Made In India : కార్బన్ నుంచి చౌకైన ధరకే స్మార్ట్ LED TV.. వెంటనే కొనేసుకోండి!
స్మార్ట్‌ఫోన్ కంపెనీ కార్బన్ (Karbonn) భారత టీవీ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. ‘Made for India’ రేంజ్ ఆఫ్ Smart LED TVలను చౌకైన ధరకే ఆఫర్ చేస్తోంది.

Karbonn Launches Made In India Smart Led Tvs In India
Karbonn Smart LED TVs : ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ కార్బన్ (Karbonn) భారత టీవీ మార్కెట్లో ఎంట్రీ ఇచ్చింది. బడ్జెట్, ఫీచర్ల ఫోన్ల తయారీ కంపెనీగా పేరొందిన కార్బన్.. Smart LED TVలను భారత్‌లో చౌకైన ధరకే అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయ టీవీ మార్కెట్లో ‘Made for India’, రేంజ్ ఆఫ్ స్మార్ట్ టీవీలు, LED TVలను Smart TV సిగ్మెంట్లలో లాంచ్ చేసింది. ఈ మేరకు కార్బన్ కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.
Reliance Digital భాగస్వామ్యంతో సరికొత్త రేంజ్ స్మార్ట్ టీవీలను విక్రయించనుంది. న్యూ రేంజ్ స్మార్ట్ టీవీల విక్రయానికి కార్బన్ రిలయన్స్ డిజిటల్‌తో చేతులు కలిపామని కార్బన్ ఎండీ ప్రదీప్ జైన్ వెల్లడించారు. స్మార్ట్ LED టీవీలతో కస్టమర్లకు సరసమైన ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో ప్రొడక్టులను అందిస్తామని జైన్ తెలిపారు. కార్బన్ స్మార్ట్ ఎల్ఈడీ టీవీల ప్రారంభ ధర రూ. 7990 నుంచి అందుబాటులో ఉండనున్నాయి.
Meta Smartwatch : ఆపిల్‌కు పోటీగా.. ఫేస్బుక్ ఫ్రంట్ కెమెరా స్మార్ట్‌వాచ్.. ఫొటో లీక్!
Karbonn సరికొత్త టీవీలను వేర్వేరు సైజుల్లో లాంచ్ చేసింది. Smart LED TV రేంజ్ టీవీలు మూడు మోడళ్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. KJW39SKHD, KJW32SKHD (Bezel-less Design), KJWY32SKHD మూడు మోడళ్లలో వచ్చాయి. LED TV రేంజ్ టీవీల్లో KJW24NSHD & KJW32NSHD మోడళ్లలో ఎంటర్ టైన్మెంట్ అనుభవాన్ని అందించనుంది. పవర్ ఫుల్ సౌండ్ సిస్టమ్ తో పాటు బెజల్ లెస్ డిజైన్ కలిగిన స్మార్ట్ టీవీలను కార్బన్ ఆఫర్ చేస్తోంది.
ఏయే టీవీలకు ఎంత ధర నిర్ణయించిందో కంపెనీ ఇప్పటివరకూ రివీల్ చేయలేదు. కానీ, స్మార్ట్ ఎల్ఈడీ టీవీ ప్రారంభ ధర రూ.7,990 నుంచి అందుబాటులో ఉండనుంది. Smart LED TV రేంజ్లో ఫ్లోయింగ్ సౌండ్ ఆడియో ఆఫర్ చేస్తోంది. వైడ్ వ్యూయింగ్ యాంగిల్ కూడా థియేటర్ అనుభవాన్ని అందిస్తుంది. బ్యూటిఫుల్ HD డిస్ ప్లే, సరికొత్త అనుభవాన్ని యూజర్లు పొందవచ్చు. ఈ టీవీల్లో ప్రీ-ఇన్ స్టాల్డ్ Movie Box కూడా ఉంది. కనెక్టవిటీ విషయానికి వస్తే.. మల్టీపుల్ డివైజ్ లకు ఈ Smart TV కనెక్ట్ చేసుకోవచ్చు.
WhatsApp Stop : నవంబర్ 1 నుంచి ఈ ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు.. మీ ఫోన్ ఉందో చెక్ చేసుకోండి!