Lava Storm 5G Launch : ఈ నెల 21న లావా స్ట్రోమ్ 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంత ఉండొచ్చుంటే?
Lava Storm 5G Launch : లావా నుంచి కొత్త 5జీ ఫోన్ వచ్చేస్తోంది. ఈ నెల 21న భారతీయ మార్కెట్లో లాంచ్ కానుంది. డ్యూయల్ కెమెరా ఫీచర్లతో పాటు రెండు కలర్ ఆప్షన్లలో రానుంది. పూర్తి వివరాల కోసం ఓసారి లుక్కేయండి.

Lava Storm 5G Launch Set for December 21, Tipped to Run on MediaTek Dimensity 6080 SoC
Lava Storm 5G Launch : ప్రముఖ స్వదేశీ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ లావా నుంచి కొత్త స్ట్రోమ్ 5జీ భారత మార్కెట్లోకి రానుంది. ఈ నెల (డిసెంబర్ 21న) లాంచ్ కానుంది. ఈ మేరకు దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ సోషల్ మీడియా వేదికగా లావా అధికారిక టీజర్ వీడియో, పోస్టర్‌లను రిలీజ్ చేసింది. రాబోయే స్మార్ట్‌ఫోన్ డిజైన్‌పై అనేక అంచనాలు నెలకొన్నాయి. లావా స్ట్రోమ్ 5జీ ఫోన్ బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ కనీసం 2 కలర్ ఆప్షన్లలో రానుంది. లావా స్ట్రోమ్ 5జీ ఫోన్ మీడియాటెక్ డైమెన్షిటీ 6080 ఎస్ఓసీలో రన్ కానుంది.
ఈ నెల 21నే లాంచ్ :
లావా స్ట్రోమ్ 5జీ ఫోన్ డిసెంబర్ 21న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. కంపెనీ షేర్ చేసిన టీజర్‌ల ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వెబ్‌సైట్‌లో, అమెజాన్ ఇండియాలో మైక్రోసైట్‌ని క్రియేట్ చేసింది. ఈ కొత్త హ్యాండ్‌సెట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌లో డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్ ఉండనుంది. దీనికి సంబంధించి పోస్టర్‌లు వీడియోలు వైరల్ అవుతున్నాయి.

Lava Storm 5G Launch Set for December 21
మూడు వృత్తాకార ఆకారపు రింగులు, హౌసింగ్ కెమెరా సెన్సార్లు, ఎల్ఈడీ ఫ్లాష్ బ్యాక్ లెఫ్ట్ కార్నర్‌లో వర్టికల్‌గా అమర్చి ఉంటాయి. ఈ డివైజ్ బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో కూడా అందుబాటులో ఉండనుంది. లెఫ్ట్ సైడ్ పవర్ బటన్‌తో కనిపిస్తుంది. ఫింగర్ ఫ్రింట్ స్కానర్ కూడా ఉండనుంది.
లావా స్ట్రోమ్ 5జీ ధర వివరాలివే :
లావా స్ట్రోమ్ 5జీ ఫోన్ ధర వివరాలు, స్పెసిఫికేషన్‌లు ప్రస్తుతానికి తెలియవు. అయితే, టిప్‌స్టర్ ముకుల్ శర్మ ప్రకారం.. ఈ 5జీ ఫోన్ ధర రూ. 15వేల మధ్య ఉండవచ్చు. 8జీబీ ర్యామ్‌తో మీడియాటెక్ డైమెన్సిటీ 6080 ఎస్ఓసీతో రన్ అవుతుంది. ఆన్‌బోర్డ్ మెమరీ 16జీబీ వరకు విస్తరణకు సపోర్టు ఇస్తుంది. 8ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాను కలిగి ఉంటుంది. లావా స్ట్రోమ్ 5జీ ఫోన్ కంపెనీ దాదాపు ఒక నెల తర్వాత వస్తుంది. దేశంలో లావా బ్లేజ్ 2 5జీ ఫోన్ 4జీబీ ర్యామ్ + 64జీబీ స్టోరేజీ మోడల్ ధర రూ. 9,999 ఉండవచ్చు.
లావా బ్లేజ్ 2 5జీ ఆండ్రాయిడ్ 13లో రన్ అవుతుంది. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో 6.56-అంగుళాల హెచ్‌డీ+(720×1,600 పిక్సెల్‌లు) డిస్‌ప్లేను కలిగి ఉంది. 6జీబీ వరకు ర్యామ్‌తో పాటు ఆక్టా-కోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ఎస్ఓసీపై రన్ అవుతుంది. 50ఎంపీ ప్రైమరీ సెన్సార్ నేతృత్వంలోని డ్యూయల్ రియర్ కెమెరా యూనిట్‌ను కలిగి ఉంది. సెల్ఫీలు, వీడియో చాట్‌లకు స్క్రీన్ ఫ్లాష్‌తో ముందు భాగంలో 8ఎంపీ కెమెరాను కలిగి ఉంది. ఈ ఫోన్ 128జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌తో వస్తుంది. దీనిని 1టీబీ వరకు విస్తరించవచ్చు. దీనికి 18డబ్ల్యూ ఛార్జింగ్‌కు సపోర్టుతో 5,000ఎంఎహెచ్ బ్యాటరీ సపోర్టు అందిస్తుంది.