుంది. ఈ హ్యాండ్‌సెట్ 5G, Wi-Fi, బ్లూటూత్, OTG, NFC, GPS, USB టైప్-C పోర్ట్ కనెక్టివిటీతో వస్తుంది. భద్రత విషయానికి వస్తే.. ఈ ఫోన్‌లో ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ను అమర్చారు. 193 గ్రాముల బరువున్న ఈ స్మార్ట్‌ఫోన్ 164.81mm x 76.9mm x 8.5mm పరిమాణంలో ఉంటుంది.

Read Also : Honor 90 5G Launch : హానర్ 90 5G ఫోన్ లాంచ్ డేట్ తెలిసిందోచ్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర ఎంత ఉండొచ్చుంటే?