Jio Freedom Offer : వావ్.. జియో ఫ్రీడమ్ ఆఫర్.. 15 నెలలు, 100Mbps, 12 OTTలు, 1000 టీవీ ఛానళ్లు.. ఒక్క ప్లాన్‌లోనే!
Jio Freedom Offer : స్వాతంత్ర్య దినోత్సవానికి ముందు జియో కొత్త ఫ్రీడమ్ ఆఫర్‌ను ప్రకటించింది. తద్వారా వినియోగదారులకు పూర్తి 15 నెలల పాటు 100Mbps ఇంటర్నెట్ అందిస్తుంది.
Jio Freedom Offer
- జియో యూజర్లకు అద్భుతమైన ఫ్రీడమ్ ఆఫర్
- 15 నెలల బ్రాండ్ బ్యాండ్ ప్లాన్ బెనిఫిట్స్ ఇవే
- 100Mbps వరకు ఇంటర్నెట్ స్పీడ్, 12 ఓటీటీ యాప్‌లు
Jio Freedom Offer : జియో యూజర్లకు బంపర్ ఆఫర్.. దేశంలోనే అతిపెద్ద టెలికాం సంస్థ రిలయన్స్ జియో కొత్త ఫ్రీడమ్ ఆఫర్‌ను ప్రకటించింది. స్వాతంత్ర్య దినోత్సవానికి ముందే ప్రత్యేకించి జియో ఫైబర్ యూజర్ల కోసం ఈ ఆఫర్‌ను తీసుకొచ్చింది.
పూర్తి 15 నెలల వ్యాలిడిటీతో ఆఫర్ అందిస్తోంది. ఆసక్తిగల యూజర్లు ఈ ప్లాన్ తీసుకుంటే 100Mbps వరకు ఇంటర్నెట్ స్పీడ్ (Jio Freedom Offer) పొందవచ్చు. అదనంగా, 1,000కు పైగా లైవ్ టీవీ ఛానెళ్లు, 12 ఓటీటీ యాప్‌లకు యాక్సెస్ కూడా పొందవచ్చు.
జియో ఫ్రీడమ్ ఆఫర్ ఏంటి? :
జియో నుంచి ఈ ఫ్రీడమ్ ఆఫర్ ప్రత్యేకంగా బ్రాడ్‌బ్యాండ్ యూజర్లకు అందుబాటులో ఉంది. జియో ఫైబర్ లేదా ఎయిర్ ఫైబర్ (జియో హోమ్) వాడే యూజర్లకు అద్భుతంగా ఉంటుంది. 100Mbps ప్లాన్ కోసం యూజర్లు రూ.10వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. కంపెనీ యూజర్లకు 15 నెలల వ్యాలిడిటీని అందిస్తోంది.
బెనిఫిట్స్ పరంగా చూస్తే మొత్తం రూ. 6వేలు సేవ్ చేసుకోవచ్చు. జియో 100Mbps బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర రూ. 899 + జీఎస్టీతో 15 నెలలకు యూజర్లు రూ.13,485 + జీఎస్టీ చెల్లించాలి. దీని మొత్తం రూ. 16వేలు ఉంటుంది. ఫ్రీడమ్ ఆఫర్ కింద ఈ ప్లాన్‌ను నెలకు రూ. 666కే పొందవచ్చు.
బెనిఫిట్స్ ఏంటి? :
ఈ జియో ఆఫర్ ఒకేసారి 12 నెలలకు రీఛార్జ్ చేయాలనుకునే జియో హోమ్ యూజర్లకు బెటర్. ఈ ప్లాన్ కింద మొత్తం 15 నెలల పాటు వై-ఫై రీఛార్జ్ చేయాల్సిన పనిఉండదు. అంటే.. ఈ 15 నెలల పాటు 100Mbps వరకు స్పీడ్ అన్ లిమిటెడ్ ఇంటర్నెట్ను పొందుతారు. ఈ ప్లాన్‌తో కంపెనీ 1000కు పైగా లైవ్ టీవీ ఛానెళ్లకు యాక్సెస్ అందిస్తోంది. అంతేకాదు.. ఎంటర్టైన్మెంట్ కోసం 12 OTT యాప్‌లకు సబ్స్క్రిప్షన్ పొందవచ్చు.
ఈ ఓటీటీ యాప్‌లలో జియో హాట్‌స్టార్, జీ5, సోనీలివ్, సన్నెక్స్ట్, హోయ్‌చోయ్, డిస్కవరీ+, టైమ్స్ప్లే, తరంగ్ప్లస్, ఈరోస్‌నౌ, లయన్స్‌గేట్ ప్లే, షెమరూమీ, ఈటీవీ విన్ ఉన్నాయి. జియో త్వరలో భారత మార్కెట్లో శాటిలైట్ ఇంటర్నెట్ సర్వీసులను కూడా ప్రారంభించనుంది. ఇటీవలే జియోకు చెందిన 1600 ఎల్ఈఓ శాటిలైట్లపై స్పెషల్ టెస్టింగ్ విజయవంతమైంది.
ఈ ఆఫర్ ఎలా పొందాలి? :
ఈ జియో ఆఫర్ ప్రస్తుతం మైజియో యాప్‌లో అందుబాటులో ఉంది. యూజర్లు మైజియో యాప్‌లోకి లాగిన్ అయ్యాక హోమ్ పేజీలో ఈ ఆఫర్‌కు సంబంధించిన బ్యానర్‌ను చూడొచ్చు. దానిపై ట్యాప్ చేస్తే తర్వాత పేజీకి రీడైరెక్ట్ అవుతారు. అక్కడ జియో హోమ్ వై-ఫైని రీఛార్జ్ చేసుకోవచ్చు.
