Aadhaar Safe Tips : మీ ఆధార్ సురక్షితమేనా? మీ ఆధార్ నంబర్‌ను ఎవరు ఉపయోగిస్తున్నారో ఇలా చెక్ చేయండి!
Aadhaar Safe : మీ ఆధార్ దుర్వినియోగం అవుతుందో లేదో మీరు ఇలా ఈజీగా చెక్ చేయవచ్చు? ఆధార్ హోల్డర్‌లు తమ ఆధార్‌తో లింక్ అయిన అన్ని కార్యకలాపాలను మానిటరింగ్ చేసుకోవచ్చు.

your Aadhaar safe
Aadhaar Safe Tips : ఆధార్ కార్డు.. ప్రతి భారతీయ పౌరుడికి ఒక గుర్తింపుగా ఉపయోగపడుతుంది. వ్యక్తిగత పనుల దగ్గర నుంచి ప్రభుత్వ పథకాల వరకు అన్నింటికి ఆధార్ కార్డు తప్పనిసరి. బ్యాంకుల్లో లోన్లు పొందాలన్నా ఏదైనా లావాదేవీలను పూర్తి చేయాలన్నా సరే ఈ ఆధార్ కార్డు ఉపయోగపడుతుంది. ఆధార్ కార్డులో 12 అంకెల ఆధార్ నంబర్ చాలా ముఖ్యమైన ఐడీ డాక్యుమెంట్‌గా మారింది. ప్రయాణం చేసినా, అడ్మిషన్ పొందాలన్నా లేదా కొత్త బ్యాంక్ ఖాతాను తెరిచాలన్నా, మన గుర్తింపును ధృవీకరించడానికి మన ఆధార్ వివరాలను తప్పనిసరిగా షేర్ చేయాలి.
Read Also : ఈ శాంసంగ్ ఫోన్‌పై దిమ్మతిరిగే డిస్కౌంట్.. ఇదే బెస్ట్ టైమ్.. కొంటే ఇప్పుడే కొనేసుకోండి..!
నిజానికి ఆధార్ వల్ల ప్రభుత్వ సేవలు, ఆర్థిక సంస్థల నుంచి అనేక ప్రయోజనాలను పొందవచ్చు. అయినప్పటికీ, ఆధార్ వినియోగం పెరగడంతో ఆర్థిక మోసం లేదా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు ఉపయోగించుకునే స్కామర్‌లకు ఆధార్ ఒక సాధారణ లక్ష్యంగా మారింది. మీ ఆధార్‌ను సురక్షితంగా ఉంచుకోవడం చాలా ముఖ్యమని గమనించాలి.
అయితే, మీ ఆధార్ దుర్వినియోగం అవుతుందో లేదో మీరు ఇలా ఈజీగా చెక్ చేయవచ్చు? ఆధార్ హోల్డర్‌లు తమ ఆధార్‌తో లింక్ అయిన అన్ని కార్యకలాపాలను మానిటరింగ్ చేసుకోవచ్చు. ఆధార్‌కు బాధ్యత వహించే పాలక సంస్థ అయిన యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) మైఆధార్ పోర్టల్‌లో “authentication history” ఫీచర్ అనే ఆన్‌లైన్ టూల్ కలిగి ఉంది.
ఈ టూల్ ఆధార్ హోల్డర్‌లు తమ ఆధార్ సంబంధిత కార్యకలాపాలను ట్రాక్ చేయడం లేదా సెక్యూర్ చేసేందుకు అనుమతిస్తుంది. మీ ఆధార్ ఎలా ఉపయోగిస్తున్నారు? దుర్వినియోగం జరిగిందని మీకు అనుమానంగా ఉంటే.. అది ఎలా సెక్యూర్ చేసుకోవాలో చెక్ చేసేందుకు ఈ కింది విధంగా ప్రయత్నించండి.
మీ ఆధార్ హిస్టరీ చెక్ చేయాలంటే? :
- (myAadhaar) పోర్టల్‌ని సందర్శించండి : అధికారిక (myAadhaar) వెబ్‌సైట్‌కి వెళ్లండి.
- ఓటీపీతో లాగిన్ చేయండి : మీ ఆధార్ నంబర్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
- “Login With OTP”పై క్లిక్ చేసి.. మీ అకౌంట్ యాక్సెస్ చేసేందుకు మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన వన్-టైమ్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించండి.
- మీ అథెంటికేషన్ హిస్టరీని యాక్సెస్ చేయండి : “authentication history” ఆప్షన్ ఎంచుకోండి. ఆ వ్యవధిలో ఆధార్ వినియోగాన్ని రివ్యూ కోసం తేదీని ఎంచుకోండి.
- వివరాలను రివ్యూ చేయండి : ఇప్పుడు లిస్టులో కనిపించే లావాదేవీలను జాగ్రత్తగా చెక్ చేయండి. మీరు ఏదైనా తెలియని లేదా అనుమానాస్పద యాక్టివిటీని గమనిస్తే.. వెంటనే దాన్ని రిపోర్టు చేయండి.
అనధికార యాక్టివిటీని రిపోర్టు చేయండి :
- మీ ఆధార్ నంబర్‌కి లింక్ చేసిన ఏదైనా అనధికార కార్యకలాపాన్ని మీరు గుర్తిస్తే:
- UIDAI టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్‌కి 1947కు కాల్ చేయండి.
- మీ ఆందోళనలను (help@uidai.gov.in)కు ఇమెయిల్ చేయండి.
ఆధార్ బయోమెట్రిక్‌లను ఇలా లాక్ చేయండి :
అదనంగా, యూఐడీఏఐ వినియోగదారులు వారి బయోమెట్రిక్‌లను లాక్ చేయడం ద్వారా ఆధార్ దుర్వినియోగాన్ని నిరోధించేందుకు అనుమతిస్తుంది. ఎవరైనా మీ ఆధార్ నంబర్‌కి యాక్సెస్ పొందినప్పటికీ, మీ అనుమతి లేకుండా మీ బయోమెట్రిక్ సమాచారాన్ని ఉపయోగించలేరని ఈ ఫీచర్ నిర్ధారిస్తుంది.
మీ ఆధార్ బయోమెట్రిక్‌లను లాక్ చేసే విధానం :
యూఐడీఏఐ (UIDAI) వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి : ఇప్పుడు “లాక్/అన్‌లాక్ బయోమెట్రిక్స్” సెక్షన్ నావిగేట్ చేయండి.
అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి : మీ వర్చువల్ ఐడీ (VID), పేరు, పిన్ కోడ్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయండి.
ఓటీపీతో అథెంటికేషన్ : “Send OTP” క్లిక్ చేసి.. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపిన కోడ్‌ని ఎంటర్ చేయండి.
మీ బయోమెట్రిక్ సెక్యూరుగా ఉంచుకోండి : మీ ఆధార్ బయోమెట్రిక్‌ను లాక్ చేసే ప్రక్రియను పూర్తి చేయండి.
మీ ఆధార్ వివరాలు దుర్వినియోగం కాకుండా చూసేందుకు మీ ఆధార్ కార్యకలాపాన్ని క్రమం తప్పకుండా చెక్ చేయడం మంచిది. యూఐడీఏఐ ఆధార్ హోల్డర్‌లను ఫోన్ నంబర్, అడ్రస్, ఫింగర్‌ఫ్రింట్స్ వంటి బయోమెట్రిక్ వివరాలతో సహా వారి వివరాలను అప్‌డేట్ చేయాలి. మీరు గత 10 ఏళ్లలో ఆధార్ అప్‌డేట్ చేయకుంటే.. మీ బయోమెట్రిక్ తప్పనిసరిగా అప్‌డేట్ చేయాలి. ఆధార్ హోల్డర్ 15 ఏళ్లు నిండిన పిల్లలైతే ఇది చాలా ముఖ్యమని గమనించాలి.
Read Also : ఓర్నీ.. ఈ రకంగా కూడా చేస్తారా?.. ఐఫోన్, ఆండ్రాయిడ్‌లో ఓలా, ఉబర్ బుక్ చేసేవాళ్లు ఇది చూడాల్సిందే..