Kinetic : ఎలక్ట్రిక్ లూనా వచ్చేస్తోంది!
2000 సంవత్సరంలో లూనా ఉత్పత్తిని కంపెనీ నిలిపివేసింది. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టుగా...ఎలక్ట్రిక్ ఫీచర్లతో ఉత్పత్తి చేయబోతున్నారు.

Luna
Kinetic Luna Electric : భారతదేశంలో మోపైడ్ కెనైటిక్ లూనా అప్పట్లో చాలా ఫేమస్ అయ్యింది. సామాన్యులు ఎక్కువగా దీనిని ఉపయోగించేవారు. పెట్రోల్ అయిపోతే..సైకిల్ మాదిరిగా తొక్కుకపోయే సౌకర్యం ఉండేది. దీనికి ఇతర కంపెనీలు పోటీనివ్వలేదు. దీంతో వినియోగదారులను ఎంతో ఆకట్టుకున్న కెనైటిక్ లూనా…కనుమరుగైపోయింది. ద్విచక్రవాహనాల్లో మార్పులు, చేర్పులు రావడంతో ఇతర కంపెనీలకు ధీటుగా నిలబడలేకపోయింది.
Read More : Japanese Mint Cultivation: జపనీస్ పుదీనా సాగు
దీంతో 2000 సంవత్సరంలో లూనా ఉత్పత్తిని కంపెనీ నిలిపివేసింది. ఇప్పుడు మరోసారి లూనాను మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టుగా…ఎలక్ట్రిక్ ఫీచర్లతో ఉత్పత్తి చేయబోతున్నారు. ఎలక్ట్రిక్ వాహనం అయినా…దీని ధర తక్కువగానే ఉండబోతోందని తెలుస్తోంది. ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 60 కిలోమీటర్లు దూరం వరకు ప్రయాణం చేసేలా వాహనాన్ని రూపొందిస్తున్నారు. 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఈ లూనాను..ఈ ఏడాది మార్కెట్ లోకి విడుదల చేసేందుకు కంపెనీ వర్గాలు ప్రయత్నిస్తున్నాయి. అయితే ధర ఎంత ఉండనుందో తెలియరావడం లేదు.
Read More : First woman Afghan mayor: అఫ్ఘాన్‌లో ప్రస్తుత పరిస్థితులకు పాకిస్తాన్ కూడా కారణమే!