Lava Blaze Curve 5G : భారత్‌కు లావా బ్లేజ్ కర్వ్ 5జీ ఫస్ట్ ఫోన్ వస్తోంది.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
Lava Blaze Curve 5G : లావా నుంచి సరికొత్త 5జీ ఫోన్ రాబోతోంది. లావా బ్లేజ్ కర్వ్ 5జీ ఫోన్ అతి త్వరలో లాంచ్ కానుంది. లాంచ్ తేదీతో పాటు ధర ఎంత ఉంటుంది అనేదానిపై కంపెనీ క్లారిటీ ఇవ్వలేదు.

Lava Blaze Curve 5G India Launch Teased by Top Executive
Lava Blaze Curve 5G Launch : లావా త్వరలో భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. టాప్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ప్రకారం.. కంపెనీ త్వరలో కొత్త ప్రొడక్టును లాంచ్ చేయనుంది. లావా బ్లేజ్ కర్వ్ 5జీ స్మార్ట్‌ఫోన్ కర్వడ్ స్క్రీన్‌తో కూడిన కంపెనీ నుంచి వచ్చిన ఫస్ట్ హ్యాండ్‌సెట్ అని సూచిస్తుంది.
Read Also : OnePlus 12R Launch : ఈ నెల 23న వన్‌ప్లస్ 12ఆర్ ఫోన్ వచ్చేస్తోంది.. లాంచ్‌కు ముందుగానే కలర్ ఆప్షన్లు లీక్..!
కంపెనీ ఇటీవల భారత మార్కెట్లో లావా యువ 3 ప్రో, లావా స్టార్మ్ 5జీని లాంచ్ చేసింది. రాబోయే స్మార్ట్‌ఫోన్ 2024లో ప్రారంభమయ్యే ఫస్ట్ డివైజ్ కావచ్చు. లావా బ్లేజ్ కర్వ్ 5జీ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను లాంచింగ్ తేదీని కంపెనీ ఇంకా ప్రకటించలేదు. లావా బ్లేజ్ కర్వ్ 5జీ టీజర్, హ్యాండ్‌సెట్ కర్వడ్ అమోల్డ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని సూచిస్తుంది.
ధర ఎంత ఉండొచ్చుంటే? :
ఈ హ్యాండ్‌సెట్ 5జీ కనెక్టివిటీకి సపోర్టు ఇస్తుంది. లావా బ్లేజ్ కర్వ్ 5జీ ధర ఎంత ఉంటుందో ప్రస్తుతానికి క్లారిటీ లేదు. దేశంలో కర్వ్డ్ డిస్‌ప్లేలు కలిగిన కొన్ని సరసమైన ఫోన్‌లలో ఐక్యూ జెడ్7 ప్రో 5జీ, రియల్‌మి 11 ప్రో, రియల్‌మి నార్జో 60 ప్రో ఉన్నాయి. భారత మార్కెట్లో రూ. 30వేల కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. గత ఏడాది నవంబర్‌లో కంపెనీ బ్లేజ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు ఇటీవల అదనంగా లావా బ్లేజ్ 2 5జీని లాంచ్ చేసింది. ఈ హ్యాండ్‌సెట్ బేస్ 4జీబీ+64జీబీ ర్యామ్ స్టోరేజ్ కాన్ఫిగరేషన్ రూ. 9,999 సరసమైన 5జీ ధరకు అందిస్తుంది.

Lava Blaze Curve 5G India Launch
ఆకర్షణీయమైన కెమెరా ఫీచర్లు :
6.56-అంగుళాల ఎల్‌సీడీ స్క్రీన్‌ను కలిగి ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6020 చిప్‌సెట్‌తో ఆధారితంగా గరిష్టంగా 6జీబీ ర్యామ్‌తో వస్తుంది. లావా బ్లేజ్ 2 5జీ ఫోన్ 50ఎంపీ ప్రైమరీ సెన్సార్, 0.08ఎంపీ సెకండరీ కెమెరాతో వస్తుంది. అయితే, సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం 8ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను కలిగి ఉంది. యూఎస్‌బీ టైప్-సి పోర్ట్ ద్వారా 18డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో ఫోన్ 5,000ఎంఎహెచ్ బ్యాటరీని అందిస్తుంది. రాబోయే వారాల్లో లావా బ్లేజ్ కర్వ్ 5జీ ఫోన్ గురించి పూర్తివివరాలను తెలుసుకోవచ్చు.