Jio Users : జియో యూజర్లకు పండగే.. జెమిని ప్రో ప్లాన్ ఫ్రీ.. 2TB క్లౌడ్ స్టోరేజీ.. 18 నెలలు ఎంజాయ్ చేయొచ్చు.. ఎవరు అర్హులంటే?

Jio Users : జియో యూజర్ల కోసం అద్భుతమైన ఆఫర్.. జెమిని ప్రో ప్లాన్ ఫ్రీగా పొందొచ్చు. 2టీబీ క్లౌడ్ స్టోరేజీతో పాటు 18 నెలల వ్యాలిడిటీని పొందవచ్చు.

Jio Users : జియో యూజర్లకు పండగే.. జెమిని ప్రో ప్లాన్ ఫ్రీ.. 2TB క్లౌడ్ స్టోరేజీ.. 18 నెలలు ఎంజాయ్ చేయొచ్చు.. ఎవరు అర్హులంటే?

Google Gemini Pro Plan

Updated On : October 31, 2025 / 5:02 PM IST

Jio Users : జియో యూజర్లకు అదిరిపోయే న్యూస్.. రిలయన్స్ జియో గూగుల్ భాగస్వామ్యంతో జెమిని ఏఐ ప్రో ప్లాన్ ప్రవేశపెట్టింది. జియో అన్‌లిమిటెడ్ 5G యూజర్ల కోసం 18 నెలల పాటు లేటెస్ట్ జెమిని 2.5 ప్రో మోడల్‌తో సహా ఏఐ AI ప్రో ప్లాన్‌ ఆఫర్ చేస్తోంది. ఈ మేరకు గూగుల్ ఒక ప్రకటనలో ధృవీకరించింది.

దాదాపు రూ.35,100 విలువైన ఈ ఆఫర్ మొదట (Jio Users) 18 ఏళ్ల నుంచి 25 ఏళ్ల వయస్సు గల యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అన్ని అర్హత కలిగిన జియో సబ్‌స్క్రైబర్‌లకు విస్తరిస్తుంది. అర్హత కలిగిన యూజర్లు ఆఫర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ‘Cliam Now’ బ్యానర్‌పై క్లిక్ చేయడం ద్వారా (MyJio) యాప్ ద్వారా ఆఫర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు.

Read Also : Aadhaar New Rules : బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి ఆధార్ కొత్త రూల్స్.. ఈ 3 కీలక మార్పులు అమల్లోకి.. ఫుల్ డిటెయిల్స్..!

ఫ్రీ గూగుల్ ఏఐ ప్రో ఆఫర్‌కు ఎవరు అర్హులు? :
జియో ప్రకారం.. ఈ ఆఫర్ రూ. 349 లేదా అంతకంటే ఎక్కువ ధర గల అన్‌లిమిటెడ్ 5G ప్లాన్‌లను వాడే అన్ని ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ యూజర్లకు అందుబాటులో ఉంది. ఫ్రీ ఏఐ బెనిఫిట్స్ కోసం వినియోగదారులు యాక్టివ్ అన్‌లిమిటెడ్ 5G ప్లాన్‌లో ఉండాలి.

గూగుల్ ఏఐ ప్రో ప్లాన్‌ ఫీచర్లు ఉంటి? :

  • జియో యూజర్ల కోసం ఫ్రీ గూగుల్ ఏఐ ప్రో బండిల్‌లో గూగుల్ అత్యంత అడ్వాన్స్ ఏఐ టూల్స్, సేవలకు యాక్సెస్ పొందవచ్చు.
  • జెమిని యాప్ లోపల గూగుల్ లేటెస్ట్ అత్యంత పవర్‌ఫుల్ మల్టీమోడల్ ఏఐ మోడల్ జెమిని 2.5 ప్రో కలిగి ఉంది.
  • హై క్వాలిటీ ఏఐ-జనరేటెడ్ ఫొటోలు, వీడియోలను రూపొందించేందుకు కంపెనీ నెక్స్ట్ జనరేషన్ మోడళ్లు నానో బనానా, వీయో 3.1లకు కూడా యాక్సెస్ పొందవచ్చు.
  • ఈ ప్లాన్‌లో విద్యార్థులు, ఎక్స్‌పర్ట్స్ సంక్లిష్ట సమాచారాన్ని అర్థం చేసుకునేందుకు జెమిని ఆధారిత రీసెర్చ్, అధ్యయన టూల్ నోట్‌బుక్‌ఎల్‌ఎం (NotebookLM) కూడా ఉంది.
  • ఆసక్తిగల వినియోగదారులు 2TB క్లౌడ్ స్టోరేజీని అందుకుంటారు.
  • Google Photos, Gmail, Drive, Android డివైజ్‌ల్లో వాట్సాప్ చాట్‌లను బ్యాకప్ కోసం కూడా ఉపయోగించవచ్చు.